రేపు ప్రత్యేక విమానంలో రానున్న మోదీ
వందేభారత్ రైలుకు పచ్చ జెండా..సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ విస్తరణకు శంకుస్థాపన
భారీ భద్రతా ఏర్పాట్లలో అధికారులు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 6 : ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన ఖరారయ్యింది. ఈ మేరకు షెడ్యూల్ కూడా విడుదల చేసారు. రేపు శనివారం ఉదయం 11:30 నిమిషాలకు ప్రధాని ప్రత్యేక విమానంలో బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అక్కడి నుండి 11:45కు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకొని..11:45-12 గంటల వ్యవధిలో వందే భారత్ ట్రైన్ ప్రారంభిస్తారు. 12:05 నిమిషాలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి పెరేడ్ గ్రౌండ్‌కు వెళ్తారు మోదీ. 12:15 నిమిషాలకుకు పెరేడ్ గ్రౌండ్‌కు చేరుకొని..1: 20 నిమిషాల వరకు పెరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బీజేపీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. అనంతరం అక్కడి నుండి 1:35 నిమిషాలకు బేగంపేట్ విమానాశ్రయంకు చేరుకుని విమానంలో ప్రధాని మోదీ చెన్నై వెళ్లనున్నారు. ఆయన ఈ పర్యటనలో మొత్తం రెండుగంటల పాటు నగరంలో పర్యటించనున్నారు. ఇక ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ప్రధాని రాక సందర్భంగా సికింద్రాబాద్ రైల్వే రక్షణ దళం, సికింద్రాబాద్ రైల్వే పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా రైల్వేస్టేషన్‌లోని 10 నెంబర్ ప్లాట్‌ఫామ్‌పై పలు ఎక్స్‌ప్రెస్ రైళ్ల రాకపోకలు మళ్లించనున్నారు. సాయంత్రం వరకు ఆ ప్లాట్‌ఫాంపై రైళ్ల రాకపోకలు ఉండకుండా చర్యలు చేపట్టారు. దీనిపై ప్రయాణికులకు రైల్వే టీటీలు ముందస్తు అవగాహన కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ప్రధాని మోదీ సభ ఉంటుంది. అంతకుముందు సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందేభారత్ రైలును జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఇది దేశంలో 13వ వందేభారత్ రైలు. ఈ రైలు కారణంగా సికింద్రాబాద్-తిరుపతిల మధ్య ప్రయాణ సమయం 12 గంటల నుంచి ఎనిమిదిన్నర గంటలకు తగ్గిపోనుంది. ఇక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణలో భాగంగా రూ. 715 కోట్లు ఖర్చు చేసి అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు.
ఇందులో భాగంగా రాబోయే 40 సంవత్సరాల వరకు ప్రయాణికులకు అవసరమైన సౌకర్యాలను అందించటానికి వీలుగా రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న 25,000 మంది ప్రయాణికుల నుండి రద్దీ సమయంలో 3,25,000 మంది ప్రయాణికులకు కూడా సౌకర్యాలను అందించగలిగేలా రైల్వే స్టేషన్ సామర్థ్యాన్ని పెంచనున్నారు. రైల్వే స్టేషన్లో ప్రస్తుతం ఉన్న బిల్డింగ్ ఏరియాను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దనున్నారు. టెర్మినల్ బిల్డింగ్ నుంచి అన్ని ప్లాట్‌ఫామ్స్‌ను కలిపేలా 108 వి•టర్ల ప్రత్యేక డబుల్ లెవెల్ వంతెనను ఏర్పాటు చేయనున్నారు. ఆధునికీకరణ పనులలో భాగంగా ఈస్ట్, వెస్ట్ మెట్రో స్టేషన్లకు, రైతిఫిల్ బస్‌స్టేషన్‌కు నేరుగా కనెక్టివిటీని ఏర్పాటు చేయనున్నారు. మల్టీలెవెల్ కార్ పార్కింగ్, వొచ్చివెళ్ళే ప్రయాణికులకు ప్రత్యేక మార్గాల ఏర్పాటు వంటి అనేక వసతులను అభివృద్ధి పనులలో భాగంగా కల్పించనున్నారు.