కుత్బుల్లాపూర్, ప్రజాతంత్ర, ఆగస్టు 03 : ఇటీవల వచ్చిన వరదల వల్ల నష్టపోయిన బాధితులను ఆదుకోవడానికి తోచినంత సాయం అందించేందుకు కార్యకర్తలు, నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో ముందుకు రావాలని మేయర్ కోలన్ నీలా గోపాల్ రెడ్డిపిలుపునిచ్చారు. గురువారం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ సహకారంతో మేయర్ కోలన్ నీలా గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో 9వ డివిజన్ కార్పొరేటర్ రజిత రవికాంత్ తరుపున, స్థానిక డివిజన్ ఆయా కాలనీ, అపార్ట్మెంట్స్ అసోసియేషన్ వారి సహకారంతో నిత్యావసరాల వస్తువులు సేకరించారు. ములుగు జిల్లాలో భారీ వర్షాల కారణంగా పలు గ్రామాలు నీట మునిగిన నేపథ్యంలో జిల్లా నియోజిక వర్గం దొడ్ల, మేడారం వంటి ప్రాంతాల్లో వరద బాధితుల సహాయార్ధం బియ్యం, నిత్యావసరాల వస్తువులు, బట్టలు, దుప్పట్లు సామాగ్రిని సేకరించి, దాదాపు వెయ్యి మంది వరద బాధిత కుటుంబాలకు పంపిణీ చేసారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ వరద బాధితులను ఆదుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎల్లపుడూ కృషి చేస్తుందని అన్నారు. అదే విధంగా వరద బాధితులకు అండగా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్న 9వ డివిజన్ కార్పొరేటర్ రజిత రవికాంత్ కు, డివిజన్ వాసులకు అభినందనలు తెలిపారు. వరదల్లో నష్టపోయిన బాధితులకు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రవికాంత్, ఎన్ఎంసి బిఆర్ఎస్ జాయింట్ సెక్రటరీ దండుగుల స్వామి, స్థానిక డివిజన్ ప్రెసిడెంట్ ప్రవీణ్, శెషి, దుర్గా రెడ్డి, ఫణి కుమార్, శేషు, రాజు, రమేష్, సురేష్, ఇతర ముఖ్యులు పాల్గొన్నారు.