సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 23: గణిత శాస్త్ర పితామహుడు శ్రీనివాస్ రామానుజన్ జన్మదినం సందర్భంగా సిద్దిపేట పట్టణంలోని స్థానిక ఎస్ ఆర్ కె టెక్నో హై స్కూల్ లో జరిగిన గణిత శాస్త్ర దిన ఉత్సవానికి ముఖ్యఅతిథిగా అడిషనల్ డీసీపీ అడ్మిన్ అందే శ్రీనివాసరావు విచ్చేసి విద్యార్థులు రూపొందించిన ప్రదర్శనలను తిలకించి మంత్రముగ్ధులయ్యారు ,విద్యార్థిని విద్యార్థులను అభినందించి.ఈ సందర్భంగా అడిషనల్ డీసీపీ మాట్లాడుతూ…విద్యార్థిని విద్యార్థులు గణితం పై పట్టు సాధిస్తే ఉద్యోగం సాధించవచ్చని జీవితంలో త్వరగా స్థిరపడే అవకాశం ఉంటుందని తెలిపారు. విద్యార్థినీ విద్యార్థులు తల్లిదండ్రులను గురువులను ఎల్లప్పుడూ గౌరవించాలని సూచించారు. ఈ టెక్నాలజీ సమాజంలో గణితం యొక్క ప్రాధాన్యత ఎక్కువగా ఉన్నదని ఉద్యోగ సాధనకు బాగా ఉపయోగపడుతుందని తెలిపారు. స్కూల్లో టీచర్లు పాఠాలు చెప్పేటప్పుడు ఏవైనా సందేహాలు ఉంటే వెనువెంటనే తెలుసుకోవాలని తెలిపారు. క్రమశిక్షణతో మెలిగే విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు.నిత్య జీవితంలో గణితం యొక్క అవసరము మరియు ప్రాధాన్యత గురించి అమూల్యమైన సందేశం ద్వారా విద్యార్థులకు తెలియపరచడం జరిగింది.ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ వెంకటేశం, ప్రిన్సిపల్ భవాని, అధ్యాపకులు, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.