- ప్రజల నుంచి అనూహ్య స్పందన..భారీ ఎత్తున పాల్గొన్న జనం
- భద్రతా ఏర్పాట్లలో పోలీసుల వైఫల్యం
- మియాపూర్ మెట్రో స్టేషన్ వద్ద పాద యాత్రలోకి ఒక్కసారిగా చొచ్చుకొచ్చిన జనం
- పలువురికి గాయాలు…ఉద్రిక్త పరిస్థితి…యాత్ర కొంత మేర రద్దు
రంగారెడ్డి, ప్రజాతంత్ర, నవంబర్ 2 : కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర 56వ రోజు, తెలంగాణలో 8వ రోజు అత్యంత ఉత్సాహంగా సాగింది. పాదయాత్ర బుధవారం ఉదయం బోయిన్ పల్లి గాంధీయన్ ఐడియాలజీ సెంటర్ నుండి ప్రారంభమైంది. న్యూ బోయిన్ పల్లి, బాలనగర్ మెయిన్ రోడ్, ఫిరోజ్ గుడా, జింకల వాడ, మూసాపేట్ మీదుగా కొనసాగి మేడ్చల్ జిల్లా పరిధి కూకట్ పల్లి నియోజకవర్గం నుండి మియాపూర్ మెట్రో రైల్వే స్టేషన్ వద్ద రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి నియోజకవర్గంలోకి ప్రవేశించింది. స్థానిక నాయకులు యాత్రకు జన సమీకరణ చేయడంలో వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో అశేష జనవాహిని యాత్రకు హాజరైంది. దీనికి తోడు మాతృశ్రీ నగర్ నుండి మదీనాగూడ వరకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న వ్యాపార సముదాయాలు కాలనీలలో నుండి భారీ ఎత్తున ప్రజలు విచ్చేసి సాదర స్వాగతం పలికారు. పలు ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు దారిలో అక్కడక్కడ నిలబడి పూల వర్షం కురిపించారు. ఆల్విన్ కాలనీ చౌరస్తా వద్ద విద్యార్థులు భారీ జాతీయ జెండాతో స్వాగతం పలికారు.
మైనారిటీలు మదీనాగూడ వద్ద ప్రత్యేకంగా ఆహ్వానం తెలిపారు. కాగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సీతక్కతో పాటు పలువురు సీనియర్ నాయకులు, నటి పూజా భట్ రాహుల్‌తో పాదయాత్రలో పాల్గొన్నారు.అసోమ్ నాగరిక్ సమాజ్ నుండి అజిత్ కుమార్ భుయాన్ మరియు పరేష్ మలాకర్ భారత్ జోడో యాత్రలో చేరారు.యాభై ఆరవ రోజు భారత్ జోడో యాత్ర హైదరాబాద్ నగరంలోని బాలానగర్ మెయిన్ రోడ్ నుండి ప్రారంభమైంది.దాని ప్రయాణంలో, అనేక మంది ప్రముఖ కార్యకర్తలు మరియు సంస్థలు భారత్ జోడో యాత్రకు తమ మద్దతును అందించాయి. నిన్న, మహిళలు మరియు లింగమార్పిడి జాయింట్ యాక్షన్ కమిటీ మరియు అనుబంధ సంస్థల నుండి దాదాపు 20 మంది ప్రతినిధుల బృందం భారత్ జోడో యాత్రలో చేరింది. రాహుల్ గాంధీతో హాల్ మీటింగ్ కూడా నిర్వహించబడింది, అక్కడ జైరామ్ రమేష్, మధు యాష్కీ, దిగ్విజయ్ సింగ్, కె రాజు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రొఫెసర్ యోగేంద్ర యాదవ్, అడ్మిరల్ రాందాస్ మరియు లలితా రాందాస్ కూడా ఉన్నారు. సహా పలు అంశాలను ప్రతినిధి బృందం ప్రస్తావించింది మధ్య మధ్యలో పలు ప్రజా సంఘాలు, అసోసియేషన్ల నాయకులు వివిధ సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు. కరాటే విద్యార్ధులతో సరదాగా మాట్లాడారు. కూకట్‌పల్లిలోని ఓ కేఫ్‌లో టీ తాగారు. వేలాదిమంది ప్రజల మధ్య ఆద్యంతం శోభాయమానంగా పాదయాత్ర మదీనాగూడలోని కినారా గ్రాండ్ హోటల్ వరకు సాగింది. అక్కడ మధ్యాహ్న భోజనం అనంతరం విశ్రాంతి తీసుకున్నారు. పాదయాత్రకు అత్యధిక జనాలను సమీకరించి విజయవంతం చేసినందుకు శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు జెరిపేటి జైపాల్, సత్యనారాయణ రావు లను రాహుల్ ప్రత్యేకంగా అభినందించారు. కాగా బుధవారం రాత్రికి ముత్తంగిలో రాహుల్ గాంధీ బస చేయనున్నారు.
మరో వైపు అదే సమయంలో, మహారాష్ట్రలోని కొల్హాపూర్ నుండి నఫ్రత్ చోడో సంవిధాన్ బచావో-జన్ సంవాద యాత్రను యోగేంద్ర యాదవ్ జెండా ఊపి ప్రారంభించారు. యాత్ర కొల్హాపూర్, సాంగ్లీ, సతారా, షోలాపూర్, ధరాశివ్, లాతూర్, ప్రభాని, హింగోలి మరియు నాందేడ్ మీదుగా నవంబర్ 11న భారత్ జోడో యాత్రలో చేరనుంది. ఈ యాత్రలో వివిధ రాజకీయ మరియు పౌర సమాజ సంస్థలు మరియు వందలాది మంది సామాన్య పౌరులు చేరారు. దేశంలోని ఇతర ప్రాంతాలలో కూడా ఇలాంటి యాత్రలు మరియు కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి.