- ఎమర్జెన్సీ రోజు అమలవుతున్నాయి
- రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతల హౌజ్ అరెస్టులపై కెటిఆర్ ఆగ్రహం
ప్రజాపాలనలో ప్రతిపక్షాలు వి•టింగ్ పెట్టుకోవడానికి కూడా అనుమతి లేదా..అంటూ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ నిలదీశారు. ఇందిరమ్మ రాజ్యం అంటూ ఆనాటి ఎమర్జెన్సీ రోజులను అమలు చేస్తున్నారని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ సమావేశం పెట్టుకుంటే ముఖ్యమంత్రికి వెన్నులో వణుకెందుకని కేటీఆర్ ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు, గృహ నిర్బంధాలు చేయడంపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ నేతల హౌజ్ అరెస్టులపై కెటిఆర్ స్పందిస్తూ.. గురువారం బీఆర్ఎస్ నేతలను అర్ధరాత్రి వరకు అక్రమ అరెస్టులు చేసి.. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా హౌస్ అరెస్టులు చేస్తారా..అంటూ ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ నేతలంటే సర్కారుకు ఎందుకింత భయమో చెప్పాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నేతల్ని గృహనిర్భంధం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని కేటీఆర్ చెప్పారు.
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన అరికెపూడి గాంధీ అనుచరులైన కాంగ్రెస్ గూండాలను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. దాడి చేసిన వారిని వదిలేసి బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేయడం ఈ ప్రభుత్వం దిగజారుడు విధానాలకు నిదర్శనమని మండిపడ్డారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని..బీఆర్ఎస్ నేతలపై ప్రభుత్వం జులుం చేయడాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించమన్నారు. అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ తీరును రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారని కేటీఆర్ అన్నారు. ప్రశ్నిస్తే చాలు ప్రజాప్రతినిధులపై కూడా దాడులకు తెగబడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై దాడులకు దిగే సంస్కృతిని తీసుకొచ్చారని మండిపడ్డారు. తెలంగాణ ఇమేజ్ను డ్యామేజ్ చేసేలా ప్రవర్తిస్తామంటే బీఆర్ఎస్ సహించదని స్పష్టం చేశారు. ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారని..సమయం వొచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీకి కచ్చితంగా బుద్ధి చెబుతున్నారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అక్రమంగా ముందస్తు అరెస్టులు చేసిన తమ పార్టీ నేతల్ని బేషరతుగా విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో విద్యాశాఖ శనివారం నుంచి స్కూళ్లకు వరుసగా సెలవులను ప్రకటించింది. కాగా కొన్ని రాష్ట్రాల్లో 4 రోజులు సెలవు ఉంటే.. మరికొన్ని రాష్ట్రాల్లో 5 రోజులు ఉన్నాయి. ఇక మన రాష్ట్రంలో మాత్రం విద్యార్థులకు వరుసగా మూడు రోజులు సెలవులు వొస్తున్నాయి. సెప్టెంబర్ నెల 14వ తేదీ రెండో శనివారం, 15వ తేదీ ఆదివారం కావడం వల్ల వరుసగా 2 రోజులు సెలవులు. అయితే 16న మిలాద్ ఉన్ నబీ కాబట్టి..ఆ రోజు సెలవు ఉంటుందనీ, 17న వినాయక నిమజ్జనోత్సవం కారణంగా ఆ రోజు కూడా సెలవు ఉండటం వల్ల వరుసగా 4 రోజులు సెలవులు వొస్తాయని విద్యార్థులు భావించారు. అయితే..16న మిలాద్ ఉన్ నబీ పండుగ తేదీ మారింది. ఈ పండుగను 16న కాకుండా 17న జరుపుకోనున్నారు. దాంతో ప్రభుత్వం కూడా 16వ తేదీన సెలవును రద్దు చేసి..17వ తేదీన ఇస్తున్నట్లు ప్రకటించింది. అయితే నెలవంక 16న కనిపించినట్లయితే అదే రోజు సెలవు ఉండనుంది. దీంతో వరుసగా 4 రోజులు సెలవులు ఉండే అవకాశం ఉంది.
తెలుగు ప్రజలకు ప్రధాని చవితి కానుక
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి
ఈ నెల 16న ప్రధాని మోదీ తెలుగు రాష్ట్రాల్లో 2 కొత్త వందే భారత్ రైళ్లను ప్రారంభించనున్నారు. నాగ్పూర్ – హైదరాబాద్, దుర్గ్-విశాఖపట్టణం మధ్య రెండు వందే భారత్ రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. ఈ సందర్భంగా దిల్లీ తర్వాత హైదరాబాద్ నుంచే అత్యధికంగా వందేభారత్ రైళ్ల అనుసంధానత కలిగిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. వయోవృద్ధుల సంక్షేమానికి ప్రధాని మోదీ ఆపన్న హస్తం అందించారని కేంద్రమంత్రి తెలిపారు. 70 ఏళ్లు దాటిన వారందరికీ రూ.5 లక్షల వరకు ఆరోగ్య బీమా కల్పించారని, దీంతో పేద, ధనిక తేడా లేకుండా 6 కోట్ల మంది వయోవృద్ధులకు లబ్ది చేకూరనుందన్నారు. వొచ్చే రెండేళ్లలో ఈ పథకంపై రూ.3,437 కోట్లను కేంద్రం ఖర్చు చేయనుందని, తెలంగాణ నుంచి అదనంగా మరో 10 లక్షల మంది సీనియర్ సిటిజన్లకు లబ్ది జరగనుందని, 70 ఏళ్లు దాటిన వయో వృద్ధులందరికీ.. ఈ పథకం కోసం ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇవ్వనున్నట్లు కేంద్రం ప్రకటించిందని తెలిపారు. ఇప్పటికే ఆయుష్మాన్ పరిధిలో ఉన్న కుటుంబాల్లోని 70 ఏళ్లు దాటిన వయోవృద్ధులకు అదనంగా ఏడాదికి రూ.5లక్షల టాప్-అప్ కవర్ ఇవ్వనుందని, కేంద్రం నిర్ణయంతో..వయోవృద్ధుల్లో హర్షం నెలకొందని, వయోవృద్ధులపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్న ప్రధాని మోదీకి కిషన్రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.