ముగిసిన సోనియా ఇడి విచారణ

  • మూడోరోజు మూడుగంటలపాటు విచారణ
  • అవసరమైతే మళ్లీ పిలుస్తామని అధధికారుల వెల్లడి
  • మూడోరోజూ కొనసాగిన కాంగ్రెస్‌ ఆం‌దోళనలు

న్యూ దిల్లీ, జూలై 27 : నేషనల్‌ ‌హెరాల్డ్ ‌కేసులో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ విచారణ ముగిసింది. బుధవారం 3 గంటలపాటు ప్రశ్నించాక ఈడీ కార్యాలయం నుంచి ఆమె ఇంటికి వెళ్లిపోయారు. మధ్యాహ్నం 2గంటల సమయంలో అధికారులు సోనియాకు భోజన విరామం ఇచ్చారు. తిరిగి మధ్యాహ్నం 3.30 గంటలకు  విచారణకు  రావాలని తొలుత సమాచారం ఇచ్చారు. అయితే కొద్దిసేపటి తర్వాత విచారణ ముగిసిందని సమాచారం చేరవేశారు. తాజాగా ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని అధికారులు చెప్పారు. ఈడీ కేంద్ర కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. అవసరమైతే మరోసారి పిలుస్తామని చెప్పారని సమాచారం. కాబట్టి ప్రస్తుతానికి సోనియా విచారణ ముగిసినట్టే భావిస్తున్నారు. ఇప్పటికే 3 రోజులపాటు సోనియాను అధికారులు ప్రశ్నించారు. మూడు రోజుల్లో మొత్తం 12 గంటలపాటు ఈడీ అధికారులు ఆమెను ప్రశ్నించారు.

ఈనెల 21న 3 గంటలు, మంగళవారం రెండు దఫాలుగా 6 గంటల పాటు ప్రశ్నావళి కురిపించారు. ఇక బుధవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2గం.ల వరకు ఈడీ అధికారులు ప్రశ్నించారు. మంగళవారం 6 గంటలపాటు విచారణ ’నేషనల్‌ ‌హెరాల్డ్’ ‌మనీ లాండరింగ్‌ ‌కేసులో కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఈడీ అధికారులు మంగళవారం ఏకంగా 6 గంటలపాటు ప్రశ్నించారు.  ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పలు విడతల్లో ఆమె ఈడీ ప్రశ్నలను ఎదుర్కొన్నారు. ఈ సందర్భంగా సోనియా గాంధీ స్టేట్‌మెంట్‌ను ఈడీ నమోదుచేసింది. కాగా.. నేషనల్‌ ‌హెరాల్డ్ ‌పత్రిక, యంగ్‌ ఇం‌డియన్‌ ‌ప్రైవేట్‌ ‌లిమిటెడ్‌ ‌కంపెనీ వ్యవహారాల్లో ఆమె పాత్రపై అధికారులు ఆరాతీశారు.

యా సంస్థల్లో రాహుల్‌ ‌గాంధీ పాత్ర గురించి కూడా సోనియాను ప్రశ్నించారు. ఈడీకి గతంలో రాహుల్‌ ఇచ్చిన సమాచారంతో సోనియా స్టేట్‌మెంట్‌ను పోల్చి చూడనున్నట్టు ఈడీ అధికారి తెలిపారు. మరోవైపు, ఈడీ విచారణకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ ‌నేతలు ఆందోళన చేశారు. వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోనియాను ఇప్పటివరకు 95 నుంచి 110 ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. అయితే కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పిన సోనియా.. మరికొన్నింటికి తనకు తెలియవని చెప్పినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

నేషనల్‌ ‌హెరాల్డ్ ‌పబ్లిషర్‌ అయిన అసోసియేటెడ్‌ ‌జర్నల్స్ ‌లిమిటెడ్‌ ‌టేకోవర్‌కు సంబంధించిన లావాదేవీల గురించి సోనియాను ప్రశ్నించగా.. అవన్నీ మోతీలాల్‌ ‌వోరాకే తెలుసని ఆమె చెప్పినట్లు ఈడీ వర్గాలు పేర్కొన్నాయి. కాంగ్రెస్‌, ఏజేఎల్‌, ‌యంగ్‌ ఇం‌డియన్‌ ‌మధ్యలో జరిగిన ఆర్థిక లావాదేవీలన్నీ ఆయనే చూసుకున్నారని ఆమె చెప్పినట్లు సమాచారం. కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత అయిన మోతీలాల్‌ ‌వోరా.. మధ్యప్రదేశ్‌ ‌సీఎంగా, ఉత్తరప్రదేశ్‌ ‌రాష్ట్ర గవర్నర్‌గా, ఆలిండియా కాంగ్రెస్‌ ‌ప్రధాన కార్యదర్శిగా అనేక బాధ్యతలు నిర్వహించారు. కాంగ్రెస్‌ ‌పార్టీ కోశాధికారిగానూ వ్యవహరించారు. 2020 డిసెంబరులో ఆయన అనారోగ్యంతో కన్నుమూశారు. సోనియాను ఈడీ ప్రశ్నిస్తున్న సమయంలో కాంగ్రెస్‌ ‌నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు.

దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని ఆరోపిస్తూ నేతలు బైఠాయించారు. మహిళా కాంగ్రెస్‌, ‌యూత్‌ ‌కాంగ్రెస్‌ ‌నేతలతో పాటు సీనియర్‌ ‌నాయకుడు గులాం నబీ ఆజాద్‌ ‌సైతం నిరసనల్లో పాల్గొనడం గమనార్హం. రాజ్యసభలో విపక్షనేత మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో కాంగ్రెస్‌?‌పక్షనేత అధిర్‌ ‌రంజన్‌ ‌చౌదరి ఆధ్వర్యంలో ఆ పార్టీ ఎంపీలు నిరసనకు దిగారు. నిత్యవసర వస్తువులపై జీఎస్టీ విధించడం సహా పార్లమెంట్‌ ఉభయసభల్లో విపక్ష ఎంపీలను సస్పెండ్‌ ‌చేయడాన్ని ఖండించారు. ఈ మేరకు పార్లమెంట్‌ ‌కాంప్లెక్స్ ‌నుంచి విజయ్‌ ‌చౌక్‌ ‌వరకు ర్యాలీగా వెళ్లారు. అనంతరం అక్కడ బైఠాయించి నినాదాలు చేశారు. అయితే, నిమిషాల వ్యవధిలోనే పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యాలయం ఎదుట ఆందోళన చేసిన వారిని సైతం నిర్బంధించారు.’ధరల పెరుగుదల, జీఎస్టీ వంటి సమస్యలపై ప్రజల తరఫున మేం పోరాడుతున్నాం.

ఈడీ సహా దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయడంపై మా పోరాటం కొనసాగిస్తాం. ఎంపీలపై సస్పెన్షన్‌ ‌విధించడం తప్పు. దాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ ‌చేస్తున్నాం’ అని ఖర్గే అన్నారు. ’విపక్షాలు లేని దేశాన్ని ప్రభుత్వం కోరుకుంటోంది. దర్యాప్తు ఏజెన్సీలను సర్కారు ఇలా ఉపయోగించడాన్ని బట్టి చూస్తే ఇది స్పష్టమవుతోంది’ అని కాంగ్రెస్‌ ‌లోక్‌సభాపక్షనేత అధిర్‌ ‌రంజన్‌ ‌చౌదరి పేర్కొన్నారు.
’వరుసగా మూడోరోజూ ఆందోళన చేస్తున్న ఎంపీలను నిర్బంధించారు. ఎక్కడికి తీసుకెళ్లారో దేవుడికే  తెలియాలి. ఇది ప్రజాస్వామ్య హత్యే. జీఎస్టీ అంశంపై చర్చించడానికి ప్రభుత్వం అనుమతించడం లేదు. చర్చ జరపాలని పార్లమెంట్‌లో మేం అడిగితే మళ్లీ ప్రతీకార రాజకీయాలు మొదలుపెడుతున్నారని కాంగ్రెస్‌ ‌ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ ‌మండిపడ్డారు. అదుపులోకి తీసుకున్న కాంగ్రెస్‌ ఎం‌పీలు, ఇతర నేతల్ని విడిచి పెట్టినట్లు కాసేపటి తర్వాత పోలీసులు ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page