బిసి యువత విదేశీ ఉన్నత విద్యకు ప్రభుత్వం అండ

జ్యోతిబాపూలే ఓవర్సీస్‌ ‌పథకం ద్వారా రూ.20 లక్షల ఆర్థిక సహాయం
ప్రతి ఏటా 300 మందికి అవకాశం-వీటిలో 30 సీట్లు ఇబిసిలకు
పేద, మధ్య తరగతి విద్యార్థులకు ప్రభుత్వం భరోసా

హైదరాబాద్‌, ‌సెప్టెంబర్‌ 02 : ‌రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌ ‌రావు నాయకత్వంలో ప్రభుత్వం వెనుకబడిన తరగతులలో విద్యాపరంగా, సామాజికంగా ఉన్న అసమానతలను రూపుమాపడానికి ఫీజు రియింబర్స్ ‌మెంట్‌, ‌ప్రీ మెట్రిక్‌, ‌పోస్ట్ ‌మెట్రిక్‌ ‌స్కాలర్‌ ‌షిప్‌, ‌హాస్టళ్ళు, గురుకులాలను ఏర్పాటు చేసే ప్రోత్సాహం అందిస్తున్నది. వీటితో పాటు విదేశాలలో ఉన్నత విద్య కలలను సాకారం చేసే దిశగా జ్యోతిభా ఫూలే విదేశీ విద్యానిధి పథకాన్ని అమలు చేస్తున్నది. పేద మధ్యతరగతి బిసి కుటుంబాల పిల్లల విదేశీ విద్య కలలను ప్రభుత్వం సుసాధ్యం చేస్తున్నది. 2016లో ఈ పథకాన్ని ప్రారంభించి వెనుకబడిన, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు విదేశాలలో మాస్టర్స్, ‌పిజి, పిహెచ్‌డి కోర్సులకు సహయం అందిస్తున్నది. అమెరికా, బ్రిటన్‌, ఆ‌స్ట్రేలియా, కెనడా, సింగపూర్‌, ‌జర్మనీ, న్యుజిలాండ్‌, ‌జపాన్‌, ‌ఫ్రాన్స్, ‌దక్షిణ కొరియా దేశాలలో విద్య అభ్యసించడానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తున్నది. ఒక్కొక్క విద్యార్థికి 20 లక్షల రూపాయల వరకు ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తున్నది. ప్రతి సంవత్సరం 300 మంది విద్యార్థులను ఇందులో జనవరిలో 150 మందిని, ఆగస్ట్‌లో 150 మందిని ఎంపిక చేస్తారు. వీటిలో 15 సీట్లు ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు రిజర్వు చేయబడతాయి.

ఈ పథకం ప్రారంభమయిన నాటి నుండి ఇప్పటి వరకు దాదాపు 330 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందించబడింది. విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వ సహకారాన్ని సద్వినియోగం చేసుకొని అక్కడే ఉన్నత విద్యను పూర్తిచేసి కొలువులు చేస్తూ బంగారు భవితవ్యానికి బాటలు వేసుకుంటున్నారు. 2016-17 నుండి 2022-23 వరకు ఆస్ట్రేలియాకు 1598 మంది ,కెనడాకు 927, ఫ్రాన్స్‌కు 45, జర్మనీ 306, న్యూజిలాండ్‌ 9, ‌సింగపూర్‌ 17, ‌సౌత్‌ ‌కొరియా 3, బ్రిటన్‌కు 842 అమెరికాకు 2874 మంది వెళ్ళిన విద్యార్థులు జ్యోతిబాపూలే విదేశీ విద్యానిధి పథకం ద్వారా ఆర్థిక సహాయం పొందారు.

అమెరికాలోని ఫ్లోరిడా యూనివర్సిటీ, టెక్సాస్‌ ‌యూనివర్సిటీ, మిచిగాన్‌ ‌టెక్నాలజీ యూనివర్సిటీ మిన్నీసోటా యూనివర్సిటీ, కెనడాలోని కాంకోర్టీయ, లేక్‌ ‌హెడ్‌, ‌వాటర్లు యూనివర్సిటీలు, యుకేలోని యూనివర్సిటీ ఆఫ్‌ ‌నార్త్ ‌హంచెరియా, వెస్‌ అల్‌ ఇం‌గ్లాండ్‌ ‌బ్రిస్టల్‌ ‌ఫ్రెంచ్‌ ‌క్యాంపస్‌, ఆ‌స్ట్రేలియాలోని బెల్‌బోర్న్ ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ ‌టెక్నాలజీ, స్విన్‌ ‌బర్న్ ‌యూనివర్సిటీ ఆఫ్‌ ‌టెక్నాలజీ, జర్మనీలోని ప్లేన్స్ ‌బర్గ్, ‌బట్టోవాన్‌ ‌గురికీ లాంటి యూనివర్సిటీలలో అడ్మిషన్లు పొందారు. ఈ పథకానికి సంబంధించి విదేశీ విద్య ఉపకార వేతనాలకు ఈ సంవత్సరం సెప్టెంబర్‌ 1 ‌నుండి 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వార్షిక ఆదాయం 5 లక్షలు దాటరాదు. డిగ్రీలో కనీసం 60 శాతం మార్కులు కలిగి ఉండాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page