మీకు సమాధానం చెప్పడానికి మేము చాలు..

కెసిఆర్‌ అవసరం లేదు
పేమెంట్‌ కోటాలో సిఎం అని మేము అనొచ్చు
కెసిఆర్‌ను కాదు…ధైర్యముంటే మోదీని తిట్టాలి
చీకటి ఒప్పందాలు మాకు అలవాటు లేదు…అంతా బహిరంగంగానే
అసెంబ్లీలో చర్చ సందర్భంగా బిఆర్‌ఎస్‌ ఎంఎల్‌ఏ కెటిఆర్‌
సిఎం రేవంత్‌ విమర్శలకు కౌంటర్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 24 : అసెంబ్లీలో అధికార పార్టీకి జవాబు చెప్పడానికి తాము చాలని, తాము లేవనెత్తిన అంశాలకు జవాబు చెబితే చాలని, వారికి సమాధానం చెప్పడానికి కేసీఆర్‌ అవసరం లేదని బిఆర్‌ఎస్‌ ఎంఎల్‌ఏ కెటిఆర్‌ అన్నారు. గత బిఆర్‌ఎస్‌ భ్రుత్వంలో తాను మేనేజ్‌మెంట్‌ కోటాలో మంత్రినయ్చానని సిఎం రేవంత్‌ చేసిన వ్యాఖ్యలపై కెటిఆర్‌ స్పందిస్తూ.. అలా అయితే రేవంత్‌ పేమెంట్‌ కోటాలో సీఎం అయ్యారని తామూ అనొచ్చని వ్యాఖ్యానించారు. దీనిపై కేటీఆర్‌ స్పందిస్తూ మేనేజ్‌మెంట్‌ కోటాలో తాను మంత్రి అయ్యానని సీఎం అనొచ్చా..అని ప్రశ్నిస్తూ..సభా నాయకుడు అలా మాట్లాడొచ్చా..అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయంపై చర్చను తాము సమర్థిస్తున్నట్లు తెలిపారు.

తాము విభజన సమయంలో తెలంగాణ హక్కుల కోసం ఎంతో పోరాడామని, మోదీ సర్కారుపై అనేక పోరాటాలు చేశామని, రాష్ట్ర హక్కులు ఎవరు హరించినా వారి మెడలు వంచుతామని తెలిపారు. యాచిస్తే ఏవిూ రాదని, శాసించి సాధించుకోవాలని కెటిఆర్‌ సూచించారు. దిల్లీ తత్వం ఇంత కాలానికి కాంగ్రెస్‌కు బోధపడిరదని, బిజెపికి వ్యతిరేకంగా మాట్లాడుతుంటే కాంగ్రెస్‌కు ఏం ఇబ్బందని ప్రశ్నించారు. కేంద్ర వివక్షను నిలదీయడంలో తాము సహకరిస్తామని, గతంలో కేంద్రం సాయం చేయకపోయినా ఎంతో అభివృద్ధి చేశామని, రేవంత్‌ రెడ్డి కష్టపడే ఈ స్థాయికి చేరుకున్నారని, చిన్నవయసులోనే సీఎం అయ్యారని కెటిఆర్‌ అన్నారు. కేంద్రం తెచ్చిన అన్ని బిల్లులకూ తాము మద్దతివ్వలేదని, దళితుడు రాష్ట్రపతి, తెలుగు బిడ్డ ఉపరాష్ట్ర అభ్యర్థులగా అయ్యే సమయంలో మద్దతిచ్చామని, కేసీఆర్‌ను కాదు.. ధైర్యముంటే మోదీని తిట్టండన్నారు.

ఎన్నికలకు ఆరు నెలల ముందు రాజకీయాలు చేద్దామని, ఎన్నికల తర్వాత నాలుగున్నరేళ్లు ప్రజల గురించి ఆలోచిద్దామని సూచించారు. తామేం చేసినా బహిరంగంగానే చేశామని, చీకటి ఒప్పందాలు తమకు అలవాటు లేదని, కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి ఏవిూ ఇవ్వకుంటే తామేం చేస్తామని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. ఇక సీఎం రేవంత్‌ రెడ్డి సభలో ఉండి సహచర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో మాట్లాడిరచడంపై కేటీఆర్‌ విమర్శించగా.. రేవంత్‌ రెడ్డి జోక్యం చేసుకుని.. ప్రభుత్వం చాలా స్పష్టతతో ఉందని.. బ్జడెట్‌లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై చర్చకు అనుమతించాలని కోరామని.. సభకు లేట్‌గా వొచ్చిన సభ్యుడు అసలు విషయం తెలుసుకోకపోతే ఎలా అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page