‘‘ఎక్కడ పరిశుభ్రమైన గాలి, నీరు, ఆహారం, లభ్యమవుతుందో, ఎక్కడ పచ్చదనంతో కాలుష్య రహితమైన వాతావరణంతో ప్రకృతి వికసిస్తుందో అక్కడ సకల జీవరాశులు ఆరోగ్య వంతం గా జీవించగలుగుతాయి. ప్రకృతిని పరిరక్షించ గలిగితేనే ధరిత్రి లో మానవులు సుఖసౌఖ్యాలతో మనుగడ సాగించ గలరు. పచ్చదనానికి పాడె కడితే మానవ పయనం కాటికే దారితీస్తుంది. ఈ సత్యాన్ని గ్రహించక తాత్కాలిక సౌకర్యాల కోసం మనం కూర్చున్న కొమ్మను మనమే నరుక్కోవడం ఆత్మహ త్యాసదృశం.’’
ప్రపంచాన్ని మరణ శయ్యపై నెడు తున్న మానవ తప్పిదాలు భవిష్యత్తుకు మరణ శాసనాల్లా పరిణ మిస్తున్నాయి.
ఎక్కడ పరి శు భ్రమైన గాలి, నీరు, ఆహారం, లభ్యమవుతుందో, ఎక్కడ పచ్చదనంతో కాలుష్య రహితమైన వాతావరణంతో ప్రకృతి వికసిస్తుందో అక్కడ సకల జీవరాశులు ఆరోగ్య వంతం గా జీవించగలుగుతాయి. ప్రకృతిని పరిరక్షించ గలిగితేనే ధరిత్రి లో మానవులు సుఖసౌఖ్యాలతో మనుగడ సాగించ గలరు. పచ్చదనానికి పాడె కడితే మానవ పయనం కాటికే దారితీస్తుంది. ఈ సత్యాన్ని గ్రహించక తాత్కాలిక సౌకర్యాల కోసం మనం కూర్చున్న కొమ్మను మనమే నరుక్కోవడం ఆత్మహ త్యాసదృశం.భవిష్యతరాలకు స్థిరమైన ఆరోగ్యవంతమైన సమాజాన్ని అందించాలనే ధ్యేయంతో ప్రతీఏటా జూలై 28 వ తేదీని ‘‘ప్రకృతి పరిరక్షణ దినం’’ గా పాటిస్తున్నాం. పలు రకాల కాలుష్య కారకాలతో వ్యాధులతో, వైరస్ లతో ప్రపంచం అతలాకుతలమైపోతున్న నేపథ్యంలో 2022 వ సంవత్సరం జూలై 28 వ తేదీన జరిగే ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవానికి ప్రాధాన్యత పెరిగింది.మన ముందు తరాలు ముందు చూపుతో ప్రకృతి పట్ల శ్రద్ద చూపేవారు.
ఎక్కడ పరి శు భ్రమైన గాలి, నీరు, ఆహారం, లభ్యమవుతుందో, ఎక్కడ పచ్చదనంతో కాలుష్య రహితమైన వాతావరణంతో ప్రకృతి వికసిస్తుందో అక్కడ సకల జీవరాశులు ఆరోగ్య వంతం గా జీవించగలుగుతాయి. ప్రకృతిని పరిరక్షించ గలిగితేనే ధరిత్రి లో మానవులు సుఖసౌఖ్యాలతో మనుగడ సాగించ గలరు. పచ్చదనానికి పాడె కడితే మానవ పయనం కాటికే దారితీస్తుంది. ఈ సత్యాన్ని గ్రహించక తాత్కాలిక సౌకర్యాల కోసం మనం కూర్చున్న కొమ్మను మనమే నరుక్కోవడం ఆత్మహ త్యాసదృశం.భవిష్యతరాలకు స్థిరమైన ఆరోగ్యవంతమైన సమాజాన్ని అందించాలనే ధ్యేయంతో ప్రతీఏటా జూలై 28 వ తేదీని ‘‘ప్రకృతి పరిరక్షణ దినం’’ గా పాటిస్తున్నాం. పలు రకాల కాలుష్య కారకాలతో వ్యాధులతో, వైరస్ లతో ప్రపంచం అతలాకుతలమైపోతున్న నేపథ్యంలో 2022 వ సంవత్సరం జూలై 28 వ తేదీన జరిగే ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవానికి ప్రాధాన్యత పెరిగింది.మన ముందు తరాలు ముందు చూపుతో ప్రకృతి పట్ల శ్రద్ద చూపేవారు.
పంచభూతాలను ఆరాధ్య దైవాలుగా భావించేవారు. ప్రాచీన కాలం నాటి పెద్దల ఆచారాలను మనం అవహేళన చేశాం. మూఢనమ్మకాలని కొట్టి పడేశాం. వారు ఆచరించి, ఆరాధించిన ప్రతీ పని వెనుక ఒక పరమార్ధం దాగి ఉంది. నాటి మన పెద్దల ఆచార వ్యవహారాలు,జీవన విధానం వారి ముందుచూపుకు నిదర్శమని వర్తమాన పరిణామాలను బట్టి అవగతమవుతున్నది. పచ్చదనం పట్ల వారికున్న మక్కువ, నీటి వినియోగంలో పొదుపు, ఆరోగ్య పరిరక్షణకు అవలంభించిన విధానాలు,వనమూలికలతో వైద్యం,మొక్కల పెంపకం,పశు పెంపంకం, వివిధ జీవరాశుల మనుగడ పట్ల ఆసక్తి,అందుకు వారు అవలంభించిన విధానం,మనకు తిండినిచ్చిన నేలతల్లిని కృతజ్ఞతాభావంతో ఆరాధించడం, ప్రతీ పర్వదినానికి ఒక అర్థాన్ని సూచించడంలోని లోతైన విశ్లేషణ మానవ జాతి పదికాలాల పాటు సుభిక్షంగా వర్ధిల్లాలనే వారి ఆకాంక్షను వెల్లడిస్తున్నది.ప్రకృతి పట్ల వారు కనబరచిన ఆరాధ్యభావం అనుసరణీయం.నాటి పెద్దల హితోక్తులు నేటికీ శిరోధార్యం.అయితే గతతరాల దార్శనికతను మూఢత్వం గా భావించి, హేళన చేసి, ఆధునికత్వం పేరుతో ప్రకృతి ని పరిహసించిన ఫలితాన్ని నేడు మనం అనుభవి స్తున్నాం.
ప్రకృతి సిద్ధమైన జీవన విధానాన్ని విస్మరించి, కాంక్రీటు కట్టడాల మధ్య మన జీవితాలను మనమే సమాధి చేసుకుం టున్నాం. అడవులు విధ్వంసమై పోతున్నాయి. త్రాగునీటికి, సాగునీటికి ప్రాంతాల మధ్య విబేధాలు తలెత్తుతు న్నాయి. చినుకు పడితే జనారణ్యాలన్నీ సంద్రంలా మారిపోతున్నాయి. ఇటీవల కురిసిన వర్షాల వలన జరిగిన నష్టం,వరదల వలన ప్రజలు పడుతున్న అగచాట్లు కేవలం ప్రకృతి ప్రకోపం వలన సంభవించినవిగా మాత్రమే చెప్పడం సత్యదూరం. ఈ ఉత్పాతాలకు మానవ వైఫల్యాలు నిదర్శనం. నీరంతా కడలి పాలౌతున్నది.మానవ ప్రమేయం లేకుండా సహజసిద్ధంగా ఏర్పడిన అమూల్యమైన సంపదను సహజ వనరులుగా నిర్వచించవచ్చు.నీరు,నిప్పు వాయువు, నింగి, నేల, వాతావరణం, ఖనిజాలు, అడవులు, ఇతర భూగర్భ సంపద ప్రకృతి మనకు ప్రసాదించిన వరం.సకల చరాచర జగత్తుకు ప్రకృతి ఒక ఆలంబన.ప్రకృతి ని పరిరక్షించడ ంలోనే మానవ మనుగడ సురక్షితం కాగలదు. ప్రస్తుతం జనాభా విపరీతంగా పెరిగింది.
రెండు వందల సంవత్సరాల క్రితం ప్రపంచ జనాభా కేవలం వంద కోట్లు. వంద సంవత్సరాల క్రితం సుమారు 318 కోట్లు, 2022 నాటికి 790 కోట్లకు చేరుకున్నది.’’ఇంతింతై వటుడింతై…’’ అన్నమాదిరిగా ఆకాశమే హద్దుగా, భూమ్యాకాశాలను ఆక్రమించే విధంగా పెరిగి పోయిన జనాభా ప్రకృతి విధ్వంసానికి దారితీసింది.మానవ స్వార్ధం పరాకాష్ఠకు చేరుకుంది. మానవ తప్పిదాలే మానవాళికి ముప్పుగా పరిణమించాయి. సహజ వనరులు తరిగి పోతున్నాయి.మానవ అవసరాలు పెరిగిపోతున్నాయి. గాలి,నీరు కలుషితమై పోయింది. పచ్చదనం హరించుకు పోయింది. వాహన కాలుష్యం పెరిగి పోయింది. ‘‘గ్లోబల్ వార్మింగ్’’ దుష్ఫలితాలను చవిచూస్తున్నాం. పీల్చే గాలిలో, త్రాగే నీటిలో,తినే తిండిలో స్వచ్ఛత లోపించింది. నాణ్యతా ప్రమాణాలు లోపిం చాయి. ప్లాస్టిక్ వినియోగం వలన పర్యావర ణానికి జరుగుతున్న నష్టం అంచనాకు అందని విధంగా ఉంది. మానవ దురాలోచన దూరదృష్టిని హరించింది. ప్రకృతిని పరిహసి ంచింది. మానవేతర జీవరాశులు అంతర్ధానమై పోతున్నాయి.ప్రకృతి సమతుల్యత లోపించింది. అంటు వ్యాధులు ప్రబలి పోతున్నాయి. శాస్త్రజ్ఞులకు అంతుబట్టని బ్యాక్టీరియాలు,వైరస్ లు విజృంభిస్తున్నాయి.ప్రస్తుత మానవ తప్పి దాలు రోగగ్రస్థమైన ప్రపంచాన్ని రాబోవు తరాలకు అందించడమే ధ్యేయంగా అప్రతి హతంగా కొనసాగుతున్నాయి.
ప్రకృతిని పరిరక్షించడంలో ఇకనైనా జాప్యం లేకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి.రాబోయే మానవ విలయాన్ని ఆపాలి. తరిగి పోతున్న సహజ వనరులను కాపాడాలి. కాలుష్యరహితమైన ప్రత్యామ్నాయ ఇంధన వనరులను వినియోగించాలి. రసాయనాల వాడకాన్ని తగ్గించగలగాలి.సహజ సిద్ధమైన జీవన శైలిని అలవాటు చేసుకోవాలి. మొక్కల పెంపకానికి అధిక ప్రాధాన్యత నివ్వాలి. వ్యర్ధాలను రీసైక్లింగ్ చేసి, పునర్వినియోగానికి అనువైన చర్యలు చేపట్టాలి.ప్లాస్టిక్ వినియోగాన్ని జీరో స్థాయికి తగ్గించాలి. భూతాపాన్ని తగ్గించడానికి ప్రపంచ దేశాలన్నీ ఏక త్రాటిపైకి రావాలి.ఈ విషయంలో పారిస్ ఒప్పందం నుండి గత ట్రంప్ సారథ్యంలోని అమెరికా ప్రభుత్వం వైదొలగినా,జోబిడెన్ నాయకత్వం లోని ప్రస్తుత యు.ఎస్ ప్రభుత్వం తిరిగి చేరడం ముదావహం. చలితో వణికిపోయే యు.ఎస్,నడా వంటి దేశాల్లో కూడా ఎండలు పెరగడం, వివిధ దేశాల్లో భారీ వర్షాలు ముంచెత్తడం భారతీయ నగరాల్లో తీవ్ర ఉష్ణోగ్రతలు, ఊహించని వరదలు, కరువు పరిస్థితులు….
ఇలా ఒకదానికొకటి పొంతన లేని పరిస్థితులు నెలకొనడానికి వాతావరణంలోని అవాంఛనీయ పరిణామాలే. సకల అనర్ధాలకు మూలకారణం ప్రకృతి విధ్వంసం.ఇకనైనా ప్రపంచం మేల్కొ నాలి. ప్రకృతి పట్ల శ్రద్ధ వహించి, పచ్చదనాన్ని పెంపొందించాలి. సకల జీవరాశులు ప్రకృతిలో మమేకమై జీవించాలి. ప్రకృతి సమతుల్యత, పరిరక్షణ మీదనే భవిష్య ప్రపంచ మనుగడ ఆధారపడి ఉన్నది. విధ్వంసానికి, వివేకానికి మధ్య జరిగే సంఘర్షణలో వివేకమే జయించాలి. ప్రపంచంలో ఎంతో మంది పర్యావరణ వేత్తలు, ఐక్యరాజ్య సమితి వంటి అంతర్జాతీయ సంస్థలు ప్రకృతి పరిరక్షణ గురించి విశేషమైన కృషి చేస్తు న్నాయి. అయితే అభివృద్ది పేరుతో అడవులను నరికి వేయడం, పచ్చని పంట పొలాలను రసాయనాలతో కలుషితం చేయడం వలన జీవసమతుల్యత లోపించడం మాత్రమే కాకుండా ప్రకృతి కూడా నాశనమైపోతున్నది.ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ‘‘ప్రకృతి పరిరక్షణ’’ అంశం అత్యధిక ప్రాధాన్యత సంతరించుకుంది. ఇకనైనా మేల్కొనక పోతే రాబోవు పరిణామాలు ఊహాతీతంగా ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
సుంకవల్లి సత్తిరాజు తూ.గో.జిల్లా,
ఆంధ్రప్రదేశ్.9704903463.
ఆంధ్రప్రదేశ్.9704903463.