ప్రపంచ శాంతికి శ్రీ రామ్ టెంపుల్ ఆఫ్ యూఎస్ఏ ఖగోళ యాత్ర

•ఆగస్ట్  17న ప్రారంభమై సెప్టెంబర్ 17న యాత్ర ముగింపు
•2016 నుండి అమెరికాలో శ్రీ భద్రాద్రి రామాలయ కార్యక్రమాలు
•శ్రీరామ్ టెంపుల్ ఆఫ్ యూఎస్ఏ అర్చకులు పద్మనాభచార్యులు
 అమెరికాలోని అట్లాంటాలో నిర్మాణం అవుతున్న శ్రీభద్రాద్రి రామాలయం తరపున ప్రపంచ శాంతి కోసం ఖగోళ యాత్ర(భూ మండల ప్రదక్షణ యాత్ర) నిర్వహిస్తున్నట్లు అమెరికాలోని అట్లాంట నగరంలోని శ్రీ రామ్ టెంపుల్ ఆఫ్ యూఎస్ఏ ప్రధాన అర్చకులు అర్చకం పద్మనాభచార్యులు పేర్కొన్నారు. రాబోయే ఆగస్ట్  17న మోక్షపూరి అయిన శ్రీ రామచంద్ర ప్రభు జన్మస్థానం అయోధ్యలో ఖగోళ యాత్ర ప్రారంభమై కాంబోడియా, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, అర్జెంటేనా, కాలిఫోర్నియా, అలస్కా, ఐస్లాండ్, జపాన్, దేశాల మీదుగా పర్యటన చేస్తూ రాబోయే సెప్టెంబర్ 17న తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచల క్షేత్రంలో ముగుస్తుందన్నారు. ఈ మేరకు గురువారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2016 సం. నుండి అమెరికాలోని అట్లాంటాలో శ్రీ భద్రాద్రి రామాలయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా ఉత్సవ విగ్రహాలకు సీతారామ శాంతి కల్యాణోత్సవం, జప, హోమ, అర్చన అభిషేకాదులు నిర్వహిస్తూ చేస్తున్న ఖగోళ యాత్ర గురించి వారు వివరించారు. ఖగోళ యాత్ర నిర్వహించేటువంటి సమయంలో అర్చక బృందం ద్వారా అంతరిక్షంలో 27 నక్షత్రాలు, 9  విగ్రహాలకు, 12 రాశులకు, 8 మంది అష్టదిక్పాలకులకు, జపాలు నిర్వహిస్తూ హోమ పూర్ణాహుతి ద్వారా భద్రాద్రి సీతారాముల వారి శాంతి కల్యాణాలు నిర్వహిస్తారన్నారు. గత 5 వేల సం.లలో కలియుగంలో కనివిని ఎరుగని ఈ యాత్ర దైవ సంకల్పంతో జరుగనుందని చెప్పారు. కావున ఈ కార్యక్రమంలో యావత్ ప్రజానీకం పాల్గొని ఖగోళ యాత్రను దిగ్విజయం చేసి సీతారామచంద్ర ప్రభువుల ఆశీర్వాదం పొందవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో హిందూ దేవాలయ పరిరక్షణ సమితి తరుపున అమర్ నాథ్ మల్లి వేముల, ఇండియా కమిటీ మెంబర్స్ శైలజ, అరుణ, కృష్ణకుమారి, భార్గవి సూర్య, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page