- కేసీఆర్‌కి కర్రు కాల్చి వాత పెట్టె రోజు దగ్గరలోనే వుంది
- కార్మికులు రైతులు, గోసలు ఊరికే పోవు …
- దుశ్శాసన ఎమ్మెల్యే దుర్మార్గం…
- ఎంపీ ఎమ్మెల్యే ఇద్దరు కుమ్మక్కై పేదల భూములు కబ్జా చేస్తారా?
- కొత్త సంవత్సరంలో కొత్త ప్రభుత్వం…అది కాంగ్రెస్ ప్రభుత్వమే…
- పోదు భూములకు అందరికీ పట్టాలు ఇస్తాం…
- హాత్ సే హాత్ జోడో యాత్రలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
మహబూబాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 08 : కార్మికులు రైతులు నిరుద్యోగుల గోసలు ఊరికే పోవని కేసీఆర్ ప్రభుత్వానికి కర్రు కాల్చి వాత ఇట్టే రోజు దగ్గరలోనే ఉందని పీసీసీ అధ్యక్షుడు అనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నాయకులను విమర్శించారు. బుధవారం హాత్• సే హాత్• జోడో యాత్రలో భాగంగా జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన ప్రజా యాత్ర సభలో భాగంగా మాట్లాడుతూ..రాష్ట్రంలో ఏ అన్యాయం జరిగిన అక్కడ భారాస నాయకులూ వున్నారని.ప్రతి దోపిడీ వెనుకవారి హస్తం ఉందన్నారు. మిగులు బడ్జెట్‌గా వున్న రాష్ట్రంలో అప్పుల మాయంగా మార్చింది ఎవరో ప్రజలు ఆలోచించాలి అన్నారు. పేదల చెమటతో నిర్మించిన ప్రగతి భవన్లో పేదలకు అవకాశం లేదని కేవలం ఉద్యమ ద్రోహులు మాత్రమే వున్నార్నరు. రాష్ట్రంలో ఆదివాసీ గిరిజనులకు కాంగ్రెస్ పాలనలో ఇచ్చిన పోడు భూముల పట్టాలు కేసీఆర్ గుంజుకున్నారని 7 సంవత్సరాల పాలనలో ఏ ఒక్క గిరిజనుడికి ఎకరం భూమి ఇచ్చిన పాపాన పోలేదన్నారు. 317 జిఓ పేరుతో ఉద్యోగులను మోసం చేసి చెట్టుకొక్కరిని పుట్టకొకరిని చేసారని విమర్శించారు. జిల్లాలో యాత్ర మొదలు పెట్టిన నుంచి అన్నాయి సమస్యలే కనిపిస్తున్నాయని ముఖ్య మంత్రి ఇచ్చిన హామీ ఏ ఒక్కటి నెరవేరాలదని కేవలం భారాస నాయకుల స్వలాభాపేక్ష కోసమే కాంట్రాక్టర్లు పనులు చేస్తున్నారని విమర్శించారు. రానున్న 2024 నూతన సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం ఖాయమని అన్నారు. కాంగ్రెస్ జెండా ప్రగతి భావన్పై ఎగురవేస్తామని దానికి ప్రజలంతా ఏకతాటిపైనా వుంది కాంగ్రెస్ పార్టీకి వోటు వేయాలన్నారు.
దుశ్శాసన ఎమ్మెల్యే దుర్మార్గం… ఎంపీ, ఎమ్మెల్యే ఇద్దరూ కుమ్మక్కై పేదల భూములు కబ్జా చేస్తారా?
యాత్రలో భాగంగా ప్రజలు ఈ ప్రాంత ఎమ్మెల్యే శంకర్ నాయక్‌పై పలు కబ్జాలు చేసాడని, బలవంతంగా పేదల భూములు కబ్జా పెట్టాడని, ప్రశ్నించిన వార్డు కౌన్సిలర్ బానోత్ రవి కుమార్‌ని చంపించాడని, అయినా పోలీసులు ఎటువంటి కేసు నమోదు చేయలేదని అన్నారు. మెడికల్ కళాశాల పేరుతో పేద గిరిజన భూములు గుంజుకున్నారని దీని వెనుక ఎంపీ ఎమ్మెల్యే హస్తం ఉందని దుయ్యబట్టారు. ఈ ప్రాంత గిరిజనులను ఇబ్బందులు పెడుతున్న ఎంపి ఎమ్మెల్యేలకు గట్టిగా బుద్ధి చెప్పాలన్నారు. రాబోయే ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యేలుగా కాంగ్రెస్ పార్టీ వారిని గెలిపించి ఈ ప్రాంత సమస్యలను పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క , ఏఐసీసీ ఆదివాసీ గిరిజన ఉపాధ్యక్షులు బెల్లయ్య నాయక్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భరత్ చంద్ర రెడ్డి, పీసీసీ సభ్యులు వెం నరేందర్ రెడ్డి, చెరుకు సుధాకర్, మాజీ మంత్రి బలరాం నాయక్, వెన్నం శ్రీకాంత్ రెడ్డి, ఏఐసీసీ సభ్యులు మురళి నాయక్, మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నూనావత్ రాధా, ఘనపురం అంజయ్య, జెన్నారెడ్డి వెంకటేశ్వర్లు, మాజీ జడ్పిటిసిలు, సర్పంచులు, గ్రామపార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు.