మహేశ్వరం, ప్రజాతంత్ర అక్టోబర్ 4: మాజీ హోం మంత్రి పట్లోళ్ల ఇంద్రా రెడ్డికి మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కే.యాదయ్యతో కలిసి, మహేశ్వరం నియోజకవర్గం బిఏంసి బిఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు నివాళులు అర్పించారు. బుధవారం మాజీ హోం మంత్రి ఇంద్రా రెడ్డి జయంతిని పురస్కరించుకొని.. కౌకుంట్ల గ్రామంలోని ఇంద్రా రెడ్డి సమాధి వద్ద మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే కాలే యాదయ్య, సబితా ఇంద్రారెడ్డి కుమారులు కౌశిక్ రెడ్డి కళ్యాణ్ రెడ్డితో కలిసి బిఏంసి బిఆర్ఎస్ అధ్యక్షుడు రామిడి రాం రెడ్డి, సం రెడ్డి వెంకట్ రెడ్డి, భీమిడి జంగా రెడ్డి, కర్రె బల్వంత్, బోయపల్లి శేఖర్ రెడ్డి, ఇంద్రపల్లి యాదయ్య, నందినేని నరేందర్ రెడ్డి, అర్కాల కామేష్ రెడ్డి, బొల్లంపల్లి రాం బాబు, సురేష్ తదితరులు పూల మాలలు వేసి, ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు ఇంద్రా రెడ్డి సేవలను గుర్తు చేసుకున్నారు.