వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

రాహుల్‌గాంధీ ప్రధాని కావడం ఖాయం

April 5, 2019

షాద్‌నగర్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎఐసిసి జాతీయ కార్యదర్శి సలీం, వంశీచంద్‌రెడ్డి విలేకరుల సమావేశంలో ఎఐసిసి జాతీయ కార్యదర్శి సలీం అహ్మద్‌, ‌వంశీచందర్‌రెడ్డిలు
షాద్‌నగర్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎఐసిసి జాతీయ కార్యదర్శి సలీం, వంశీచంద్‌రెడ్డి విలేకరుల సమావేశంలో ఎఐసిసి జాతీయ కార్యదర్శి సలీం అహ్మద్‌, ‌వంశీచందర్‌రెడ్డిలు

టిఆర్‌ఎస్‌, ‌బిజెపి ఒకే గూటి పక్షులు
భారతదేశ ప్రధానిగా కాంగ్రెస్‌ ‌పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ కావడం ఖాయమని, గడిచిన ఐదేళ్ల మోదీ పాలనలో ప్రజలు నిరాశలో ఉన్నారని, టిఆర్‌ఎస్‌, ‌బిజెపి ప్రభుత్వాలు ఒకే గూటి పక్షులని, తెలంగాణ రాష్ట్రంలో వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో 10 స్థానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్ధులు గెలుస్తారని ఎఐసిసి జాతీయ కార్యదర్శి సలీం అహ్మద్‌, ‌పార్లమెంట్‌ ఎం‌పి అభ్యర్ధి డా.వంశీచందర్‌రెడ్డిలు అన్నారు. గురువారం మహబూబ్‌నగర్‌ ‌పార్లమంటరీ నియోజకవర్గ పరిధిలోని షాద్‌నగర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. అంతకుముందు కొత్తూరు, నందిగామ, కేశంపేట, షాద్‌నగర్‌లలో ర్యాలీలు నిర్వహించారు. మోదీ పాలనలో సామాన్యులు ఇబ్బందులకు గురయ్యారని, జిఎస్టీ, నోట్ల రద్దు అంశాలలో సామాన్య ప్రజలు విలవిలలాడిపోయారన్నారు. మోదీ పాలనపై ప్రజలు నిరాశలో ఉన్నారని, మోదీ మాటలు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరన్నారు. ప్రస్తుతం దేశంలో కాంగ్రెస్‌ ‌పవనాలు వీస్తున్నాయన్నారు. ఇటీవల జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో తేటతెల్లమైందన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనూ భాజపా అస్తిత్వం లేదని, ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే అత్యధిక స్థానాల్లో అభ్యర్ధులకు డిపాజిట్లు కూడా రాలేదన్నారు. రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌, ‌భాజాపా పార్టీలకు ప్రజలు తగినబుద్ది చెబుతారని అన్నారు. టిఆర్‌ఎస్‌, ‌బిజెపి ప్రభుత్వాలు ఒకే గూటి పక్షులని, లోపాయకారం చేసుకుని ఇరుపార్టీలు ముందుకు సాగుతున్నాయన్నారు. రాహుల్‌గాంధీ ప్రవేశపెట్టినటుంటి ఎన్నికల మేనిఫెస్టోను ప్రజలు ఆదరిస్తారని, ప్రత్యేకంగా తీసుకున్నటువంటి పేదోడికి రూ.72వేలు ఆర్థిక సహయం నిర్ణయం ప్రజలు కాంగ్రెస్‌ ‌పార్టీని స్వాగతిస్తున్నారన్నారు. అందుచేత వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌, ‌బిజెపికి తగిన బుద్ది చెప్పి కాంగ్రెస్‌ ‌పార్టీని గెలిపించాలని వారు కోరారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి, డిసిసి అధ్యక్షులు ఒబేదుల్లా కొత్వాల్‌, ‌సయ్యద్‌ ఇ‌బ్రహిం, తదితరులు పాల్గొన్నారు.