మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు దంతోజి నరసింహచారి ఆధ్వర్యంలో విజయవంతంగా కొనసాగుతున్న యూత్ డిక్లరేషన్

కందుకూరు,ప్రజాతంత్ర ఆగస్టు 3 : ఇంటింటికి తిరిగి యూత్ డిక్లరేషన్ కార్యక్రమాన్ని కందుకూరు మండల పరిధిలోని దాసరపల్లి గ్రామంలో మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు దంతోజి నరసింహచారి ఆధ్వర్యంలో విజయవంతంగా కొనసాగుతుంది. గురువారం ఆగ్రామంలో కాంగ్రెస్ పార్టీ యువజన కార్యకర్తలతో కలిసి ఆయన ప్రతి ఇంటింటికి తిరిగి గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి పనులు ప్రజలకు వివరించి తెలంగాణ ప్రభుత్వంలో యువతి,యువకులు ఉద్యోగాలు రాక ఏ విధంగా బాధపడుతున్నారనే విషయాలను క్షుణ్ణంగా ప్రజలకు ఆయన వివరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ యూత్ డిక్లరేషన్ కార్యక్రమం తన ఆధ్వర్యంలో దాసరపల్లిలో ప్రారంభించడం జరిగిందని ఈ కార్యక్రమం 30 రోజుల పాటు నిర్వహించి పార్టీ చేస్తున్న కార్యక్రమాలు ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపుతూ ప్రజలకు వివరించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఇంటింటికి తిరిగి ప్రచారం చేయాలన్నదే పార్టీ ఆలోచన విధానమని అందుకు పార్టీ అధిష్టానం తనకు ఆదేశాలు ఇవ్వగా యూత్ డిక్లరేషన్ యువతకు ప్రజలకు తెలపడం జరుగుతుందని ఆయన తెలిపారు.పార్టీ చేపట్టిన ఈ కార్యక్రమానికి యువతీ యువకుల నుండి మంచి స్పందన లభిస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో శేఖర్,రమేష్,యుగంధర్,వెంకటేష్,మహేష్, శేఖర్,జగన్,శ్రీను,మల్లేష్,యాదగిరి, నరసింహ,శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page