ప్రతిక్షణం ‘‘పడగ’’నీడలో ఉన్నాం
లేచింది మొదలు పడుకునే దాకా….
పడుకున్నది మొదలు లేచే దాకా….
‘సీసీటీవీ’మొదలు ‘సెల్ఫోన్’ దాకా….
‘ఎల్సిడి’ మొదలు ‘ఎల్‌ఈడి’ దాకా….
మనం ఇప్పుడు నిఘా నీడలో ఉన్నాం
ప్రతిక్షణం పడగ నీడలో ఉన్నాం
‘వైఫై’ మొదలు ‘డ్రోన్ల’ దాకా….
‘రాకెట్’ మొదలు ‘సాటిలైట్’ దాకా….
‘తూర్పు’మొదలు ‘పడమర’ దాకా….
‘ఉత్తరం’ మొదలు ‘దక్షిణం’ దాకా….
మనం ఇప్పుడు’’ నిఘా’’ నీడలో ఉన్నాం
ప్రతిక్షణం ‘‘పడగ’’నీడలో ఉన్నాం
ఇప్పుడు ‘రహస్యం’అనేది బహిరంగమైంది
పడకగది రహస్యం పరిహాసమైంది
మనసులోని మర్మమైనా…
మేధస్సులోని సమాలోచనైనా….
మాటైనా…. పాటైనా…. ఆటైనా….
చివరికి నీ ప్రయాణమైనా….
పాలకుడికి
‘‘ సై’’ అంటే ‘‘సరే….’’
‘‘నై’’అంటే ‘‘గురే….’’
మనం ఇప్పుడు ‘‘నిఘా’’నీడలో ఉన్నాం
ప్రతిక్షణం ప’’డగ’’నీడలో ఉన్నాం.
– డా: బదావత్ రాజు, మానవ హక్కుల కార్యకర్త, హన్మకొండ.