బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లతో ముప్పు

విద్వేష రాజకీయాల నుంచి దేశాన్ని రక్షించాలి
ఈ మూడు నెలల్లో మరింత పరిజ్ఞానం పొందుతా
పార్టీ ఎన్నికల్లో అధ్యక్షుడెవరో తెలుస్తుంది
భారత్‌ ‌జోడో యాత్రలో మీడియాతో రాహుల్‌
‌మూడో రోజు నాగర్‌ ‌కోయిల్‌ ‌నుంచి సాగిన యాత్ర

‌కేంద్రంలోని భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌..‌విద్వేషాలను వ్యాప్తి చేస్తున్నాయని కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీ విమర్శించారు. అవి దేశానికి చేసే నష్టాన్ని పూడ్చడానికే భారత్‌ ‌జోడో యాత్ర చేస్తున్నానని తెలిపారు. విద్వేష రాజకీయాల నుంచి దేశాన్ని రక్షించాలన్న నినాదంతో..చేపట్టిన భారత్‌ ‌జోడో యాత్ర శుక్రవారం మూడో రోజుకు చేరింది. తమిళనాడు కన్యాకుమారిలోని నాగర్‌కోయిల్‌లో మూడో రోజు రాహుల్‌ ‌పాదయాత్ర చేశారు. భారత్‌ ‌జోడో యాత్రకు తాను నాయకత్వం వహించడం లేదని తేల్చి చెప్పారు. ‘ఈ యాత్ర ద్వారా తానేంటో, ఈ దేశమేంటో తనకు కొంత అర్థమవుతుందని, రానున్న 2-3 నెలల్లో తాను మరింత రాటుదేలుతానని అని రిపోర్టర్లతో రాహుల్‌ అనగానే.. అక్కడున్న వారంతా ఒక్కసారిగా నవ్వారు. ‘జోడో యాత్ర..కాంగ్రెస్‌ ‌పార్టీ యాత్ర. యాత్రలో పాల్గొనేందుకు పాక్షికంగా ఒప్పుకున్నా. ఎందుకంటే కాంగ్రెస్‌ ‌సిద్దాంతాలను నేను విశ్వసిస్తాను. ఈ యాత్ర ద్వారా వ్యక్తిగతంగా మంచి అనుభవం వొస్తుందని భావిస్తున్నా. 2-3 నెలల తర్వాత నాకు మరింత జ్ఞానం వొస్తుంది. దేశంలో భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌ ‌దేశానికి చేసిన నష్టాన్ని పూడ్చడానికే భారత్‌ ‌జోడో యాత్ర చేపడుతున్నాం. నేను యాత్రకు నాయకత్వం వహించడం లేదు. యాత్రలో పాల్గొంటున్నా. దేశం కోసం పని చేయడం ప్రతిపక్షంలో ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యత. ప్రజా సమస్యలను తెలుసుకుని వారితో మమేకమవ్వడమే భారత్‌ ‌జోడో యాత్ర ప్రధాన ఉద్దేశం. దేశంలోని దర్యాప్తు సంస్థలను భాజపా తన గుప్పిట్లోకి తీసుకుంది’ రాహుల్‌ అన్నారు.

మేము కార్పొరేట్‌ ఇం‌డియా ఆలోచనను వ్యతిరేకించడం లేదు.. చిన్న రైతులు మరియు సూక్ష్మ,మధ్యతరహా పరిశ్రమలకు జరిగిన అన్యాయంకు వ్యతిరేకంగా మేము అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నాం ‘‘ అని గాంధీ తెలిపారు. అనేక సమస్యలతో సతమవుతున్న కాంగ్రెస్‌ను గాడినపెట్టి 2024 సార్వత్రిక ఎన్నికలకు పార్టీని సిద్ధం చేయడమే లక్ష్యంగా.. కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ ‌వరకు సుమారు 3,570 కిమీ  మేర ఈ జోడో యాత్ర సాగనుంది. అయితే కాంగ్రెస్‌ ‌పార్టీ చీఫ్‌గా ఎవరు ఉంటారని అడిగిన ప్రశ్నకు రాహుల్‌ ‌గాంధీ సమాధానం ఇచ్చారు. భారత్‌ ‌జోడో యాత్రలో పాల్గొన్న ఆయన్ను ఈ విషయమై జర్నలిస్టులు ప్రశ్నలు వేశారు. ఆ సమయంలో ఆయన రియాక్ట్ అవుతూ.. కాంగ్రెస్‌ ‌పార్టీ అధ్యక్ష ఎన్నికలు జరిగిన తర్వాతే తాను పార్టీ చీఫ్‌ అయ్యేది లేనిదీ అన్నీ క్లియర్‌గా తెలుస్తాయని అన్నారు. తానేమి  చేయాలో అది డిసైడ్‌ అయ్యానని, దీంట్లో ఎటువంటి గందరగోళం లేదని రాహుల్‌ అన్నారు. భారత్‌ ‌జోడో యాత్రతో ఈ సుందర దేశం నుంచి కొంచెం నేర్చుకుంటానని, ఈ రెండు మూడు నెలల్లో తాను మరింత రాటుదేలే అవకాశాలు ఉన్నట్లు రాహుల్‌ అభిప్రాయపడ్డారు. నవంబర్‌ 17‌వ తేదీన కాంగ్రెస్‌ ‌పార్టీ అధ్యక్ష ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page