ప్రజల అభ్యున్నతికి పాటుపడేది కాంగ్రెస్సే

కుత్బుల్లాపూర్, ప్రజాతంత్ర, నవంబర్ 16 : సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీలను విస్మరించారని, ఈ సారి బీఆర్‌ఎస్‌కు ఓటమి తప్పదని, అటు మోదీ, ఇటు కేసీఆర్‌ పాలనుకు స్వస్తి పలికేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కోలన్ హన్మంత్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్ఎల్బి నగర్ హనుమాన్ టెంపుల్ దగ్గర కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కోలన్ హన్మంత్ రెడ్డి వివేకానంద నగర్ మీదగా శ్రీనివాసనగర్ కాలనీ నుండి రుడా మేస్త్రి నగర్, వల్లభాయ్ పటేల్ నగర్ లలో రోడ్ షో నిర్వహించి, ఖాజా పాన్ షాప్ వద్ద కార్నర్ మీటింగ్ తో రోడ్డు షో ముగిసింది. ఈ రోడ్ షో లో హన్మంత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ 6 గారంటీలను వివరించి రాబోయే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని తెలియజేసారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడేది కాంగ్రెస్సే అని అన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీని ఆదరించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సెక్రటరీ జ్యోత్స్నా శివారెడ్డి, బొంగునూరి ప్రభాకర్ రెడ్డి, అవిజె జేమ్స్, సంజీవ్ రెడ్డి, పండరి, డోరా అరుణ్, లలిత, పార్టీ సీనియర్ నాయకులూ కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page