వెన్నాడుతున్న మహమ్మారి

కొరోనా మహమ్మారి ఇంకా వెన్నాడుతూనే ఉంది. ఇప్పటి వరకు మూడు వేరియంట్‌లతో ప్రపంచ ప్రజలను ముప్పుతిప్పలు పెట్టింది. కొట్లాది మందిని వ్యాధిగ్రస్తులను చేయడంతోపాటు, లక్షల సంఖ్యలో జనాన్ని ఆహుతి తీసుకుంది. చిన్న, పెద్ద అన్న తారతమ్యం లేకుండా అందరినీ ఆవహించిన ఈ మహమ్మారి థర్డ్ ‌వేరియంట్‌తో కాస్తా తగ్గుముఖం పట్టిందనుకుంటున్న తరుణంలో స్టెల్త్ ఒమిక్రాన్‌ ‌పేరుతో మరోసారి విజృంభిస్తుండటం మరోసారి ప్రపంచ దేశాలను భయాందోళనలో పడేస్తున్నది. కొరోనా ఒమిక్రాన్‌, ‌డెల్టా, డెల్టా ప్లస్‌, ‌కస్పా వేరియంట్‌ల పేరున ప్రజలను నానా ఇబ్బందులు పెట్టింది.

ఈ వ్యాధి సోకిన వేలాది మంది లక్షలాది రూపాయాలను ఖర్చుచేసినా చివరకు ప్రాణాలు దక్కకకుండా పోయాయి. వందల కుటుంబాలు ఆర్థిక సంక్షోభంలో పడిపోయాయి. దీని బారి నుండి ప్రజలను రక్షించేందుకు ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ ‌విధించిన నేపథ్యంలో ఉపాధి కోల్పోయి, రోడ్డున పడిన పరిస్థితి ఏర్పడ్డాయి. ఇప్పుడు మరో వేరియంట్‌ ‌పేరున మరోసారి విజృంభించబోతున్న స్టెల్త్ ఒమిక్రాన్‌ ‌కూడా గత వేరియంట్‌లకన్నా ఎక్కువ స్థాయిలోనే వ్యాపించే ప్రమాదముందని అంటున్నారు. కొరోనా ఎక్కడైతే పుట్టిందో ఈ కొత్త వేరియంట్‌ ‌జన్మస్థానం కూడా అదేనంటున్నారు. రెండేళ్ళ క్రితం చైనాలోని వ్యూహాన్‌ ‌నగరంలో కొరోనా పుట్టి, ప్రపంచ వ్యాప్తంగా ప్రబలిన విషయం తెలియంది కాదు. ఇప్పుడీ కొత్త వేరియంట్‌ ‌కూడా చైనాలోనే పుట్టి  విలయతాండవం చేస్తుంది.

ఆ దేశానికే పరిమితం కాకుండా ఆగ్నేయ ఆసియా, ఐరోపాలోని కొన్ని దేశాలకు విస్తరిస్తుంది. ముఖ్యంగా ఇజ్రాయిల్‌, ‌దక్షిణ కోరియా, జర్మనీ, ఫ్రాన్స్, ‌యూకెల్లో కేసులు పెరుగుతున్నట్లు వార్తలు వొస్తున్నాయి. చైనాలోనైతే దాదాపు పదమూడు రాష్ట్రాల్లో ఇప్పటికే లాక్‌డౌన్‌ ‌విధించారు. పక్కనే మన దేశం ఉండడంతో కేంద్రం అప్రమత్తమయింది. చైనా నుండి  రాకపోకలు  ఇప్పటికే నిలిచిపోయాయి.  అయినా అప్రమత్తంగా ఉండాలని దేశంలోని అన్ని రాష్ట్రాలను కేంద్రం హెచ్చరిస్తున్నది. వాస్తవంగా మొదటి రెండు వేవ్‌లతో పోలిస్తే థర్డ్‌వేవ్‌ ‌ప్రభావం దేశంలో పెద్దగా కనిపించలేదు. మూడవ వేవ్‌ ‌వొచ్చేసరికి దేశ వ్యాప్తంగా ఎక్కువ శాతం ప్రజలు టీకా వేయించుకోవడమయింది. ఇందులో చాలామంది మొదటి డోసు టీకా వేయించుకుని, రెండవ డోసు కోసం సిద్దంగా ఉన్నవారూ లేకపోలేదు. రెండు టీకాలు వేయించుకుని బూస్టర్‌ ‌డోస్‌లు కూడా తీసుకుంటున్న వారి సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతుంది.

ఈ టీకా తీసుకున్నవారిపైన కొత్తగా వొచ్చే వేరియంట్‌ల ప్రభావం పెద్దగా ఉండబోదని శాస్త్రవేత్తలు చెబుతుండడంతో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవడం మానేశారు. ఎప్పటిలాగానే మార్కెట్‌లలో, కిరాణ తదితర షాపుల్లో పెద్ద సంఖ్యలో మాస్క్‌లు ధరించకుండానే గుమిగూడుతున్నారు. మాస్క్‌లు ధరించకపోతే ఫైన్‌ ‌వేస్తామని హెచ్చరించిన ప్రభుత్వం ఆ తర్వాత పట్టించుకోకపోవడంతో ఆ విషయాన్నే ప్రజలు మరిచిపోయారు. దానికి తగినట్లుగా ప్రభుత్వం పాఠశాలలను ప్రారంభించడానికి అనుమతిచ్చింది, ఇప్పుడు ఐటి కంపెనీలు కూడా ఒక్కొక్కటిగా తెరుస్తున్నాయి. తమ ఎంప్లాయిస్‌ను ప్రత్యక్షంగా వొచ్చి పనిచేయాలని చెబుతున్నాయి. దీంతో ఇప్పుడు రవాణా కూడా పెరిగింది. బస్సులు, మెట్రో రైళ్ళలో ట్రాఫిక్‌ ‌పెరుగుతున్నది. రెండేళ్ళ నుండి వివిధ పండుగలకు దూరమైన జనం ఇప్పుడు పండుగలన్నిటినీ ఎప్పటిలాగా సందడిగా జరుపుకోవడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. నిన్నగాక మొన్న జరిగిన హోలీ పండుగకు ఎలాంటి ఆంక్షలు లేకపోవడంతో ఇష్టారీతిన జరుపుకున్నారు. గత ఏడాది ఇదే పండుగకు ఆంక్షలు ఉండటంతో జనం ఎవరూ పాల్గొనలేదు. కాని ఈసారి మంత్రులు, ఎంఎల్‌ఏలతో సహా అందరూ భాగస్వాములైనారు.

అయితే ఈ సందర్భంగా రంగునీళ్ళు ముఖంపైన చల్లుకోవడం ద్వారా జలుబుతో తుమ్ములు, సైనస్‌ ‌ప్రాబ్లమ్స్‌లాంటివి వొచ్చే ప్రమాదం లేకపోలేదంటున్నారు. అయితే అలాంటివి బయటపడడానికి కొంత సమయం పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జూన్‌, ‌జూలైలో స్టెల్త్ ‌వేరియంట్‌  ‌ప్రభావం ఉంటుందని  చెబుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య శాఖ అధికార యంత్రాంగం హెచ్చరిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ట్రేసింగ్‌, ‌టెస్టింగ్‌, ‌ట్రీట్‌మెంట్‌ ‌విధానాన్ని కొనసాగిస్తూనే ఉండాలని, దీని వల్ల ఎప్పటికప్పుడు మానిటరింగ్‌ ‌జరిగుతుం దంటున్నారు. ఇప్పుడు దేశంలో పన్నెండు సంవత్సరాల నుంచి పద్నాలుగు ఏండ్ల మధ్య వయస్సు పిల్లలకు కూడా టీకా ఇస్తున్న పరిస్థితిలో ఫోర్త్ ‌వేవ్‌ ‌ప్రభావం జనంపైన పెద్దగా ఉండే అవకాశాలు లేవంటూనే ఎప్పటికప్పుడు చేతులు కడుగుకోవటం, శానిటైజ్‌ ‌చేసుకోవడం, మాస్క్ ‌ధరించడాన్ని మానవద్దని చెబుతున్నారు శాస్త్రవేత్తలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page