వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, ఆగస్ట్ 8: సమాజం మనకు ఏం ఇచ్చింది అనేదానికంటే సమాజానికి మనం ఎం ఇస్తున్నాము అనేది ముఖ్యం అని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు. మంగళవారం వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వారి సతీమణి సబితా ఆనంద్ ఫౌండేషన్ చైర్ పర్సన్ డాక్టర్ మెతుకు సబితా ఆనంద్ వికారాబాద్ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల లో విద్యార్థిని విద్యార్థులకు సబితా ఆనంద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా బసు పాసులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని పాఠశాలల్లో చదువుతున్న 3000 మంది పేద విద్యార్థులందరికీ సబితా ఆనంద్ ఫౌండేషన్ ద్వారా ఉచిత బసు పాసులు పంపిణి చేయడం జరుగుతుందన్నారు. సబితా ఆనంద్ ఫౌండేషన్ స్థాపించిన నాటి నుండి పేద ప్రజల అత్యవసరమైన విద్య, వైద్యానికి ప్రాధాన్యతనిస్తూ… సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతి విద్యార్థి ఉన్నత స్థానాలకు ఎదుగుతూ సమాజం మనకు ఏమిచ్చిందనే దానికంటే సమాజానికి మనం ఏమి ఇచ్చాము అనే విధంగా మన నడవడిక ఉండాలన్నారు. తల్లిదండ్రులు ఉపాధ్యాయులు గర్వపడేలా… మీరు చదివిన పాఠశాలకు మీరే ముఖ్య అతిథిగా వచ్చే విధంగా లక్ష్యసాధనలు ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వికారాబాద్ బస్ డిపో మేనేజర్ భక్షినాయక్, సిబ్బంది, ఉపాధ్యాయులు, పార్టీ నాయకులు మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.