రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెడితే సమాజం తిరగబడతది

  • బిజెపి నేతలు ఏం ముఖం పెట్టుకుని గజ్వేల్‌, ‌సిద్ధిపేటలో తిరుగుతున్నారు…
  • కేంద్రం, బిజెపి నేతలపై మంత్రి హరీష్‌రావు ఫైర్‌
  • ఎదిగిన కొద్ది ఒదిగి ఉండే మనస్తత్వం మాదాసు శ్రీనివాసుది
  • గజ్వేల్‌ ఏఎం‌సి పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సంలో మంత్రి హరీష్‌రావు

సిద్ధిపేట/గజ్వేల్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 14 : ‌న్యాయబద్దంగా కేంద్రం ఇవ్వాల్సిన పెండింగ్‌ ‌నిధులు విడుదల చేయకుండా తెలంగాణ ప్రజలను కేంద్రంలోని బిజెపి పార్టీ ప్రభుత్వం ఇబ్బంది పెడితే తెలంగాణ సమాజం తిరగబడుతుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు కేంద్రాన్ని తనదైనశైలిలో హెచ్చరించారు. మంగళవారం సిద్ధిపేట జిల్లా గజ్వేల్‌ ‌వ్యవసాయ మార్కెట్‌ ‌కమిటీ(ఏఎంసి) నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రి హరీష్‌రావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ..మెడికల్‌ ‌కళాశాలలు, నవోదయ పాఠశాలల కొరకు వందలాది దరఖాస్తులు పెట్టుకున్నా కూడా కేంద్రంలోని బిజెపి పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి మంజూరు కాకుండా అడ్డుపడుతుందన్నారు. ఉపాధిహామీని వ్యవసాయానికి అనుబంధం చేయాలని ఇప్పటికే మూడుసార్లు రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి పంపామని, ఆ పని చేసుకొచ్చి ముఖం చూపిస్తే బాగుంటుందని బిజెపి నేతలకు చురకలు అంటించారు. బాయిల కాడ మోటారు పెడితే 25వేల కోట్ల రూపాయలు ఇస్తామని కేంద్రం ఆశ చూపిందని, కానీ సిఎం కేసీఆర్‌ ‌బాయికాడ మోటార్లను పెట్టేది లేదని, రైతులకు కష్టం తెచ్చేది లేదని కరాఖండిగా తేల్చి చెప్పారని మంత్రి హరీష్‌రావు వెల్లడించారు. ఎఫ్‌సిఐతో బియ్యం కొనకుండా రైసుమిల్లులపై దాడులు చేసి కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందన్నారు. కేంద్రంలోని బిజెపి పార్టీ ప్రభుత్వం ఓర్వలేక తెలంగాణ ప్రభుత్వ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తుందనీ ఆరోపించారు. తెలంగాణకు హక్కుగా రావాల్సిన ఎఫ్‌ఆర్‌బిఎం నిధులను కావాలనే బిజెపి ప్రభుత్వం ఆపివేసిందన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వని పార్టీ బిజెపి అని, వరంగల్‌లో రైల్వే కోచ్‌ ‌ఫ్యాక్టరీని కేంద్రంలోని బిజెపి పార్టీ ప్రభుత్వం ఆపేసిందన్నారు. వరంగల్‌ ‌రావాల్సిన రైల్వే కోచ్‌ ‌ఫ్యాక్టరీ గుజరాత్‌కు తీసుకెళ్లిందని విమర్శించారు. కేంద్రంలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తారో చెప్పాలని కేంద్రంలోని బిజెపి మంత్రులు, రాష్ట్రంలోని బిజెపి నేతలను మంత్రి హరీష్‌రావు డిమాండు చేశారు. తెలంగాణలో ప్రభుత్వంలో ఒక్క ఉద్యోగం ఖాళీగా లేకుండా అన్నీ నింపుతామని చెప్పినట్టుగానే సిఎం కేసీఆర్‌ ఉద్యోగ నియామకాలు భర్తీ ప్రారంభించారని మంత్రి వెల్లడించారు. బిజెపి నాయకులు ఏం ముఖం పెట్టుకుని సిద్ధిపేట, గజ్వేల్‌లో తిరుగుతున్నారని మంత్రి ధ్వజమెత్తారు. ఎదిగిన కొద్ది ఒదిగి ఉండే మనస్తత్వం ఛైర్మన్‌ ‌మాదాసు శ్రీనివాసుదనీ, సిఎం కేసీఆర్‌ ‌కూడా మాదాసు శ్రీనివాస్‌కు పదవీ ఇస్తే బాగుంటదనే అభిప్రాయం వ్యక్తం చేశారన్నారు. 2001 నుంచి ఇప్పటి వరకూ అటు ఉద్యమంలో ఇటు పార్టీలో కష్టపడి పని చేసే వ్యక్తి శ్రీనివాస్‌ అన్నారు.

ఈ సందర్బంగా ఛైర్మన్‌, ‌వైస్‌ ‌ఛైర్మన్‌గా నియమితులై ప్రమాణ స్వీకారం చేసిన శ్రీనివాస్‌, ‌రాచమల్ల ఉపేందర్‌రెడ్డి, సభ్యులకు మంత్రి హరీష్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమావేశంలో ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి, మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి, కార్పొరేషన్‌ ‌ఛైర్మన్లు వంటేరు ప్రతాప్‌రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్‌, ‌జిల్లా పరిషత్‌ ‌ఛైర్‌పర్సన్‌ ‌వేలేటి రోజా రాధాకృష్ణశర్మ, సిఎం ఒఎస్‌డి దేశపతి శ్రీనివాస్‌, ‌మాజీ కార్పొరేషన్‌ ‌ఛైర్మన్‌ ‌దేవిప్రసాద్‌, ‌మునిసిపల్‌ ‌ఛైర్మన్‌ ‌రాజమౌళిగుప్తా, రైతుబంధు రాష్ట్ర సభ్యుడు దేవి రవీందర్‌, ఎం‌పిపి దాసరి అమరావతి, ములుగు డివిజన్‌ ఆత్మ కమిటీ ఛైర్మన్‌ ‌రంగారెడ్డి, టిఆర్‌ఎస్‌ ‌పార్టీ నేతలు జి.ఎలక్షన్‌రెడ్డి, వేలేటి రాధాకృష్ణశర్మ, బక్కి వెంకటయ్య, బెండ మధు నాగిరెడ్డి, వంటేరు సుధాకర్‌రెడ్డి, పోచబోయిన శ్రీహరియాదవ్‌, ‌యెంబరి రామచంద్రం, పనుగట్ల శ్రీనివాస్‌గౌడ్‌, ‌మల్లేశం, ఎంపిటిసిలు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page