యాచారం ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ నేతలు

– మంత్రి హరీష్ రావు హంగులు ఆర్భాటాల తో శంకుస్థాపన చేసి హాస్పిటల్ కు కోటి యాభై లక్షలు మాత్రమే కేటాయించడం హాస్యాస్పదం
– హాస్పిటల్ కు 20 కోట్లు కేటాయించి 50 పడకల హాస్పిటల్ గా అప్ గ్రేడ్ చేయాలి కాంగ్రెస్ సీనియర్ నాయకులు కోదండ రెడ్డి, దండెం రాంరెడ్డి

ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,ఆగస్ట్ 25 : ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు హంగులు ఆర్భాటాలతో శంకుస్థాపన చేసి హాస్పిటల్ కు కోటి యాభై లక్షలు మాత్రమే కేటాయించడం హాస్యాస్పదం అని కాంగ్రెస్ సీనియర్ నాయకులు కోదండ రెడ్డి,దండెం రాంరెడ్డిలు పేర్కొన్నారు.శుక్రవారం
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం,యాచారం మండలంలోని ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రాని వారు సందర్శించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ,దాదాపు 60 ఏళ్ళక్రితం నిర్మించిన హాస్పిటల్ ను 50 పడకల హాస్పిటల్ గా అప్ గ్రేడ్ చేయాలని 3 ఏళ్ళక్రితం కాంగ్రెస్ నేతలు ప్రభుత్వానికి మెమొరాండం ఇవ్వడం జరిగిందని తెలిపారు.ఈ నెల 17 న మంత్రి హరీష్ రావు వచ్చి హాస్పిటల్ పునఃనిర్మాణ శంకుస్థాపన చేసి నిర్మాణానికి కోటి యాభై లక్షలు మంజూరు చేశారని వారు గుర్తు చేశారు.ఈరోజు జాతీయ కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి,టీపిసిసి కార్యదర్శి,ప్రచార కమిటీ కార్యనిర్వహక సభ్యులు దండెం రాంరెడ్డిలు సీనియర్ నాయకులు హాస్పిటల్ ను సందర్శించి, పరిశీలించడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,హైదరాబాద్ నుండి మొదలు పెడితే నాగార్జున సాగర్ వరకు ఉన్న ఒకే ఒక్క ఆసుపత్రి అని అన్నారు.యాచారం మండలంలో ఉన్న పరిసర గ్రామాలు వెనుకబడి ఉన్న గ్రామాలు కాబట్టి రోజు 2 వందల నుండి 3 వందల మంది ప్రజలు వచ్చి ఇక్కడ హెల్త్ పరీక్షలు చేయించుకుంటారని వెల్లడించారు.ఇప్పుడున్న బిల్డింగ్ పూర్తిగా శిధిలావస్థలో ఉంది కాబట్టి కొత్త బిల్డింగ్ కి వెంటనే 20 కోట్లు కేటాయించాలని అన్నారు. హరీష్ రావు చెప్పిన ఒక కోటి యాభై లక్షలు దేనికి సరిపోవని అన్నారు.ఎన్నికలకు ఇంకా సమయం ఉంది కాబట్టి 18 నుండి 20 కోట్ల రూపాయలు కేటాయించి,50 పడకల హాస్పిటల్ గా అప్ గ్రేడ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేశారు.లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ పోరాటానికి దిగుతుంది అన్నారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మర్రి నిరంజన్ రెడ్డి,ఎక్స్ ఎంపీపీ యాచారం మండల్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు దిండి రాంరెడ్డి,ఇబ్రహీంపట్నం మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొమ్మిడి శ్రీనివాస్ రెడ్డి,రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ భాస్కర్,శ్రీదర్ రెడ్డి,రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి హతిరామ్, భువనగిరి పార్లమెంట్ యూత్ కాంగ్రెస్ కార్యదర్శి నర్సింగ్,వార్డ్ మెంబర్ కాంటేకర్ రాహుల్,మాజీ సేవాదళ్ చైర్మన్ రాంబాబు, తాండ్ర నర్సింహా,మనీష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page