- నిద్రిస్తున్న సమయంలో పెట్రోల్ పోసి నిప్పు
- చావుబతులకుల్లో యువతి ..యువకుడి పట్టివేత
రాంచి,అక్టోబర్7:అతడికి ఇదివరకే పెళ్లయింది. కానీ తన మాజీ ప్రేయసిని పెళ్లాడాలని ఆమెను బలవంతపెట్టాడు. దానికి ఆ యువతి నిరాకరించడంతో ..ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు.తనని పెళ్లి చేసుకునేందుకు నిరాకరించిందని 22 ఏళ్ల యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడా దుర్మార్గుడు. యువతి నిద్రిస్తున్న సమయంలో ఇంట్లోకి దూరి ఆమెను చంపాడు. ఈ ఘటన ఝార్ఖండ్‌లోని డుమ్కా జిల్లాలో జరిగింది. డుమ్కా జిల్లా బాల్కీ గ్రామానికి చెందిన ఓ యువతికి మహేశ్పూర్కు చెందిన రాజేష్ అనే యువకుడితో 2019లో పరిచయం ఏర్పడింది.
దాదాపు మూడేళ్లుగా వారిద్దరూ ప్రేమించుకుంటుడగా 2022లో రాజేష్‌కు మరొకరితో వివాహం జరిగింది. దీంతో యువతి తల్లిదండ్రులు సైతం ఆమెను మరొకరి ఇచ్చి వివాహం జరిపించేందుకు సిద్ధమయ్యారు. కానీ రాజేష్ మాత్రం తననే పెళ్లి చేసుకుంటానని యువతి వెంటపడ్డాడు. యువతి ఎంత చెప్పిన వినకపోవడంతో ఆమెను చంపుతానని బెదిరించాడు.శుక్రవారం ఉదయం ఎవరూ లేని సమయం చూసుకుని రాజేష్ యువతి ఇంటికి వెళ్లాడు. ఇంటి తలుపులు బద్దలు కొట్టుకుని వెళ్లి అప్పటికే పడుకుని ఉన్న యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు.
తర్వాత అక్కడ నుంచి పరారయ్యాడు. కుటుంబసభ్యులు హుటాహుటిన ఆమెను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం యువతి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. తదుపరి చికిత్స కోసం మరో ఆస్పత్రికి తరలించాలని సూచించారు. నిందితుడ్ని పట్టుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.