- ఎమ్మేల్యే సతీష్ బాబు వల్లనే నిర్వాసితులకు స్పెషల్ ప్యాకేజ్
- ఈరోజు దేశంలో తెలంగాణది సంక్షేమ స్వర్ణ యుగం
- రాష్ట్ర అవతరణ దశాబ్ది
- ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి హరీష్ రావు
కోహెడ మండలం బస్వాపూర్ గ్రామంలో 8 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన ఓపెన్ జిమ్ ను ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు తో కలిసి శుక్రవారం ప్రారంభించిన హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ బాబు
హుస్నాబాద్,ప్రజాతంత్ర,జూన్ 9:గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసితులకు స్పెషల్ ప్యాకేజ్ ఎమ్మెల్యే వొడితల సతీష్ బాబు కృషివల్లే సాధ్యమైందనీ..ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్న బీఆర్ఎస్ పార్టీని, సతీష్ బాబును మీరందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నానని మంత్రి హరీష్ రావు అన్నారు. తెలంగాణ అవతరణ దినోత్సవ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం హుస్నాబాద్ నియోజకవర్గంలో సంక్షేమ దినోత్సవం లో ముఖ్యఅతిథి గా రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే వొడితల సతీష్ బాబు, సిద్దిపేట్ జెడ్పీ చైర్ పర్సన్ రోజా రాధాకృష్ణశర్మ , స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ..185 మంది ఎస్టీ సోదర నిర్వాసితులకు ఒక్కరికి 8 లక్షల పరిహారం ఇవ్వడం జరిగింది.. దీంతోపాటు ఇంటి జాగాని కూడా అందిస్తున్నాం..అని తెలుపుతూ..భారత దేశంలో ఏ రాష్ట్రము ఇంత పెద్ద ఎత్తున ప్యాకేజీ ఇవ్వలేదు..తెలుగుదేశం ప్రభుత్వం 75 రూపాయలు పెన్షన్ ఇస్తుండే అది కూడా ఊర్లో ఒక 30 మంది 40 మందికి ఇచ్చేవారు..ఊర్లో ఎవరికైనా కొత్త పెన్షన్ రావాలంటే ఎవరైనా చస్తే గాని వచ్చే పరిస్థితి ఉండేది కాదు..కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 29 లక్షల మందికి 200 రూపాయల పెన్షన్ ఇస్తే ఈరోజు మనం 44 లక్షల మందికి ?2,000 పెన్షన్ ఇస్తున్నాం..మహారాష్ట్ర నుండి 25 మంది సర్పంచులు సిద్దిపేటకు చూడ్డానికి వచ్చినారు. మహారాష్ట్రలో చెరువులను పట్టించుకునే నాధుడే లేడు తాగడానికి నీళ్లు వారానికి ఒక రోజు ఇచ్చే పరిస్థితి ఉందట..రైతులకు దొంగరాత్రి కరెంటు . పెన్షన్ 600 మాత్రమే ఇస్తున్నారు..
కెసిఆర్ కిట్టు లేదు, వ్యవసాయం కి 24 గంటల కరెంటు లేదు, 2000 పెన్షన్ లేదు, రైతులకు రైతుబంధు లేదు..ఎప్పుడైనా మహారాష్ట్రకి మనవాళ్లను పంపిస్తే ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం అభివృద్ధి గురించి తెలిసి వస్తది..ఈరోజు దేశంలో తెలంగాణది సంక్షేమ స్వర్ణ యుగం..ప్రతి సంవత్సరం పేదల సంక్షేమం కోసం 5వేల కోట్లు ఖర్చు పెడుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం..ఇప్పటివరకు ఆసరా పెన్షన్ల కోసం 53 వేల కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది ..ఇప్పటివరకు రైతుబంధు పథకం కింద 65వేల కోట్లను రైతులకు నేరుగా ప్రభుత్వం ఇచ్చింది..ఇప్పటివరకు 65 వేల కోట్లు ఖర్చు చేసి రైతులకు ఉచిత కరెంట్ అందించాడు మన ముఖ్యమంత్రి కేసీఆర్..
పేదలకు ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యాన్ని ఇచ్చిండు కేసీఆర్..ముసలవ్వల కు ఆసరా పెన్షన్ ఇచ్చి పెద్ద కొడుకు అయిండు కేసీఆర్..పిల్ల పెళ్ళి పెట్టుకుంటే కళ్యాణ లక్ష్మి కింద లక్ష రూపాయలు సహాయం చేసి మేనమామ అయిండు కెసిఆర్..రైతుబంధు రైతు బీమా ఇచ్చి రైతులకు రైతు బాంధవుడుగా మారిండు కేసీఆర్..దేవుని దయ వల్ల గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తయింది. రేపో, ఎల్లుండో కటక ఒత్తుడే నీళ్ళు పోసుడే..ఒకప్పుడు కరువుకు నెలవైన హుస్నాబాద్‌లో ఇపుడు కరువుకు సెలవు..అన్ని పండుగలు కలిసొస్తే ఎంత గొప్పగా ఉంటదో అంతటి పండుగను మనం గౌరవెల్లి ప్రాజెక్టు ప్రారంభోత్సవం రోజు జరుపుకుందాం..అని తెలిపారు
మరో వారంలో గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి..
త్వరలోనే సీఎం కేసీఆర్ తో ప్రారంభం.
హుస్నాబాద్ గౌరవెల్లి ప్రాజెక్ట్‌ను ఎమ్మెల్యే సతీశ్ తో కలిసి పనులు పరిశీలించిన రాష్ట్ర మంత్రి హరీష్.
మరో వారంలో గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి..
త్వరలోనే సీఎం కేసీఆర్ తో ప్రారంభం.
హుస్నాబాద్ గౌరవెల్లి ప్రాజెక్ట్‌ను ఎమ్మెల్యే సతీశ్ తో కలిసి పనులు పరిశీలించిన రాష్ట్ర మంత్రి హరీష్.
హుస్నాబాద్,ప్రజాతంత్ర, జూన్9 : హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజల దశాబ్దాల సాగునీటి కల త్వరలోనే సాకారం కానున్నదని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు చెప్పారు. త్వరలోనే సీఎం కేసీఆర్ తో గౌరవెల్లి ప్రాజెక్టును ప్రారంభించనున్నట్లు మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ నియోజక వర్గంలోని8.23 టీఏంసీల గౌరవెల్లి ప్రాజెక్ట్‌ను శుక్రవారం సాయంత్రం ఎమ్మెల్యే సతీష్ తో కలిసి మంత్రి పరిశీలించారు. అక్కడికక్కడే ఇరిగేషన్ ఇంజనీర్లతో సుమీక్షించి మిగులు పనులు వారంలోపే పూర్తయ్యేలా త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే భూ నిర్వాసితులకు పరిహారం అందించే ప్రక్రియ పూర్తయ్యిందని, అలాగే 8 కిలోమీటర్ల మేర కట్ట నిర్మాణం పూర్త పూర్తయిందని తెలిపారు. సీఎం కేసీఆర్ గౌరవెల్లి ప్రాజెక్టును ఒక సదుద్దేశంతో మొదలు పెట్టారని, ఈ ప్రాజెక్టును మరో వారం రోజులలో పూర్తి కానున్నదని, ఫలితంగా గోదావరి జలాలతో హుస్నాబాద్ నియోజకవర్గం సస్యశ్యామలం కాబోతోందని తెలిపారు.