ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,ఆగస్ట్ 25 : బిఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరగబడదం “తరిమికొడదాం” అనే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో శుక్రవారంకు రెండవ రోజుకు చేరుకుంది.ఈ సందర్భంగా ఈసి.చంద్రశేఖర్ గౌడ్ మాట్లాడుతూ,ఇబ్రహీంపట్నం మండలం దండు మైలారం,నెరపల్లి గ్రామాల్లో కార్యకర్తలు,నాయకులతో కలసి గడప గడపకు ప్రచారం నిర్వహించారు.బిఆర్ఎస్ పాలనలో జరుగుతున్న మోసాలాకు యావత్ ప్రజానీకాన్ని ఏకం చేసి మార్పు కోసం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం ద్వారా బిఆర్ఎస్ పాలనలో ప్రజలు పడుతున్న బాధలను ఎండగట్టడంతో పాటు తమ సమస్యలను బిఆర్ఎస్ పాలకుల అన్యాయాలను వివరించేందుకు ప్రజలకు ఒక వేదిక ఏర్పాటు చేయడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం అని తెలిపారు.ప్రజల్లో మార్పు తీసుకురావలనే లక్ష్యంతో కాంగ్రెస్ నాయకులు ముందుకు కదులుతున్నారని ఆయన తెలిపారు.కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్,బిజెపి ప్రభుత్వాల వైపల్యాలపై చార్జ్ సీటు విడుదల చేయడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో ప్రధాన అంశం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం అసమర్ధ పాలన, అన్యాయాలను ఈ చార్జ్ సీట్లో పొందుపరచనున్నామన్నారు.బిఆర్ఎస్ పాలనల ప్రజల ఇబ్బందులుపరిపాలన వైఫల్యాలకు ఎస్ఆర్సి నిదర్శనంగా మారిందని తెలంగాణలో ఉన్న సబ్బండ వర్గాల ప్రజలు “తిరగబడతాం తరిమికొడదాం”పోస్ట్ కార్డ్ మరియు మిస్ కాల్ కార్యక్రమంలో భాగ్య స్వాములు కావాల్సిందిగా కోరుతున్నామని ఆయన కోరారు.ఈకార్యక్రమంలో టిపిసిసి హ్యూమన్ రైట్స్ ఆర్టిఐ కన్వీనర్ త్యాళ్లపల్లి కృష్ణ,కాంగ్రెస్ పార్టీ ఇబ్రహీంపట్నం నాయకుడు నందు,అబ్ధుల్లాపుర్మెట్ మున్సిపాలిటీ ఉపాధ్యక్షులు మదు గౌడ్,దండుమైలారం జి.కాశిరెడ్డి,వెంకట్ రావు,బీరప్ప,పి.నగేష్,భిక్షపతి,