ఎన్నికలు సమీపిస్తుడంతో ప్రోసిడింగ్ లతో షో చేస్తున్న ఎమ్మెల్యే
ముఖ్యమంత్రి హామీ నీటి మూటలేనా..!
జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు ఆచారి
ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 12 : ఎన్నికలు సమీపిస్తుండడంతో కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ప్రొసీడింగుల మీద ప్రోసిడింగులు తెస్తూ మరోసారి ప్రజలను మభ్య పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని బిజెపి జాతీయ నేత, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి అన్నారు. మంగళవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఆమనగల్ ప్రభుత్వ ఆసుపత్రి ని 150 పడకలుగా మారుస్తానన్న ముఖ్యమంత్రి హామీ నీటి మూటలుగానే మిగిలిందన్నారు. గతంలో బి ఆర్ఎస్ పార్టీ నాయకులు ఆమనగల్లు ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రి గా పెంచామని ముఖ్యమంత్రి కేసీఆర్ కు పాలాభిషేకం చేశారని ప్రస్తుతం 50 పడకలకు ప్రొసీడింగ్ తీసుకొచ్చి చూపించడం వారి అవివేకానికి నిదర్శనం అని అన్నారు. ముఖ్యమంత్రిని మెప్పించలేని అసమర్ధ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అనీ అన్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రధానమంత్రి సడక్ యోజన కింద మేడిగడ్డ – శంకర్ కొండ తండాలో కలుపుతూ బీటీ రోడ్డుకు నిధులు మంజూరు అయిన బీటీ రోడ్డు నిర్మాణం పూర్తి చేశామని మేడిగడ్డ శంకర్ గ్రామాల మధ్యలో ఉన్న కత్వా వాగు నిర్మాణానికి నిధులు మంజూరై టెండర్లు పిలిచి సంవత్సరం దాటిపోతున్న కాంట్రాక్టర్లను బెదిరించి పనులు చేయించకుండా ఎమ్మెల్యే కాలయాపన చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎప్పటికైనా ఆ ప్రాంత ప్రజల బాధలను అర్థం చేసుకొని బ్రిడ్జి నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని ఆచారి కోరారు.