బిగ్గెస్ట్ ‌టోర్నమెంట్‌ ఆఫ్‌ ‌ద ఇయర్‌-2022‌గా సిఎం కేసీఆర్‌ ‌క్రికెట్‌ ‌ట్రోఫీ

  • కప్‌ ‌బెస్ట్ ఆర్గనైజర్‌ ‌మంత్రి హరీష్‌రావు
  • ప్రముఖ క్రిక్‌ ‌యాప్‌ ‌ద్వారా జాతీయ స్థాయిలో అవార్డు
  • 19 లక్షల మంది ప్రేక్షకులు…256 మ్యాచ్‌లు, 257 టీమ్స్..5‌వేల మంది క్రీడాకారులు..
  • మంత్రి హరీష్‌రావు సారథ్యంలో దేశంలో బిగ్గెస్ట్ ‌టోర్నీగా గుర్తింపు
  • ఆర్గనైజర్స్‌ను అభినందిస్తూ..సిద్ధిపేట క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి హరీష్‌రావు
  • మా బాధ్యతను పెంచింది : నిర్వాహకులు వేణుగోపాల్‌రెడ్డి, మల్లికార్జున్‌

సిద్ధిపేట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 7 : సిద్ధిపేట అంటే అన్నింటిలో ఆదర్శం..ఆవార్డులలో సిద్ధిపేట పేరు లేకుండా అవార్డు ఉండదని మంత్రి హరీష్‌రావు ఎన్నో మార్లు చెప్పిన సందర్భం. అది విద్యా..వైద్యం..స్వచ్ఛత..పచ్చదనం ఇలా అది ఇది అని కాదు ఎందులోనైనా సరే జాతీయ, రాష్ట్ర స్ధాయి అవార్డు ఉండాల్సిందే…అని మరోసారి నిరూపించింది సిద్ధిపేట. కొత్తగా క్రీడలో కూడా జాతీయ స్థాయిలో అవార్డు సాధించింది.  చేసే పనికి సార్ధ•కత ఉన్నపుడు  సంతృప్తి అని మంత్రి హరీష్‌రావు..సంకల్పం ఆ సంకల్పం అన్ని రంగాల్లో నెరవేరితుంది అంటే సిద్ధిపేట అన్ని వర్గాల భాగస్వామ్యం అని చెప్పక తప్పదు. అన్నింటిలో అవార్డు వొచ్చింది బాగానే ఉంది ఈ క్రికెట్‌లో అవార్డు రావడం ఏం•ని ఆశ్చర్యం కలగొచ్చు. కానీ, అదే సిద్ధిపేటకు మంత్రి హరీష్‌రావు చేసే అభివృద్ధి పని తీరుకు నిదర్శనం. గత మూడేళ్లుగా మంత్రి హరీష్‌రావు ఆధ్వర్యంలో సిద్ధిపేట క్రికెట్‌ ‌స్టేడియంలో జరుగుతున్న సిఎం కేసీఆర్‌ ‌క్రికెట్‌ ‌టోర్నీకి గొప్ప అరుదైన గౌరవం దక్కింది. 2022లో సీజన్‌-2 ‌దేశంలోనే బిగ్గెస్ట్ ‌టోర్నీగా రికార్డ్‌కు ఎక్కింది.

ప్రముఖ ప్రతిష్టాత్మకంగా ఉన్న ‘క్రిక్‌ ‌హీరోస్‌’ ఇచ్చే దేశ స్థాయి అవార్డు సిఎం కేసీఆర్‌ ‌కప్‌ ‌దేశంలోనే అత్యధిక టీమ్స్ ‌పాల్గొనడం, మ్యాచ్‌లు నిర్వహించినందుకు క్రిక్‌ ‌హీరోస్‌ ‌జాతీయ స్థాయిలో అవార్డు లభించింది. నిన్నటి రోజు క్రిక్‌ ‌హీరోస్‌ ‌యాప్‌ ‌పలు విభాగాల్లో అవార్డులు ఇచ్చింది. ది బిగ్గెస్ట్ ‌టోర్నీ ఆఫ్‌ ‌ద ఇయర్‌గా సిఎం కేసీఆర్‌ ‌కప్‌ అని, బెస్ట్ ఆర్గనైజర్‌గా మంత్రి హరీష్‌రావు  అని ప్రశంసిస్తూ అవార్డును ప్రకటించింది.19 లక్షల మంది ప్రేక్షకులు…256 మ్యాచ్‌లు, 257 టీమ్స్..5‌వేల మంది క్రీడాకారులు..
మూడేళ్ల కిందట సిఎం కేసీఆర్‌ ‌పుట్టిన రోజు పురస్కరించుకుని మంత్రి హరీష్‌రావు సిఎం కేసీఆర్‌ ‌క్రికెట్‌ ‌టోర్నీకి శ్రీకారం చుట్టారు. అపూర్వ స్పందనతో యువతలో కొత్త ఉత్సహంతో ప్రారంభమైన సిఎం కేసీఆర్‌ ‌క్రికెట్‌ ‌కప్‌ ‌మొదటి సంవత్సరం ఎన్నో పాఠాలు నేర్పిన ఈ టోర్నీ రెండవ సంవత్సరం అవార్డు స్థాయికి చేరింది. మంత్రి హరీష్‌రావు ఇచ్చిన ప్రొత్సహం, టోర్నీ ఆర్గనైజర్ల పని తీరు యువతలో నింపిన స్ఫూర్తికి నిదర్శనం అని చెప్పక తప్పదు.

అందుకు సాక్ష్యం ఈ క్రిక్‌ ‌హీరోస్‌ అవార్డే. రెండవ సంవత్సరం ప్రారంభం కంటే ముందు నిర్వహకులు జాతీయ స్థాయిలో స్కోరింగ్‌..ఆన్‌లైన్‌ ‌స్కోరింగ్‌ ‌చేయాలని సంకల్పించుకున్నారు మంత్రి హరీష్‌రావు. అందుకు పూర్తి సహకారం ఇచ్చి క్రిక్‌ ‌హీరోస్‌ ‌యాప్‌ను అందిపుచ్చుకున్నారు. సిఎం కేసీఆర్‌ ‌టోర్నీ రాష్ట్రంలో ఎంతో పేరు గాంచింది. సిద్ధిపేటలో మంత్రి హరీష్‌రావు ఆధ్వర్యంలో సిఎం కేసీఆర్‌ ‌టోర్నీ నిర్వహిస్తున్నారు అని ప్రతి నోట వినిపిచింది. ‘క్రిక్‌ ‌హీరోస్‌’  ‌యాప్‌ను ప్రతి ఒక క్రీడాకారుడు సిద్ధిపేటలోనే కాదు ఇతర ప్రాంతాల్లో కూడా కేసీఆర్‌ ‌కప్‌ ఏప్పటికిప్పుడు ఆన్‌లైన్‌లో చూస్తూ 19 లక్షల మంది ప్రేక్షకుల అభిమానాన్ని చాటుకుంది. 256 మ్యాచ్‌లతో, 257 టీమ్స్‌తో దేశ చరిత్రలో అవార్డుకు ఎంపికైంది. 2022 సంవత్సరం బిగ్గెస్ట్ ‌టోర్నీగా ..బెస్ట్ ఆర్గనైజర్‌గా మంత్రి హరీష్‌రావు పేరు, సిద్ధిపేట పేరు మరోసారి జాతీయ స్థాయిలో మెరిసింది. ఈ నెలలో(ఫిబ్రవరి 17న)సిఎం కేసీఆర్‌ ‌పుట్టిన రోజును పురస్కరించుకుని నిర్వహించే సిఎం కేసీఆర్‌ ‌క్రికెట్‌ ‌ట్రోఫీ సీజన్‌-3 ‌ప్రారంభం రోజున క్రిక్‌ ‌హీరోస్‌ ‌ప్రతినిధులు మంత్రి హరీష్‌రావుకు అవార్డును ప్రదానం చేయనున్నారు.
సిద్ధిపేట యువతకు దక్కిన గౌరవం :  మంత్రి హరీష్‌రావు సిద్ధిపేట క్రీడాకారులకు, యువత  క్రీడా స్ఫూర్తికి  దక్కిన గౌరవం అని మంత్రి హరీష్‌రావు ఆనందం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ..సిద్ధిపేటలో స్టేడియం దినదినాభివృద్ది చేసుకున్నామనీ, అభివృద్ధికి సార్ధకత ఉంటుందా అని నేను మొదట్లో అనుకున్నా. కానీ, అనతి కాలంలోనే గొప్ప క్రీడాస్ఫూర్తిని సిద్ధిపేట క్రీడాకారులు, యువత చాటి చెప్పారు. ఇదే సిఎం కేసీఆర్‌ ‌ట్రోఫీతో ఇద్దరు క్రీడాకారులు రంజీలకు ఎంపికయ్యారన్నారు.  ఇదే క్రికెట్‌ ‌టోర్నీ నేడు సిద్ధిపేట కీర్తిని దేశ స్థాయిలో నిలబెట్టింది. గల్లీ, గ్రామీణప్రాంత  యువకులకు క్రీడా నైపుణ్యాన్ని పెంచేలా సంకల్పించుకున్న ఈ ట్రోఫీ  రేపటి తరంకు ఎంతో మార్గదర్శనం కానుందన్నారు. ఈ ట్రోఫీ ఎంతో మంది రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడాకారులుగా ఎదిగేలా గొప్ప స్ఫూర్తినిచ్చిందన్నారు. ఈ అవార్డు సిద్దిపేట క్రీడాకారులకు, యువకుల దక్కిన గౌరవమన్నారు. అవార్డు ప్రకటించిన క్రిక్‌ ‌హీరోస్‌ ‌యాప్‌కు ధన్యవాదాలు తెలుపుతూ, ఇందులో భాగస్వామ్యం అయిన నిర్వహకులను అభినందించారు. క్రీడాకారులకు యావత్‌ ‌సిద్ధిపేట ప్రజానీకంకు శుభాకాంక్షలు తెలిపారు.

చాలా గర్వంగా ఉంది..మా బాధ్యతను పెంచింది : నిర్వాహకులు వేణుగోపాల్‌రెడ్డి, మల్లికార్జున్‌
ఎం‌తో ప్రతిష్టాత్మక యాప్‌ ‌క్రిక్‌ ‌హీరోస్‌ ‌సిఎం కేసీఆర్‌ ‌క్రికెట్‌ ‌కప్‌కు అవార్డు ఇవ్వడం గొప్ప సందర్భమని, తమకు ఎంతో గర్వంగా ఉందని ఇది మంత్రి హరీష్‌రావు ప్రోత్సహమని సిఎం కేసీఆర్‌ ‌ట్రోఫీ నిర్వహకులు మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, కలకుంట్ల మల్లికార్జున్‌ అన్నారు. మంత్రి హరీష్‌రావు సిద్ధిపేట క్రికెట్‌ ‌స్టేడియం ఏర్పాటు చేయడం ఎంతో మంది యువతకు, క్రీడామాభిమానులకు వేదికైందన్నారు. ఈ వేదికను సద్వినియోగం చేయడం మంత్రి హరీష్‌రావు అభివృద్ధిని అందిపుచ్చుకుని ఈరోజు అవార్డుతో సార్ధకతగా నిలిచారన్నారు. మంత్రి హరీష్‌రావు  అప్పగించిన ఈ గొప్ప బాధ్యతను స్వీకరించి ట్రోఫీకి అవార్డు  రావడం  జన్మకు సార్ధకతగా భావిస్తున్నమనీ,  ఈ అవార్డు మాపై మరింత  బాధ్యతను పెంచిందనీ సంతోషం వ్యక్తం చేస్తూ మంత్రి హరీష్‌రావుకు కృతజ్ఞతలు తెలిపుతూ క్రిక్‌ ‌హీరోస్‌ ‌యాప్‌కు మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, మల్లికార్జున్‌ ‌ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page