- ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న ఛార్జీలు
- 14 శాతం ఛార్జీలు పెంచుకునేందుకు టిఎస్ఈఆర్సీ అనుమతి
- డొమెస్టిక్ మీద యూనిట్‌కు 40 నుంచి 50 పైసలు..
- ఇతర కేటగిరీలపై యూనిట్‌కు రూపాయి పెరిగే అవకాశం
- ప్రజలపై మరింత విద్యుత్ ఛార్జీల భారం
ప్రజాతంత్ర, హైదరాబాద్, మార్చి 23 : తెలంగాణలో విద్యుత్ ఛార్జీల పెంపునకు రంగం సిద్ధమైంది. ఈఆర్సీ అనుమతించడంతో ధరలు పెరగనున్నాయి. 14 శాతం విద్యుత్ ఛార్జీలను పెంచుతూ టీఎస్ఈఆర్సీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అయితే 19 శాతం పెంపునకు డిస్కంలు అనుమతి కోరాయి. డొమెస్టిక్ వి•ద 40 పైసల నుంచి 50 పైసలు పెంచనున్నారు. ఇతర కేటగిరీలపై యూనిట్‌కు రూపాయి చొప్పున పెరుగనుంది. దీంతో వినియోగదారులపై భారీగా భారం పడనుంది. ఇప్పటికే ధరల పెరుగుదలపై విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. అయినా ప్రభుత్వం ధరల పెంపునకే మొగ్గు చూపింది. ఎండాకాలంలో విద్యుత్ రేట్లు షాక్ ఇవ్వబోతున్నాయి. ఈఆర్సీ అనుమతించడంతో తెలంగాణలో విద్యుత్ ఛార్జీలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డిస్కంల వినతి మేరకు కరెంటు ఛార్జీలను పెంచుతూ కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 14 శాతం విద్యుత్ ఛార్జీలను పెంచుతూ తెలంగాణ ఈఆర్సీ ఉత్తర్వలు జారీ చేసింది. డొమెస్టిక్ వి•టర్లపై యూనిట్‌కు 40 నుంచి 50 పైసల వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. అలాగే ఇతర కేటగిరీలపై యూనిట్‌కు రూపాయి చొప్పున పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాగా.. రాష్ట్రంలో 19 శాతం మేర విద్యుత్ ఛార్జీల పెంపునకు అనుమతి కోరగా..14 శాతం మాత్రమే విద్యుత్ ఛార్జీలను పెంచుతూ తెలంగాణ ఈఆర్ఎసీ ఉత్తర్వులు జారీ చేసింది.
దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకోనున్నారు. ఒకవేళ సీఎం కేసీఆర్ చార్జీల పెంపుకే మొగ్గు చూపితే రాష్ట్రంలో ఏప్రిల్ ఒకటి నుంచి కరెంటు ఛార్జీలు భారీగా పెరగనున్నాయి. దీనిపై ప్రభుత్వం నుంచి అధికారిక ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. అయితే వ్యవసాయం,సెలూన్లకు పెంపు వర్తించబోదని స్పష్టం చేసింది. ఈ మేరకు వి•డియా సమావేశంలో రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ) ఛైర్మన్ టి.శ్రీరంగారావు వెల్లడించారు. డిస్కమ్‌లు ఐదేళ్ల విద్యుత్ టారిఫ్ ప్రతిపాదనలు కమిషన్ ముందుంచాయని, దీనిపై వినియోగదారుల అభిప్రాయాలను కమిషన్ పరిగణనలోకి తీసుకుందని ఈఆర్సీ ఛైర్మన్ తెలిపారు. 2022-23 ఏడాదికి డిస్కమ్‌లు ప్రతిపాదించిన రెవెన్యూ గ్యాప్ రూ.16వేల కోట్లని చెప్పారు.
కానీ, రూ.14,237 కోట్ల రెవెన్యూ గ్యాప్‌ను కమిషన్ ఆమోదించిందని వివరించారు. వ్యవసాయానికి విద్యుత్ టారిఫ్ పెంచలేదు. ఈవీ ఛార్జింగ్‌కు టారిఫ్ ప్రతిపాదనలు ఆమోదించలేదు. డిస్కమ్‌లు నవంబర్ 30లోపు ప్రతిపాదనలు కమిషన్ ముందు ఉంచాలని శ్రీరంగారావు అన్నారు. ఆసక్తిగలవారు స్మార్ట్ ప్రీపెయిడ్ వి•టర్ల ఏర్పాటు చేసుకోవచ్చని ఈఆర్సీ ఛైర్మన్ తెలిపారు. జీడిమెట్ల స్మార్ట్ గ్రిడ్ పూర్తిస్థాయిలో విస్తరించాలని అధికారులకు సూచించారు. ద్రవ్యలోటు రూ.6,338 కోట్లుగా డిస్కమ్‌ల ప్రతిపాదించాయని… రూ.5,596 కోట్లకు కమిషన్ ఆమోదం తెలిపిందని చెప్పారు.