ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 4 : కడ్తాల్ మండలంలోని బాలాజీ నగర్ గ్రామపంచాయతీ పరిధిలోని రేఖలకుంటతండకు చెందిన జర్పుల లక్ష్మీ మృతి చెందారు. విషయం తెలుసుకున్న గ్రామీణాభివృద్ధి స్టాండింగ్ కమిటీ జిల్లా సభ్యులు కడ్తాల్ జెడ్పిటిసి జర్పుల దశరథ్ నాయక్ వెంటనే రేఖలకుంటతండకు చేరుకొని లక్ష్మీ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఆమె కుటుంబ సభ్యులలో మనోధైర్యం కల్పించారు. తదుపరి లక్ష్మీ కుటుంబ సభ్యులకు జర్పుల రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రూ.5వేల ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కంలి బిచ్య బావోజీ, గ్రామ పెద్దలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.