మూడో రోజుకు మహాకుంభ సంప్రోక్షణ
ప్రజాతంత్ర, యాదాద్రి, మార్చి 23 : యాదాద్రిలో మహాకుంభ సంప్రోక్షణ మూడో రోజుకు చేరింది. సంప్రోక్షణలో అతిముఖ్య ఘట్టమైన పంచ కుండాత్మక మహాక్రతువును వేదపండితులు ప్రారంభించారు. మహాయాగంలో భాగంగా బుధవారం ఉదయం 9 గంటలకు యాగశాలలో శాంతి పాఠంతో కార్యక్రమాలు ప్రారంభమయిన అనంతరం ద్వారతోరణం, ధ్వజకుంభారాధన, చతుఃస్థానార్చన, మూలమంత్ర హవనము, షోడష కలశాభిషేకం, నిత్యలఘు పూర్ణాహుతి నిర్వహించారు.
సాయంత్రం 6 గంటల నుంచి..సామూహిక శ్రీవిష్ణు సహస్రనామ పారాయణం, ద్వారాతోరణ ధ్వజకుంభ ఆరాధన, మూల మంత్రి హవనములు, పంచగవ్యాధి వాసం, నిత్యలఘు పూర్ణాహుతి నిర్వహించారు.