వికారాబాద్ లో బిఆర్ఎస్ పార్టీ ఓటమి ఖాయం అయిపోయింది

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 12: వికారాబాద్ లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినట్టేనని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం వికారాబాద్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు పార్టీ పట్టణ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి రత్నారెడ్డి కిషన్ నాయక్ రామచంద్రారెడ్డి సిద్ధులూరు సర్పంచ్ ఆంజనేయులు లు మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరుతుండడంతో బిఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులకు మతిభ్రమించిపోయి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని సరైన పద్ధతి కాదని హెచ్చరించారు. ఎమ్మెల్యే అవినీతి అహంకారంతో వికారాబాద్ లో బిఆర్ఎస్ పార్టీ కథ అయిపోయిందని నాయకులు కార్యకర్తలు విసిగిపోయి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని పేర్కొన్నారు. బిఆర్ఎస్ పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు కాంట్రాక్టర్లకు ఆశపడి ఎమ్మెల్యే దగ్గర చెంచాల లాగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. స్వచ్ఛందంగా టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఆనందును ఓడించాలని లక్ష్యంతో అధికార పార్టీని వదిలి ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలో చేరి కంకణ బద్ధులై ఉన్నటువంటి వారిపై లేనిపోని ఆరోపణలు చేయడం సరికాదని వారు హెచ్చరించారు. కేవలం వికారాబాద్ అభివృద్ధికి నిధులు తీసుకువచ్చానని ప్రోసిడింగ్లను చూపిస్తావు తప్ప ఎలాంటి అభివృద్ధి నీతోనే చేతకాదు ఎమ్మెల్యే ఇలాంటి ఘటనలకు నాయకులను ప్రోత్సహించడం సరికాదు ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని అభివృద్ధిపై దృష్టి సాధించాలన్నారు. చదువుకున్న వ్యక్తివి అభివృద్ధి చేస్తావని గెలిపించి ఈ ప్రాంత ప్రజలు పెద్ద తప్పు చేశారని ఈ దాపా నిన్ను ఓడించడం ఖాయమని పేర్కొన్నారు. గతంలో కాంగ్రెస్లో ప్రసాద్ కుమార్ ఇండిపెండెంట్గా చంద్రశేఖర్ పోటీలో ఉండడంతో ఇద్దరి మధ్యలో నీవు గెలిచావు ఇప్పుడు చంద్రశేఖర్ జైరాబాద్ వెళుతున్నారు కేవలం కాంగ్రెస్లో ప్రసాద్ కుమార్ బరిలో నిలుస్తున్నారు కాబట్టి ఇప్పటికే గెలుపు ఖాయం అయిపోయింది అని పేర్కొన్నారు. భూ కబ్జాలకు పాల్పడుతూ నాయకులు ఇష్టానుసారంగా బ్లాక్ మెయిల్ చేస్తూ ఎమ్మెల్యే ఆనంద్ సైతం సిద్దులూరు భూముల్లో 30 లక్షలు తీసుకున్నారని సుధాకర్ రెడ్డి ఆరోపించారు. టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఇక వ్యక్తిగతంగా విమర్శలు మానుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ సత్యనారాయణ ఆయుబ్ అన్సారి రాజశేఖర్ మురళి నరసింహారెడ్డి బందేల్లి పంది వెంకటయ్య అనంత్ రెడ్డి నర్సింలు హనుమంతు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page