శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ప్రపంచానికి మనమే దిక్సూచి కావాలి!

భారత్‌ ‌ప్రయాణం అనితరసాధ్యం.. స్ఫూర్తిదాయకం...

స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటుతున్నా పేదరికం, నిరుద్యోగం, నిరక్షరాస్యత,రైతుల ఆత్మహత్యలు వంటి సమస్యలతో సతమవుతున్న మన దేశంలో వందల కోట్ల రూపాయలు వెచ్చించి అంతరిక్ష రాకెట్‌ ‌ప్రయోగాలు అవసరమా? అని కొంత మేధావి వర్గం విమర్శలకు దీటుగా..’’మన దేశంలోని అంతర్గత సమస్యలపై మనందరం ఐకమత్యంగా బాధ్యతతో యుద్దం చేద్దాం. కానీ విక్రమ్‌ ‌సారాభాయ్‌, అబ్దుల్‌ ‌కలాం వంటి మహానుభావుల చెప్పినట్లు అభివృద్ధి చెందిన దేశంగా మనం ఎదగాలంటే శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మనం ప్రపంచానికి దిక్సూచి కావాలి. కేవలం దీపావళి పండుగ టపాసులకు దేశవ్యాప్తంగా కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చుచేస్తున్నాం మనమంతా..!’’అంటూ స్పందించింది యావత్‌ ‌భారతం.

చంద్రయాన్‌-1‌మిషన్‌ ‌సక్సెస్‌ ‌తో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన మన ఇస్రో బృందం చంద్రుని ఉపరితలంపైకి విక్రమ్‌ ‌ల్యాండర్‌ ‌ను చేర్చడమే లక్ష్యంగా చేసిన అసాధారణ ప్రయోగం చంద్రయాన్‌-2. 2019‌జూలై22న లాంచ్‌ ‌చేసిన ఈప్రయోగం ఎన్నో దశలను దాటుకుంటూ 95%సఫలం అయిన తర్వాత ఆ మిషన్‌ ‌సెప్టెంబర్‌ 7,2019 ‌నాడు కేవలం చంద్రుడి ఉపరితలం నుంచి 2.1కిమీ ఎత్తున ల్యాండర్‌ ‌భూమి తో సాఫ్ట్ ‌వేర్‌ ‌సమస్య తలెత్తి సంధానం తెగిపోయింది. సాధారణంగా క్రికెట్‌, ‌సినిమా,రాజకీయాలపై మాత్రమే ఆసక్తి చూపే ఈ దేశ యువత ఆ రోజు అర్థరాత్రి మన జాతీయ జెండాలతో టివిలలో కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించింది.కొన్ని లక్షల కిమీ సుదూర ప్రయాణం లో లక్ష్యానికి చేరువలో కొన్ని సెకన్ల వ్యవధిలో అవకాశం చేజారడం యావత్‌ ‌మన దేశాన్ని తీవ్ర భావోద్వేగపు కన్నీళ్లతో ముంచేసింది. ఆగని కన్నీళ్లతో వున్న అప్పటి ఇస్రో చైర్మన్‌ ‌కె.శివన్‌ ‌ను మన ప్రధాని ఓదార్చిన దృశ్యం ఇప్పటికీ మన మనస్సులోనే వుంది. అయినా మన శాస్త్రవేత్తల, ఇంజనీర్ల కృషిని యావత్‌ ‌భారతం కీర్తించింది.

వేల సంవత్సరాలుగా విభిన్న మతాల వైవిధ్యంలోని ఏకత్వంతో మానవత్వాన్ని చాటిచెప్పే మన భారత భూమిపై అందరికీ నచ్చిన మతం క్రికెట్‌. ‌మహేంద్ర సింగ్‌ ‌ధోనీ నాయకత్వంలో 2011 ఐసిసి వన్డే ప్రపంచకప్‌ ‌గెలిచి మన క్రికెట్‌ ‌దేవుడు మాస్టర్‌ ‌బ్లాస్టర్‌ ‌సచిన్‌ ‌టెండూల్కర్‌ ‌ని తోటి ఆటగాళ్ళు హార్బజన్‌, ‌కోహ్లి, యువరాజ్‌ ‌సింగ్‌ ‌తదితరులు తమ భుజాలపై మోసిన దృశ్యం సచిన్‌ ‌రెండు రెండు దశాబ్దాల కలకు,శ్రమకు,పట్టుదలకు, అంకితభావానికి నిదర్శనం. ఈ జ్ఞాపకాలతో స్వదేశంలో జరిగిన 2023 ఐసిసి వన్డే ప్రపంచకప్‌ ‌టోర్నమెంట్‌ ‌లోని అన్ని మ్యాచ్‌ ‌లు గెలిచిన భారత జట్టు ఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడింది. ఆ రోజు దాదాపు 518మిలియన్ల వీక్షణలు జరిగాయి. టాస్‌ ఓడి బ్యాటింగ్‌ ‌కు వచ్చిన మన ఆటగాళ్ల ఆటకు ప్రతి భారతీయుడి గుండెవేగం పెరుగుతూనే వచ్చింది. కేవలం 240 పరుగుల వద్ద మన ఇన్నింగ్స్ ‌ముగిసింది. తర్వాత వచ్చిన ఆసీస్‌ ‌బ్యాట్స్ ‌మన్‌ ‌టావిస్‌ ‌హెడ్‌(137) ‌బ్యాటింగ్‌ ‌విధ్వంసానికి 140 కోట్ల ప్రజల కలలు కన్నీళ్లయ్యాయి. పాట్‌ ‌కమిన్స్ ‌నాయకత్వం లో 2023 వరల్డ్ ‌కప్‌ ‌విజేతగా ఆస్ట్రేలియా (6వ సారి)గెలిచింది. రోహిత్‌, ‌కోహ్లి తదితర ఆటగాళ్ళ భావోద్వేగాలను కళ్ళారా చూశాం మనం ఆ సమయంలో.అయినా ఓటమి బాధతో మళ్ళీ ఓ స్వప్నం కోసం మన రోజుకోసం వేచివున్నాం.

2024 ట్వంటీ ట్వంటీ వరల్డ్ ‌కప్‌ ‌సమరం ఆరంభమయ్యింది. మన రోజు రానే వచ్చింది జూన్‌ 29,2024.ఆ అర్థరాత్రిలో కూడా 140 కోట్లమంది భారతీయుల కళ్ళల్లో విజయ కాంక్షపు వెలుగులు ప్రసరిస్తున్నాయి. ట్వంటీ ట్వంటీ వరల్డ్ ‌కప్‌ 2024 ‌ఫైనల్‌ ‌లో భారత్‌ ‌దక్షిణాఫ్రికా తో తలపడింది. మొదట బ్యాటింగ్‌ ‌చేసిన భారత్‌ ‌నిర్ణీత 20ఓవర్లలో 176/7 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌ ‌చేసిన దక్షిణాఫ్రికా ఆటగాళ్ళ ఆట చివరి ఐదు ఓవర్లు మన దేశాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ఓటమిని ఒప్పుకోని రోహిత్‌ ‌సేన చేసిన పోరాటం యావత్‌ ‌ప్రపంచపు క్రికెట్‌ అభిమానుల మనస్సు గెలిచింది. సూర్యకుమార్‌ ‌పట్టిన క్యాచ్‌, ‌చివరి బాల్‌ అయిపోగానే మళ్ళీ ఒకప్పటి కన్నీళ్లతో ఆ గ్రౌండ్‌ ‌లోని మట్టిని ముద్దాడిన రోహిత్‌ ‌తో కూడిన కోహ్లి విజయ గర్జన మళ్ళీ ఓసారి మనదేశపు త్రివర్ణ పతాకాన్ని ఎవ్వరికీ అందనంత స్థాయిలో నిలబెట్టింది. దక్షిణాఫ్రికాపై 7 పరుగుల తేడాతో గెలిచి 2024 ట్వంటీ ట్వంటీ విశ్వ విజేత గా భారత్‌ (2‌వసారి) ఆవిర్భవించింది. అంతే ఆ అర్థరాత్రిలోనే మన దేశపు నడిరోడ్లపై మన యువత మన జాతీయ జెండాల ప్రదర్శనతో మన విజయ గీతాన్ని ప్రపంచానికి ప్రకటించింది. కలాం గారు అన్నట్లు ‘‘మన కలలన్నీ నిజమవుతాయి. కానీ దానికి ముందు నువ్వు ఎన్నో సవాళ్ళను స్వీకరించాలి.

చంద్రయాన్‌ -2 ‌లోని చిన్న చిన్న పొరపాట్ల నుంచి పాఠాలు నేర్చుకొని ఇస్రో ఈ సారి చంద్రయాన్‌ -3 ‌మిషన్‌ ‌సాయంతో చంద్రుని ఉపరితలంపై ఖచ్చితంగా భారత జెండా నిలపాలనే లక్ష్యంతో మన అందరి హీరో విక్రమ్‌ ‌సారాభాయ్‌ ‌స్ఫూర్తితో విక్రమ్‌ ‌ల్యాండర్‌ ‌జూలై 14,2023 ప్రయాణం మొదలెట్టింది. ఎన్నోరోజులు, ఎన్నో దశలు దాటుకుంటూ ఆగష్టు 23 వరకు వెళ్లింది. సాయంత్రం 6 గంటలకు మనమంతా నూతన చరిత్ర రాసే సమయం ఆసన్నమైంది. ఇస్రో ఛైర్మన్‌ ‌సోమనాథ్‌ ‌గారి కళ్ళల్లో ఆత్మవిశ్వాసం బలంగా వికసిస్తూనే వుంది.అయినా మనందరి గుండెల్లో తృటిలో చేజారిన ఆనాటి చంద్రయాన్‌ -2 ‌విజయపు జ్ఞాపకం ఆందోళనను రెట్టింపు చేసింది. అందరూ టివిలముందు ప్రత్యక్ష ప్రసారంలో లీనమయ్యారు. ఈ సారి మన గురి తప్పలేదు.విక్రమ్‌ ‌ల్యాండర్‌ ఇ‌స్రోకి సందేశం పంపింది. ఎక్కడ పోగోట్టుకున్నామో అక్కడే గెలిచాం. అంతర్జాతీయంగా భారత్‌ ‌సత్తాను చూపాం.’’ హాలీవుడ్‌ ‌సినిమా నిర్మాణం కంటే తక్కువ ఖర్చుతో భారత్‌ ‌చంద్రుని ఉపరితలాన్ని చేరిందని’’ ప్రపంచ మీడియా మన శాస్త్రవేత్తలు, ఇంజనీర్ల కృషిని, స్ఫూర్తిని అభినందించింది. ప్రతి భారతీయుడి గుండె చంద్రున్ని ముద్దాడింది.

ఇక్కడ విశేషం ఏమిటంటే చంద్రయాన్‌ -2, ‌చంద్రయాన్‌ -3 ‌సందర్భాల్లో ఇస్రో కు, 2023,2024 వరల్డ్ ‌కప్‌ ‌లో మన క్రికెటర్లకు మన దేశం నుంచి సంపూర్ణ మద్దతునిస్తూ, ప్రోత్సాహం అందిస్తూ, ఓటమిని గెలుపు గా మార్చడంలో క్రియాశీలక పాత్ర పోషించిన వ్యక్తి.. నేడు వరుసగా మూడవ సారి మనదేశానికి ప్రధాన మంత్రిగా పనిచేస్తున్న నరేంద్రమోదీ గారు.ఈ ప్రయాణంలో ఆయన పాత్రకు ప్రతి భారతీయుడు గర్వ పడాలి. నిత్యం కుటుంబ, వ్యాపార, చదువు, ఉద్యోగ, ఆర్థిక వంటి ఎన్నో సమస్యలతో సతమవుతు డిప్రెషన్‌ ‌లో ఆత్మహత్యలు చేసుకోవాల నుకుంటున్న ప్రపంచ యువతరానికి చంద్రయాన్‌ -2 ‌నుంచి చంద్రయాన్‌ -3 ‌మరియు 2023 వన్డే క్రికెట్‌ ‌వరల్డ్ ‌కప్‌ ‌నుంచి 2024 ట్వంటీ ట్వంటీ వరల్డ్ ‌కప్‌ ‌సాగిన మన శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు, క్రికెటర్లు తదితరులు సాగించిన ప్రయాణం అనితరసాధ్యం. స్ఫూర్తిదాయకం. విశ్వవిఖ్యాత ఖగోళ భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్‌ ‌హాకింగ్‌ అన్నట్లు…’’ఈ విశ్వం ఎంత పెద్దదైనా కావొచ్చు. కానీ నీ ప్రయత్నం ముందు చాలా చిన్నదే..!’’.

– ఫిజిక్స్ అరుణ్‌ ‌కుమార్‌
‌మోటివేషనల్‌ ‌స్పీకర్‌, ‌కవి, రచయిత,సామాజిక కార్యకర్త
నాగర్‌ ‌కర్నూల్‌, 9394749536

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page