న్యూదిల్లీ,జనవరి9 : భారతీయ సైన్యానికి చెందిన లెప్టినెంట్ కల్నల్ ఆఫీసర్ తన భార్యను మర్డర్ చేశారు. పంజాబ్లోని ఫిరోజ్పూర్లో పనిచేస్తున్న ఆయన తన భార్యను షూట్ చేసి, ఆ తర్వాత తనను తాను షూట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. కల్నల్ ఓ సూసైడ్ నోట్ కూడా రాశారు. తన భార్యకు హాని చేసినట్లు ఆ ఆఫీసర్ తన లేఖలో తెలిపారు. భార్యాభర్తల మధ్య కొన్నాళ్లుగా తగాదాలు ఉన్నాయి. ఇద్దరూ తరుచుగా కౌన్సిలింగ్కు వెళ్తున్నారు. ఈ ఘటనపై ఆర్మీతో పాటు పంజాబ్ పోలీసులు విచారణ చేపడుతున్నారు