ఉప్పల్, ప్రజాతంత్ర, నవంబర్ 21: సంక్షేమ పథకాల సృష్టికర్త కేసీఆర్ అని కారు గుర్తుకే ఓటు వేసి టిఆర్ఎస్ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని బండారి లక్ష్మారెడ్డి కోరారు. ఈ సందర్భంగా బండారి మాట్లాడుతూ అడగనిదే అమ్మైనా అన్నం పెట్టదు అంటారు, అలాంటిది ఎవ్వరు అడగకుండా, ఎక్కడా ధర్నాలు, రాస్తారోకోలు చెయ్యకుండానే, ఏ రాష్ట్రంలో లేని ఎన్నో సంక్షేమ పథకాలకు రూపకల్పన చేసి, వాటిని విజయవంతంగా అమలు చేస్తూ, పేదప్రజలకు అండగా నిలిచిన కేసీఆర్ ని మూడవసారి ముఖ్యమంత్రిని చేసీ హ్యాట్రిక్ సాధించాలని ఉప్పల్ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బండారు లక్ష్మారెడ్డి కోరారు. మంగళవారం ఉప్పల్ నియోజకవర్గంలో బిఅర్ఎస్ పార్టీ గెలుపుకు మీర్ పేట్, శ్రీనివాసనగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ వారు తమ సంపూర్ణ మద్దతు తెలుపారు. ఈ సందర్భంగా మంగళవారం మీర్ పేట్ హెచ్ బి కాలనీ లో ప్రచారం చేస్తున్న ఉప్పల్ బిఆర్ఎస్ ఎమ్మేల్యే అభ్యర్ధి బండారి లక్ష్మారెడ్డి ని శ్రీనివాస నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ సభ్యులు కార్పొరేటర్ ప్రభుదాస్ ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కాలనీ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ తమకు ఏ అవసరం వచ్చినా ఆదుకునే గొప్ప మనసున్న నాయకుడు బండారి లక్ష్మారెడ్డి అని అన్నారు. పేదలను బి ఎల్ ఆర్ ట్రస్ట్ ద్వారా సహాయపడుతున్న బండారి లక్ష్మారెడ్డి కి శ్రీనివాస నగర్ కాలనీ అసోసియేషన్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. కారు గుర్తుకు ఓటు వేసి ఉప్పల్ నియోజకవర్గం నుండి భారీ మెజారిటీతో బండారి లక్ష్మారెడ్డి ని గెలిపించి అసెంబ్లీకి పంపిస్తామని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.