యాత్రికుల్లో పెరుగుతున్న ఆత్మవిశ్వాసం..!

  • స్థానికుల నుంచి అపూర్వ ఆదరణ
  • స్వచ్చందంగా పాల్గొంటున్న ప్రజా సంఘాలు
  • 37వ రోజు కర్నాటకలో కొనసాగిన రాహుల్‌ ‌భారత్‌ ‌జోడో యాత్ర
  • త్వరలో రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికల నేపథ్యంలో యాత్రకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్న రాష్ట్ర పార్టీ

‌రాహుల్‌ ‌గాంధీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్‌ ‌జోడో యాత్ర గురువారం 37వ రోజు కర్ణాటకలో చిత్రదుర్గలోని బొమ్మగొండనహళ్లి నుండి ఉదయం సెషన్‌ 6.30 ‌గంటలకు పునఃప్రారంభించారు. జనవరి 30 వరకు దాదాపు 3500 కిలోమీటర్ల మేర 12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల మీదుగా జమ్ము కశ్మీర్‌ ‌వరకు కొనసాగనున్న యాత్ర ఇప్పటికి సుమారు 925 కిలోమీటర్ల మేర పూర్తయింది. కాగా ఉదయం సెషన్‌ను 11 గంటలకు కొంసాగ్రరాలో ముగించారు. తిరిగి 4 గంటలకు సాయంత్రం సెషన్‌ను ప్రారంభించి మొలకల్మూరులోని కేఈబి సర్కిల్‌లో ముగించి రాంపురాలో అమృత హోటల్‌ ‌సమీపంలోని మైదానంలో రాత్రి బస చేశారు. ఎప్పటి మాదిరిగానే యాత్రలో రాహుల్‌ ‌వెంట రాష్ట్ర పార్టీ నేతలు, కార్యక్తలు, మద్ధతుదారులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.భారత్‌ ‌జోడో యాత్ర పట్ల ప్రజల్లో రోజురోజుకు ఉత్సాహం పెరుగుతోంది. యాత్ర అంతిమ లక్ష్యాన్ని చేరుకుంటామన్న ఆత్మా విశ్వాసం ,చైతన్యం యాత్రికుల్లో ద్విగుణీకృతమవుతుంది.

గురువారం యాత్రలో రాహుల్‌ ‌గాంధీతో పౌర సమాజం రెండు గ్రూపులుగా పాల్గొన్నారు. ఇందులో డాక్టర్‌ ‌విజయమ్మ (సీనియర్‌ ‌జర్నలిస్ట్ ‌మరియు సామాజిక కార్యకర్త•), పుష్పలత (ప్రొఫెసర్‌), ‌శివరామ్‌ అయ్యర్‌ (‌రచయిత,సామాజిక కార్యకర్త ), డి నాగరాజ్‌ (‌రాష్ట్ర అధ్యక్షుడు డిఎస్‌ఎస్‌ ‌కోఆర్డినేటర్‌), ‌జిగ్నేష్‌ ‌యాంకర్‌ (‌డిఎస్‌ఎస్‌), ‌యన్ను ఇంక్తేష్‌ (‌డిఎస్‌ఎస్‌), ‌గొల్లల్లి శివప్రసాద్‌ (‌గాయకుడు మరియు సామాజిక కార్యకర్త) మరియు పలువురు దళిత సంఘర్ష్ ‌సమితి సీనియర్‌ ‌నాయకులు పాల్గొన్నారు. దేశానికి సంఘీభావం సందేశాన్ని అందిస్తూ, ద్వేషం మరియు విభజనకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ పోరాడాలని సంకల్పించారు.రాత్రి 7 గంటలకు మొలకల్మూరులో యాత్ర ముగిసింది..మరోవైపు గురువారం నాగ్‌పూర్‌లో, దక్షిణాయన్‌ ‌నాగ్‌పూర్‌లో భారత్‌ ‌జోడో యాత్రకు మద్దతుగా ఒక సమావేశం నిర్వహించబడింది, ఇక్కడ ప్రొఫెసర్‌ ‌యోగేంద్ర యాదవ్‌, ‌రామ్‌ ‌పునియాని, గణేష్‌ ‌దేవి, ప్రతిభా షిండే, ఫిరోజ్‌ ‌మితిబోర్వాలా, కె రనడే, విలాస్‌ ‌భోంగాడే, పరుమిత గోస్వామి, అరుణా సబానే, ప్రొ. ప్రమోద్‌ ‌ముంగాడే, ఆశా సక్సేనా, సమీక్షా గన్వీర్‌, ‌రాజ్‌ అ‌స్రోంద్కర్‌, ‌షకీల్‌ అహ్మద్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

దీనితో పాటు, మహారాష్ట్ర అంతటా పౌర సమాజ సంస్థలు మరియు ప్రజా ఉద్యమాలు భారత్‌ ‌జోడో యాత్రకు మద్దతునిచ్చాయి. కాగా ఈ నెల 17న జరుగనున్న అధ్యక్ష ఎన్నికలకు భారత్‌ ‌జోడో యాత్రలో భాగమైన 40 మంది ప్రదేశ్‌ ‌కాంగ్రెస్‌ ‌కమిటీ(పిసిసి) ప్రతినిధులతో పాటు రాహుల్‌ ‌గాంధీ పార్టీ క్యాంప్‌సైట్‌లో పార్టీ అధ్యక్ష ఎన్నికల కోసం ఏర్పాటు చేయనున్న ప్రత్యేక బూత్‌లో తమ వోటు వేయనుండగా వోటింగ్‌ ‌కోసం పాదయాత్రకు ఒకరోజు విరామం ఇవ్వనున్నారు. ఇక మరో ఆరు నెలల్లో కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఇక్కడ పోటీ కాంగ్రెస్‌ ‌మరియు అధికార బిజెపి పార్టీల మధ్యనే ఉంది. దక్షిణాదిలో బిజెపికి గట్టి పోటీ ఇచ్చే స్థాయిలో కాంగ్రెస్‌ ‌పార్టీ కర్నాటక రాష్ట్రంలో ఉండడంతో భారత్‌ ‌జోడో యాత్ర ద్వారా రాజకీయంగా పూర్తి స్థాయిలో లబ్ది పొందే విధంగా స్థానిక నేతలు కృషి చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page