రాష్ట్రస్థాయి ఖడ్గ యుద్ధ క్రీడలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పార్థసారధి 

కులకచర్ల, ప్రజాతంత్ర, అక్టోబర్ 02 : రాష్ట్రస్థాయి ఖడ్గ యుద్ధ (ఫెన్సింగ్) క్రీడలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పార్థసారధి.ఎదుటి వ్యక్తి కదిలికలను వేగంగా గ్రహించడం.ఆటపై ఏకాగ్రత సాధించడం వంటి ప్రత్యేక లక్షణాలు కలిగిన ఆటల్లో ఖడ్గయుధ్ద( ఫెన్సింగ్)క్రీడ ఒకటి ఈ క్రీడలో కుల్కచర్ల గ్రామంలో సామాన్య కుటుంబానికి చెందిన కొడుదుటి పెంటయ్య కుమారుడు పార్థసారథి తెలంగాణ రాష్ట్ర క్రీడ పాఠశాల అకింపేట్ లో విద్యనభ్యసిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వరంగల్ లో నిర్వహించిన తెలంగాణ రాష్ట్రాస్థాయి 4వ పెన్సింగ్ క్రీడా పోటీలలో అండర్ 17 ఇయర్స్ ఫెన్సింగ్ బాలుర క్రీడా విభాగంలో సోంతంగా, గ్రూప్ విభాగంలో రెండు బంగారు పథకాలు సాధించారు.చదువుతోపాటు క్రీడలలో ఉన్నతమైన ప్రతిభ కనబరచిన మారుమూల ప్రాంతమైన కులకచర్ల గ్రామ నివాసి కొడుదుటి పార్థసారథికి రాష్ట్రస్థాయి పెన్సింగ్ క్రిడలో ఇది రెండోవసారి 4 బంగారు పథకాలు సాధించాడు.  త్వరలో జరుగబోయే మహారాష్ట్ర నేషనల్ పెన్సింగ్ క్రీడలకు ఎంపిక అయ్యారడు. కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలు పలువురు పార్థసారథిని అభినందించారు. రాబోయే కాలంలో దేశానికి ప్రాతినిధ్యం వహించాలని, ఉన్న ఊరుకు, కన్న తల్లిదండ్రులకు, గ్రామానికి, చదువుకున్న పాఠశాలకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని వివిధ యువజన సంఘాల నాయకులు, గ్రామ పెద్దలు తదితరులు అభినందనలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page