స్వచ్ఛభారత్ లో భాగంగా పారిశుద్ధ్య పనులు నిర్వహించిన బిజెపి
ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 2 : జాతిపిత మహాత్మా గాంధీ ఆశయాలు ప్రతి ఒక్కరికి అనుసరణీయమని జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి అన్నారు. మహాత్మా గాంధీ జయంతి సందర్బంగా ఆమనగల్లు పట్టణంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపుమేరకు మున్సిపాలిటీలోని 12వ వార్డులో స్వచ్ఛ హి సేవ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్బంగా ఆచారి మాట్లాడుతూ యావత్ భారతావని అంతా గాంధీజీ శాంతియుత పోరాటానికి మద్దతు పలికిందని, కోట్లాది మంది జనాలు ఆయన వెంట నడిచారని, ఈ సందర్భంలోనే ఆయన విశ్వం మొత్తానికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. అహింస, సత్యం మార్గాన్ని ఆచరించారనీ స్వాతంత్ర ఉద్యమాన్ని ముందు ఉండి నడిపారనీ అన్నారు.
వారి ప్రేరణతో ప్రపంచములో ఎందరో నాయకులు మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలా అనేకమంది అహింసను ఆయుధంగా మార్చుకుని పోరాటాలు చేసారని అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం కూడా మహాత్మా గాంధీ కళలు కన్నటువంటి రామరాజ్యం కోసం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని తీసుకున్నారని అన్నారు. కార్యక్రమంలో భాగస్వాములైనప్పుడే సాధ్యమవుతుందని అన్నారు. ఇదే గాంధీకి అసలైన నివాళులు అని అన్నారు.
ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షుడు వీరబోమ్మ రాంమోహన్, మున్సిపల్ చైర్మన్ రాంపాల్, వైస్ చైర్మన్ దుర్గయ్య, ఆర్యవైశ్య సంఘం నాయకులు కండె పాండురంగయ్య, కాసుల కృష్ణయ్య, మేడిశెట్టి శ్రీధర్, యస్. శేఖర్, పాపిశెట్టి రాము, డాక్టర్ బిక్కుమాండ్ల శ్రీనివాస్, విడియాలరవి, సామల వెంకట్, బొజ్జ నర్సింహ, నటరాజు బిక్కుమాండ్ల యాదయ్య, గోరేటి నరసింహ, ఉప్పల్ శ్రీధర్, ప్రభాకర్, సత్యం, మున్సిపల్ కౌన్సిలర్లు, నాయకులు చెక్కల లక్ష్మన్, శ్రీకాంత్ సింగ్, దుడ్డు కృష్ణ కండే సాయి పాల్గొన్నారు.