ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలి పట్లోళ్ల

ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలి పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి
సబితారెడ్డికి అభినందనలు తెలిపిన పిఎసిఎస్,మార్కెట్ కమిటి చైర్మెన్లులు

కందుకూరు,ప్రజాతంత్ర,డిసెంబర్ 6 : టిఆర్ఎస్ పార్టీ అధికారంలో లేకున్నా నాయకులు మాత్రం ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని మాజీ విద్యాశాఖ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.బుధవారం కందుకూరు మండలం పిఎసిఎస్ చైర్మన్ దేవర శెట్టి చంద్రశేఖర్,మహేశ్వరం మార్కెట్ కమిటీ చైర్మన్ సురసాని సురేందర్ రెడ్డిలు పలు గ్రామాల నాయకులతో కలిసి విజయదుందుబి మోగించిన సబితమ్మకు పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోయినా తామందరము కలిసి ప్రజల్లోకి వెళ్లి ప్రజలతో కలిసిమెలిసి ఉంటూ ప్రజాసేవకులుగా నిలిచిపోవాలని, ప్రజా సమస్యల పట్ల ప్రతి ఒక్కరు దృష్టి సారించాలని సబితా రెడ్డి తెలియజేశారు. గెలుపు ఓటములు సహజమని అయినా మహేశ్వరం నియోజకవర్గంలో గతంలో కంటే అత్యధిక మెజార్టీతో తనను గెలిపించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ప్రజా సమస్యలపై ఎల్లప్పుడూ పోరాటాలు కాకుండా వారి సమస్యలను తీర్చేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు.మనమందరము అధికారంలో ఉన్నా లేకున్నా ముఖ్యంగా ప్రజల పట్ల మక్కువ ప్రేమ ఆదరాభిమానాలు చూరాగోనే విధంగా ప్రయత్నాలు చేయాలని ఆమె పేర్కొన్నారు. తాను ఎల్లవేళలా మహేశ్వరం నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తూనే ఉంటానని సబితా రెడ్డి పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్రంలో తాము అధికారంలోకి రాకున్నా ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తామని ఆమె పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ మాజీ చైర్మన్ ర్యాపాకు ప్రభాకర్ రెడ్డి,నాయకులు గంగాపురం లక్ష్మీనరసింహారెడ్డి,సురసాని గోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి,సదానందం గౌడ్,పొట్టి ఆనంద్ తదితరులు పాల్గొని అభినందనలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page