బడ్జెట్‌లో తెలంగాణకు తీరని అన్యాయం

  • ఎపి, బీహార్‌ల కోసమే పెట్టారు
  • మండిపడ్డ రాష్ట్ర కాంగ్రెస్‌ ఎంపిలు

న్యూదిల్లీ, జూలై 23 : కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం చేశారని కాంగ్రెస్‌ ఎంపీలు మల్లు రవి, కడియం కావ్య, గడ్డం వంశీకృష్ణలు అన్నారు. ఆంధ్రప్రదేశ్‌, బీహార్‌ రాష్ట్రాల కోసమే బడ్జెట్‌ పెట్టినట్లు ఉందని విమర్శించారు. వాళ్ల ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకే రెండు రాష్ట్రాలకు కేటాయింపులు చేశారని మండిపడ్డారు. దిల్లీ వేదికగా మల్లు రవి విూడియాతో మాట్లాడుతూ…విభజన చట్టం గురించి చాలసార్లు ప్రస్తావించారు కానీ తెలంగాణ అన్న పదం కూడా వాడలేదని ధ్వజమెత్తారు.

హైదరాబాద్‌ మినహా 9 జిల్లాలు వెనుకబడిన జిల్లాలుగా గుర్తించినప్పటికి తెలంగాణకు కేటాయింపులు లేవని..ఈవిషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు నిధులు కేటాయించడంలో తమకు అభ్యంతరం లేదని, కానీ తెలంగాణకు కేటాయింపులు లేకపోవడం బాధాకరమని చెప్పారు. పాలమూరు జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి పూర్తిచేయాలని సీఎం, మంత్రులు విజ్ఞప్తి చేసిన పట్టించుకోలేదని అన్నారు. విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హావిూల ప్రస్తావన లేకపోవడం దారుణమని మండిపడ్డారు.

తెలంగాణ నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు గెలిచారని, ఇద్దరు మంత్రులు ఉన్నారని, అయిన తెలంగాణకు దక్కిందేమీ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలకు బీజేపీ ఎంపీలు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. వొచ్చే ఎన్నికల్లో బీజేపీకి బుద్దిచెప్పాలని అన్నారు. తెలంగాణ హక్కుల సాధనకు అందరూ ఎంపీలు కలిసికట్టుగా పోరాడేందుకు ముందుకు రావాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ, ఎంఐఎం ఎంపీలను కలిసి ఉమ్మడి పొరటాలపై చర్చిస్తామని తెలిపారు. తెలంగాణ హక్కుల సాధనకు అలుపులేని పోరాటం చేస్తామని ఎంపీ మల్లు రవి పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్‌ తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు.

తెలంగాణకు కేటాయింపుల్లో కేంద్రంలోని బీజేపీ పూర్తిగా విఫలమైందన్నారు వంశీకృష్ణ. తెలంగాణ ప్రజలకు బీజేపీ ఎంపీలను సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర విభజన సందర్భంగా తెలంగాణకు ఇచ్చిన హావిూలపై ఎలాంటి కేటాయింపులు లేవని అన్నారు. బ్జడెట్‌లో తెలంగాణ విభజన హావిూల ప్రస్తావన లేకపోవడం బాధాకరం అన్నారు. గత పదేండ్లలో బీజేపీ, బీఆర్‌ఎస్‌లు రాష్ట్రానికి తీరని అన్యాయం చేశాయన్నారు ఎంపీ వంశీకృష్ణ. మంగళవారం ప్రవేశపెట్టిన బ్జడెట్‌ పూర్తి పొలిటికల్‌ బ్జడెట్‌ అన్నారు ఎంపీ వంశీకృష్ణ. బీజేపీకి మద్దతిస్తున్నందుకే ఆంధప్రదేశ్‌, బీహార రాష్ట్రాలకు నిధులు వరద పారించారన్నారు. దేశంలో నిరుద్యోగం భారీగా పెరిగిపోయిందన్నారు. బడ్జెట్‌లో యువతను పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. పార్లమెంట్‌లో కొట్లాడి తెలంగాణకు నిధులు తెస్తామన్నారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page