రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై అనుచిత వ్యాఖ్యలు

  • పార్లమెంటులో అధీర్‌ ‌రంజన్‌ ‌వ్యాఖ్యలపై దుమారం
  • ఉభయ సభల్లో బిజెపి మహిళా నేతల ఆగ్రహం
  • కాంగ్రెస్‌ ‌క్షమాపణలు చెప్పాలని మంత్రులు నిర్మల  డిమాండ్‌
  • ‌గందరగోళంతో ఉభయసభలు వాయిదా
  • పార్లమెంట్‌ ‌బయట బిజెపి మహిళా నేతల ఆందోళన

న్యూ దిల్లీ, జూలై 28 : రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై కాంగ్రెస్‌ ‌నేత అధిర్‌ ‌రంజన్‌ ‌చేసిన వ్యాఖ్యలపై పార్లమెంట్‌ ‌దద్దరిల్లింది. ఉభయసభల్లో బీజేపీ ఆందోళన చేపట్టింది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును ఉద్దేశించి కాంగ్రెస్‌ ‌లోక్‌సభాపక్ష నేత అధీర్‌ ‌రంజన్‌ ‌చౌధరీ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. రాష్ట్రపతిని కించపరిచేలా వ్యాఖ్యానించిందుకు కాంగ్రెస్‌ ‌పార్టీ క్షమాపణ చెప్పాలంటూ భాజపా ఎంపీలు పార్లమెంటు లోపలా, బయటా ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు మహిళా ఎంపీలు పాల్గొన్నారు. దేశ రాష్ట్రపతిని కాంగ్రెస్‌ ‌పార్టీ అవమానపరిచిందని కేంద్ర మంత్రి స్మతి ఇరానీ అన్నారు. తక్షణమే ఆ అనుచిత వ్యాఖ్యల పట్ల క్షమాపణలు చెప్పాలని స్మ•తి ఇరానీ డిమాండ్‌ ‌చేశారు.  రాష్ట్రపతిని కాంగ్రెస్‌ ‌పార్టీ అవమానించిందని, క్షమాపణలు చెప్పాల్సిందేనని కేంద్రమంత్రి స్మ•తి ఇరానీ గురువారం లోక్‌సభలో గళం వినిపించారు.

రాష్ట్రపతి పదవిలో ఓ తోలుబొమ్మను కూర్చో బెట్టారని, ఆమె రాష్ట్రపతి కాదని, ’రాష్ట్రపత్ని’ అంటూ కాంగ్రెస్‌ ‌నేత అధిర్‌ ‌రంజన్‌ అభ్యంతరకర వ్యాఖ్యలే చేశారు. ఈ కామెంట్లపై అధికార బీజేపీ భగ్గుమంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కాంగ్రెస్‌ అవమానించింది. కాంగ్రెస్‌ ‌పార్టీ క్షమాపణలు చెప్పాల్సిందే అని స్మతి ఇరానీ మండిపడ్డారు. తన వ్యాఖ్యలు తప్పే అని అధిర్‌ ‌రంజన్‌ ఒప్పు‌కున్నా.. వ్యవహారం చల్లారలేదు. ’తన వ్యాఖ్యలు తప్పేనని, ఉరి తీస్తే ఉరి తీయండంటూ’ ఆవేశంగా మాట్లాడారు.. ఇప్పటికే అధిర్‌ ‌రంజన్‌ ‌క్షమాపణలు చెప్పారని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ వివరణ ఇచ్చినా.. అధికార పక్షం శాంతించలేదు. దేశ అత్యున్నత పదవిలో ఉన్న ఓ వ్యక్తిని అవమానించేందుకు సోనియా గాంధీ తన సభ్యులకు అనుమతి ఇచ్చినట్లు అయ్యిందని స్మ•తి ఇరానీ మండిపడ్డారు. ఈ క్రమంలో ఒకానొక టైంలో బీజేపీ సభ్యులంతా లేచి.. స్మతి ఇరానీకి మద్ధతుగా గళం వినిపించారు. ఈ గందరగోళం నడుమే లోక్‌సభ 12 గం. దాకా వాయిదా పడింది. పార్లమెంట్‌ ఆవరణలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ‌తన తోటి ఎంపీలతో కలిసి ప్లకార్డులు చేతబట్టి నిరసన వ్యక్తం చేశారు. అధిర్‌ ‌రంజన్‌వి సెక్సీయెస్ట్ ‌కామెంట్లు అని, ఇది  గిరిజన బిడ్డకు జరిగిన అవమానం అంటూ ఆమె పేర్కొన్నారు. అయితే ఇప్పటికే అధీర్‌.. ‌క్షమాపణలు చెప్పారని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ తెలిపారు. గురువారం.. అధికార, ప్రతిపక్ష పార్టీ సభ్యుల పోటాపోటీ నినాదాలతో ఉభయసభలు హోరెత్తాయి. దీంతో వాయిదా పడ్డాయి. మన దేశ తొలి గిరిజన రాష్ట్రపతిని కించపరిచినందుకుగాను పార్లమెంటులో, వీధుల్లో కాంగ్రెస్‌ ‌క్షమాపణ చెప్పాలని కేంద్ర మంత్రి స్మతి ఇరానీ డిమాండ్‌ ‌చేశారు.

ఇటీవల భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై కాంగ్రెస్‌ ఎం‌పీ అధీర్‌ ‌రంజన్‌ ‌చేసిన అనుచిత వ్యాఖ్యలకు దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఇది అత్యున్నత రాజ్యాంగ పదవి గౌరవాన్ని కించపరిచేలా ఉందని వ్యాఖ్యానించారు. సోనియా గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్‌ ‌సభ్యులు రాజ్యాంగ పదవుల్లో ఉన్న మహిళలను కించపరుస్తూనే ఉన్నారని  స్మ•తి ఇరానీ అన్నారు. కాంగ్రెస్‌ ‌గిరిజన వ్యతిరేకి, దళిత,మహిళా వ్యతిరేకి అని దేశానికి తెలుసునని ఆరోపణలు చేశారు. ద్రౌపదిముర్ము రాష్ట్రపతి పదవికి నామినేట్‌ అయినప్పటి నుండి ఆమెను కాంగ్రెస్‌ ‌దురుద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకుని ఏదో ఒక విమర్శ చేస్తూనే ఉందన్నారు. దీంతో లోక్‌సభలో స్మ•తి మాట్లాడుతూ దేశంలో గిరిజనులకు,దళితులకు కాంగ్రెస్‌ ‌బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ ‌చేశారు. ఇటీవల కొత్తగా నియమితులైన భారత రాష్ట్రపతి ముర్ముపై ఎంపీ అధీర్‌ ‌రంజన్‌ ‌చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.

రాష్ట్రపతి ముర్మును కాంగ్రెస్‌ ‌లోక్‌ ‌సభాపక్ష నేత అధీర్‌ ‌రంజన్‌ ‌చౌదరి రాష్ట్రపత్ని అన్నందుకు గానూ దేశంలోని పలు చోట్ల ఇప్పటికే నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ‌కూడా బీజేపీ ఎంపీలతో కూడా ఆందోళనకు దిగారు. పార్లమెంటు ఎదుట అధీర్‌ ‌రంజన్‌ ‌చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసనలో పాల్గొన్నారు. కాంగ్రెస్‌ ‌క్షమాపణ చెప్పాల్సిందే అంటూ నేతలు డిమాండ్‌ ‌చేశారు. రాజ్యసభలో నిర్మలా సీతారామన్‌ ‌ఘాటుగా స్పందించారు. దీనిపై వెంటనే క్షమాపణలు చెప్పాల న్నారు. కాంగ్రెస్‌ ఎం‌పీ అధీర్‌ ‌రంజన్‌, ‌రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర ఆందోళనలు సృష్టిస్తున్నాయి. అందుకు గానూ కాంగ్రెస్‌ ‌క్షమాపణ చెప్పాలన్న బీజేపీ డిమాండ్‌ ‌నేపథ్యంలో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ స్పందించారు. ఈ విషయంపై ఇప్పటికే ఎంపీ అధీర్‌ ‌రంజన్‌ ‌క్షమాపణలు చెప్పారని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page