వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, ఆగస్ట్ 2 ; వికారాబాద్ ఎమ్మార్వో ఆఫీస్ లో ఉద్యోగం ఇప్పిస్తానని భార్యాభర్తలను మోసం చేసిన కిలాడీ లేడీని వికారాబాద్ పోలీసులు అరెస్టు చేసి నిందితురాలి నుండి 2,50,000 నగదు సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నామని వికారాబాద్ డిఎస్పి నర్సింలు మీడియా సమావేశంలో తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రస్తుత మంచిర్యాల జిల్లా కు చెందిన గోమాస శిరీష అలియాస్ అనూష అనే యువతి తను రెవెన్యూ డిపార్ట్మెంట్ లో తహసిల్దార్ గా పనిచేస్తున్నానని, వికారాబాద్ తాసిల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఖాళీగా ఉందని హైదరాబాద్ మౌలాలి కి చెందిన వాణిరెడ్డి కృష్ణారెడ్డి అనే భార్య భర్తలకు ఉద్యోగం ఇప్పిస్తానని రెండు లక్షలు యాభై వెయ్యి ల రూపాయల నగదును తీసుకొని నకిలీ ఆర్డర్ కాపీలపై వికారాబాద్ జిల్లా కలెక్టర్ అధికారుల సంతకాలను ఫోర్జరి చేసి ఇవ్వగా, ఉద్యోగం లో చేరెందుకు నకిలీ పత్రాలు తీసుకొని వికారాబాద్ కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన వాణి రెడ్డి కృష్ణారెడ్డిలు తము మోసపోయామని గ్రహించి వికారాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని నిందితురాలిని అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించామని వికారాబాద్ డిఎస్పి తెలిపారు, ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని మాయ మాటలు చెప్పి డబ్బులు వసూలు చేసే వ్యక్తుల పట్ల ప్రజలు జాగ్రత్త ఉండి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని డి.ఎస్.పి తెలిపారు.