పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 13:బీఅర్ఎస్,కాంగ్రెస్ పార్టీ లకు గట్టి ఝలక్ తగిలింది. బహుజన ఆత్మ గౌరవ పోరాటం చేస్తున్న నీలం మధు ముదిరాజ్ కె మా మద్దతు అంటూ ప్రజలు కదిలి వస్తున్నారు.అమీన్ పూర్ మండలం జానకంపేట చెందిన వార్డ్ మెంబర్ సుధాకర్, యూత్ కాంగ్రెస్ నాయకులు కిషోర్ అద్వర్యంలో నలబై మంది తమ పార్టీలకు గుడ్ బై చెప్పి బీఎస్పీ పార్టీ లో చేరారు.సోమవారం పటాన్ చెరు బీఎస్పీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ వారికి కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మన బహుజనుల ఆత్మ గౌరవంతో రెండు పార్టీలు ఆటలాడుతున్నాయని విమర్శించారు. మన జాతి బిడ్డలకు చట్ట సభలలో అవకాశం వస్తేనే మన సబ్బండ వర్గాల ప్రజలకు అన్ని రంగాలలో అభివృద్ధి సాధవుతుందన్నారు. నన్ను నమ్మి అండగా నిలబడుతున్న ప్రతి ఒక్కరికి ఋణపడి ఉంటానన్నారు.నవంబర్ 30 వరకు నా కోసం మీరు పని చేయండి. ఆ తరువాత ఐదేళ్లు నేను మీ అందరికీ అండగా ఉంటూ సేవ చేస్తానన్నారు. ప్రతి ఒక్కరి క్షేత్ర స్థాయిలో ప్రచారంలో నిమగ్నమై ఒక్కొక్కరు నేనె అభ్యర్థి అని కష్టపడి ప్రజల్లోకి వెళ్లాలని కోరారు. మీ కుటుంబంలో ఒక్కడిని గెలిపించండానికి ప్రజలంతా నవంబర్ 30 న జరిగే ఎన్నికల్లో ఏనుగు గుర్తు పై మీ అమూల్యమైన ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు