హైదరాబాద్,ప్రజాతంత్ర,ఆగస్ట్
చెక్‌తో పాటు దుస్తులు, నిత్యావసర వస్తువులను బాధితులకు అందజేశారు.కొండచరియల కింద పడి గుర్తు పట్టలేనంతగా మారిపోయిన వందల మృతదేహాలను సాముహిక ఖననం చేసిన ముండక్కై స్మశాన వాటికలో మృతులకు సీతక్క శ్రద్దాంజలి ఘటించారు. ఈ సందర్భంగా కొందరు మృతుల కుటుంబ సభ్యులతో మాట్లాడి వారిని ఓదార్చారు. కాగా, ఇటీవల వయనాడ్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ప్రకృతి విలయతాండవం సృష్టించిన విషయం తెలిసిందే. భారీ వర్షాలు, వరదలు పలు ప్రాంతాలను ముంచెత్తగా.. కొండ చరియలు విరిగిపడి కొన్ని గ్రామాలకు గ్రామాలే నేలమట్టం అయ్యాయి. ఈ విషాద ఘటనలో దాదాపు 400 మందికి పైగా మృతి చెందగా.. వెయి మందికి పైగా గాయాలపాలయ్యారు. ప్రకృతి భీభత్సం వల్ల కొన్ని వందల కుటుంబాల గూళ్లు చెదిరిపోయాయి.