వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

భారతీయులంతా సోదరభావంతో మెలగాలి

November 9, 2019

అయోధ్య తీర్పుపై రాహుల్‌గాంధీఅయోధ్యలోని రామ జన్మభూమి- బాబ్రీ మసీదు వివాదంపై శనఇవారం సుప్రీమ్‌కోర్టు వెలువరించిన తీర్పును స్వాగతిస్తున్నట్టు కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీ పేర్కొన్నారు. భారతీయులంతా సోదరభావంతో, పరస్పర ప్రేమ, విశ్వాసాలతో కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు. అయోధ్యపై సుప్రీం తీర్పు వెలువడిన అనంతరం ఆయన ట్విటర్లో స్పందిస్తూ.. అయోధ్యపై సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. కోర్టు తీర్పును గౌరవించి మనమంతా పరస్పరం సామరస్యంతో మెలగాలని, భారతీయులందరి మధ్య సోదరభావం, నమ్మకం, ప్రేమ వెల్లివిరియాల్సిన సమయం ఇది అని రాహుల్‌ ‌పేర్కొన్నారు. దశాబ్దాల నాటి అయోధ్య భూ వివాదంపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ‌రంజన్‌ ‌గొగోయ్‌ ‌నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు వెలువరించింది. వివాదాస్పద స్థలాన్ని రామ మందిర నిర్మాణం కోసం రామ జన్మభూమి న్యాస్‌కు అప్పగించింది. అయితే ముస్లింలు అయోధ్యలో మసీదు నిర్మించుకునేలా ప్రత్యామ్నాయ 5 ఎకరాల స్థలాన్ని ఇవ్వాలని షరతు విధించింది.