ప్రస్తుత వర్షాకాలంలో సబ్ స్టేషన్ ఆపరేటర్లు అప్రమత్తంగా ఉండాలి

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్టు 3 : ప్రస్తుత వర్షాకాల సీజన్ లో ఆమనగల్  విద్యుత్ సబ్ డివిజన్ లోని ఆమనగల్లు, తలకొండపల్లి, మాడుగుల, కడ్తాల్ మండలాల్లో పనిచేస్తున్న సబ్ స్టేషన్ ఆపరేటర్లు అప్రమత్తంగా ఉండి రైతులు, ప్రజలను ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్త వహించాలని రాజేంద్రనగర్ సర్కిల్ ప్రొటెక్షన్ అండ్ ఇంజనీర్ టి ఆర్ ఈ డి ఈ భాస్కర్ రావు అన్నారు. గురువారం అమనగల్లు విద్యుత్ సబ్ డివిజన్ కార్యాలయంలో సబ్ స్టేషన్ ఆపరేటర్లు ఏఈలతో కరెంట్ సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆపరేటర్లకు పలు సూచనలు సలహాలు అందించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భాస్కర రావు మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన విద్యుత్ ఎటువంటి అంతరాయం లేకుండా అందించాలని సూచించారు. సంస్థను కాపాడుతూ వినియోగదారుల సమస్యలను పరిష్కరించాలన్నారు. సబ్ స్టేషన్ పరిధిలో ఎలాంటి సమస్యలు ఉన్న సంబంధిత ఏ డి ఈ ఏఈకి సమాచారం అందించి పరిష్కరించుకోవాలన్నారు. ఆమనగల్ సబ్ డివిజన్లో 22 సబ్ స్టేషన్ ఉన్నాయని సబ్ స్టేషన్లను రక్షిస్తూ విద్యుత్ పరికరాల పనితీరు మెరుగుపరచుకోవాలన్నారు. ఆపరేటర్లు తమను తాము రక్షించుకుంటూ సంస్థను కాపాడాలని ప్రతిజ్ఞ చేయించారు. ఈ సమావేశంలో టి ఆర్ ఈ ఏడి కే. సరిత, ప్రొటెక్షన్ ఏడీఈ మదన్ మోహన్ రెడ్డి, ఆమనగల్ విద్యుత్ సబ్ డివిజన్ ఏడిఈ శ్రీనివాస్, ఏఈ సీతారా ములు, వివిధ మండలాల ఏఈలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page