వరద బాధితులను తక్షణమే ఆదుకోవాలి

‌సుబేదారి(హన్మకొండ), ప్రజాతంత్ర, ఆగస్టు 2 : రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు వరంగల్‌, ‌హనుమకొండ ప్రాంతాలలో అనేక లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురయ్యాయని ఈ ప్రాంతంలోని ప్రజలను ఆదుకునేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని రాష్ట్ర గవర్నర్‌ ‌తమిళి సై సౌందరరాజన్‌ ‌విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జూలై14 నుండి 28 వరకు కురిసిన భారీ వర్షాలకు హనుమకొండ, వరంగల్‌  ‌నగరం అతలకుతలమైంది. వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాలను రాష్ట్ర గవర్నర్‌, ‌లెఫ్టినెంట్‌ ‌గవర్నర్‌ ఆఫ్‌ ‌పాండిచ్చేరి డాక్టర్‌ ‌సౌందర్య రాజన్‌ ‌బుధవారం పర్యటించి పరిశీలించారు. గవర్నర్‌ ‌జవహర్‌ ‌నగర్‌, ‌నయీంనగర్‌, ‌భద్రకాళి బండ్‌, ఎన్టీఆర్‌ ‌నగర్‌, ఎన్‌ఎన్‌నగర్‌ ‌ప్రాంతాలను పర్యటించి నష్టం వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా జవహర్‌ ‌నగర్‌లో ‘‘రెడ్‌ ‌క్రాస్‌ ‌సొసైటీ’’ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో గవర్నర్‌ ‌మాట్లాడుతూ… స్థానిక రెడ్‌ ‌క్రాస్‌ ‌సొసైటీ అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ ‌ద్వారా తెలియజేశానని అన్నారు. ఇది చాలా దురదృష్టకరమని, అనేక ముంపు ప్రాంతాలలో దెబ్బ తిన్న రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ వెంటనే పునరుద్ధరించుటకు తగిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రాంతంలోని ప్రజలకు రెడ్‌ ‌క్రాస్‌ ‌సొసైటీ ద్వారా సహాయ సహకారాలు అందిస్తామని ఆమె అన్నారు. అయితే భారీ వర్షాలకు ముంపుకు గురి కాకుండా ఈ ప్రాంతాలలో శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి తగిన చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వానికి తన నివేదిక ద్వారా సూచించనున్నట్లు ఆమె అన్నారు.

వరదలు వొచ్చినప్పుడు లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసే విధంగా, వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించుటకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని ఆమె కోరారు. ప్రజలకు నిత్యవసర సరుకులు ఆహారం అందించడానికి రెడ్‌ ‌క్రాస్‌ ‌సొసైటీ స్థానిక అధికారులు తగిన చర్యలు చేపట్టనున్నట్లు గవర్నర్‌ ‌తెలిపారు. ముంపు ప్రాంతాలలో ప్రజలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముంపు ప్రాంతాలలో ఇప్పటికే కేంద్ర బృందం పరిశీలించినట్టు ఆమె తెలిపారు. ఈ విలేఖరుల సమావేశంలో వరంగల్‌ ‌రెడ్‌ ‌క్రాస్‌ ‌సొసైటీ అధ్యక్షుడు డాక్టర్‌ ‌పెసరు విజయ్‌ ‌చందర్‌ ‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

గవర్నర్‌కు ఘన స్వాగతం :
రాష్ట్ర గవర్నర్‌ ‌డాక్టర్‌ ‌తమిళ సౌందర్య రాజన్‌ ‌బుధవారం వరంగల్‌ ‌పర్యటన సందర్భంగా ఉదయం 8:30 గంటలకు స్థానిక ఎన్‌ఐటికి చేరుకు న్నారు. ఈసందర్భంగా గవర్నర్‌కు హనుమకొండ జిల్లా కలెక్టర్‌ ‌సిక్తా పట్నాయక్‌, ‌వరంగల్‌ ‌జిల్లా కలెక్టర్‌ ‌ప్రావీణ్య, పోలీస్‌ అధికారులు గవర్నర్‌కు ఘనంగా స్వాగతం పలికారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page