తాండూరు, ప్రజాతంత్ర, ఆగస్టు 8: ప్రపంచశాంతి, మానవాళి సంక్షేమం కోసం రాజస్థాన్ ఝులారియా పీఠా ధిపతి ఘన్శామచార్యజీ మహరాజ్ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు తిరుపతిలో తలపెట్టిన శ్రీమహాలక్ష్మి మహా యాగ యజ్ఞం మంగళవారం అత్యంత వేడుకగా జరిగింది. మార్వాడి సమాజ్ వారి ఆహ్వానం మేరకు ఈ వేడుకల్లో తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సతీమణి ఆర్తి రెడ్డి తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఝులారియా పీఠాధిపతి ఘన్శామచార్యజీ మరియు వేద పండితులు ఆశీర్వదించి ఎమ్మెల్యే దంపతులను సన్మానించారు. లోక కల్యాణం కోసం ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం చేయడం గొప్ప విషయం అని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నారు.