కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలి
ఎస్ఎఫ్ఐ చేవెళ్ల డివిజన్ అధ్యక్షులు కార్యదర్శులు బేగరి అరుణ్ కుమార్,ఎర్రవల్లి శ్రీనివాస్
ప్రజాతంత్ర చేవెళ్ల,నవంబర్ 4: చేవెళ్ల మండల పరిధిలోని ఊరెళ్ళా రెవెన్యూలో ఉన్నటువంటి సాగర్ కళాశాలలో బీసీ బాలికల రెసిడెన్షియల్ స్కూల్ లో 26 మంది బాలికలు ఫుడ్ పాయిజన్ కు గురి కావడం జరిగింది.విషయం తెలుసుకున్న ఎస్ఎఫ్ఐ చేవెళ్ల డివిజన్ అధ్యక్షులు కార్యదర్శులు అరుణ్ కుమార్ శ్రీనివాస్ హుటాహుటిన హాస్పిటల్ కి వెళ్లి విద్యార్థులతో మాట్లాడి విషయం తెలుసుకున్నారు.అనంతరం పాఠశాల దగ్గరికి వెళ్లి మిగతా విద్యార్థులతో మాట్లాడారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాలలో నాసిరకం వంట సామాగ్రి ఉపయోగిస్తున్నారని,అలాగే వాడిపోయినటువంటి కూరగాయలతో వంట చేస్తున్నారని దాని కారణంగా విద్యార్థులు అస్వస్థకు గురి కావడం జరిగిందన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఉన్నత అధికారులను డిమాండ్ చేశారు.లేనిపక్షంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు.