శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, నవంబర్ 7: శేరిలింగంపల్లి నియోజక వర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మ బండ కి చెందిన వడ్డెర సంఘం నాయకులు, కార్యకర్తలు యువకులు బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ మేరకు మంగళవారం ఆల్విన్ కాలనీ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు జిల్లా గణేష్ ఆధ్వర్యంలో కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ సమక్షంలో పలువురికి ప్రభుత్వ విప్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ బీఆర్ ఎస్ పార్టీ కండువాలు కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గం ను అన్ని రంగాల్లో ఎంతగానో అభివృద్ధి చేశామని, తనను మళ్ళీ గెలిపిస్తే రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తామని, పార్టీ కి కార్యకర్తలే పట్టుకొమ్మలు అని, అభివృద్ధి సంక్షేమం టిఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని నమ్మిన యువత అంతా బీఆర్ఎస్ వైపే ఉందని,యువత రోజురోజుకు పెద్ద పెద్ద సంఖ్యలో పార్టీలో చేరుతున్నారన్నారు. తాను చేసిన అభివృద్ధి పనులే తనను మళ్ళీ గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని రాబోయేది టిఆర్ఎస్ ప్రభుత్వమేనని ప్రతి ఒక్కరికి సముచిత న్యాయం జరుగుతుందని ప్రతి ఒక్కరు సైనికుడిగా పనిచేసి,బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయాలని పేర్కొన్నారు, అందరికి మంచి భవిష్యత్తు ఉంటుందని, ప్రతి ఒక్క కార్యకర్తను కంటికి రెప్పలా చూసుకుంటామని, ప్రతి ఒక్కరు కష్టపడి పార్టీని గెలిపించి బంగారు తెలంగాణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.బీఆర్ఎస్ పార్టీ లో చేరిన వారిలోముఖ్య నాయకులు వడ్డెర సంఘం ఎల్లమ్మబండ నాయకులు రూపాని యదగిరి, కొండయ్య, మహేష్ వర్మ, ఇదయ్య, శ్రీను ఎల్లయ్య, యాదయ్య, దుర్గయ్య, ప్రభాకర్, యాదయ్య, రంగయ్య, వెంకటేష్, లింగయ్య, శ్రీను ,గణేష్ తదితరులు ఉన్నారు.ఈ కార్యక్రమంలో ఆల్విన్ కాలనీ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సమ్మారెడ్డి, గౌరవ అధ్యక్షులు అనిల్ రెడ్డి , మాజీ అధ్యక్షులు జిల్లా గణేష్ తదితరులు పాల్గొన్నారు.