సమాచార రక్షణ చట్టం

ప్రతి రోజు ఫోన్‌ ‌కి ఏదో ఒక ఇన్సూరెన్స్ ‌కంపెనీ నుంచి, మన అకౌంటు లేని బ్యాంకుల నుండి, ఏదో ఒక మెడికల్‌ ‌సంబంధించినటువంటి సంస్థనుండి లేక రియల్‌ ఎస్టేట్‌ ‌సంస్థ నుండి అది కొనండి ఇది కొనండి అని సతాయిస్తుంటారు వేళాపాళా లేకుండా. విద్యాసంస్థల నుండి వస్తుంది: మీ అబ్బాయి బీటెక్‌ ‌కు చదివాడు లేక ఏదో కోర్స్ ‌చేశాడు మరి విదేశాలకు వెళ్తాడా? అలాంటి ఉద్దేశం ఉంటే దానికి సహాయం చేస్తామని పోరు పెడుతుంటారు. ఈ ఏ సంస్థలతో కూడా మనకు సంబంధం ఉండదు. ఏదో గూగుల్‌ ‌లో కొన్ని విషయాల గురించి సమాచారం తెలుసుకోవాలంటే మన ఈమెయిల్‌ ‌లో ఫోన్‌ ‌నెంబర్‌ అడుగుతారు. ఇచ్చామో సచ్చామే.రోజుకు రెండుసార్లు మూడుసార్లు రకరకాల వ్యక్తులు నుండి ఈ సేవలు అందిస్తాము, ఆ వస్తువు అమ్ముతాం అని ఫోన్లు వస్తుంటాయి. బాబు మాకు వద్దు అని ఎంత చెప్పినా ఈ సతాయింపులు ఆగవు. ఈసుంట రమ్మంటే ఇల్లంతా నాదే అనే చందంగా ఉంటుంది వీరి వ్యవహారం.

మన పిల్లలు కళాశాలలో చదివినట్టు అసలు వీరికి ఎలా తెలుస్తుంది? ఈ సేవలు వస్తువుల అందించే సంస్థలు ఈ కళాశాల నుంచి, మన సమాచారం నమోదు అయివున్న రకరకాల ప్రభుత్వ సంస్థల నుండి మన సమాచారం సేకరించి వారి పబ్బం గడుపుకుంటారు. నాకు లోనవసరం ఉందని ఎలా ఈ బ్యాంకులకి తెలుస్తుంద?. అంటే మన మొబైల్‌ ‌ద్వారా కంప్యూటర్‌ ‌ద్వారా ఇంటర్నెట్‌ ‌వాడినప్పుడు లేదా ఏదైనా మనకు సంబంధం ఉన్న సంస్థలలో గాని, మన అకౌంట్‌ ఉన్న బ్యాంకులో గాని లేకపోతే మనము డిజిటల్‌ ‌రూపంలో డబ్బులు చెల్లించేందుకు పేటీఎం, జీపే వాడేందుకు మరియు ఇతరత్ర సంస్థలకు మనం ఇచ్చిన సమాచారము వారి దగ్గరనే కాకుండా అదంతా అందరికీ వెళుతుంది. ఇలాంటి సమాచారాన్ని ప్రైవేట్‌ ‌సంస్థలకు సంబంధించిన ఇంటర్నెట్‌ ‌సర్వర్లలో చేరుతుంది. సైబర్‌ ‌నేరగాళ్లు ఈ సర్వర్‌ ‌లో నుంచి మన సమాచారాన్ని మన పర్మిషన్‌ ‌లేకుండా తీసుకొని రకరకాల మోసాలకు పాల్పడుతున్నారు. ఒక సర్వే ప్రకారం మన దేశంలో ప్రతి వందమందిలో 18 మంది డాటా ఈ విధంగ తస్కరించబడి సైబర్‌ ‌నేరగాళ్ల చేతిలో మోసపోతున్నారని అనేది నిరూపితమైంది. ఇలాంటి పరిస్థితుల నుండి వ్యక్తులను రక్షించేందుకు 20019లో పర్సనల్‌ ‌డేటా ప్రొడక్షన్‌ ‌బిల్‌ ‌పార్లమెంట్లో (వ్యక్తిగత సమాచార రక్షణ) చట్టం ప్రవేశపెట్టారు. దానిమీద పార్లమెంటు సభ్యులు మార్పులు చేయాలని కోరితే దాన్ని సంయుక్త పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు వొప్ప చెప్పారు. ఈ విషయంపై చర్చించి ఈ మధ్యన 2021 లో ఆ చట్టం పేరు మార్చి సమాచార రక్షణ చట్టంగా పునర్నామా కరణం చేశారు. ఇది మళ్ళీ మొన్న పార్లమెంటులో ప్రవేశపెడితే మళ్ళీ కొన్ని అభ్యంతరాలు లేవదీయడం జరిగింది. ముఖ్యంగా 2017లో ఒక కేసులో సుప్రీంకోర్టు వ్యక్తిగత విషయాలు దుర్వినియోగం ప్రాథమిక హక్కుల కు హాని కలిగించినట్టే అని, ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ముందుకు పోవాలని తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు ఆధార్‌ ‌చేసుకొని పప్రభుత్వం పార్లమెంట్‌ ‌నుంచి ఈ బిల్లుని విరమించుకున్నారు.

మనదేశంలో 75 కోట్ల మంది ఈ డిజిటల్‌ ‌వ్యవ హారాలు నడుపు తుండడం వల్ల వారి అతి సున్ని తమైనటువంటి సమాచారం ప్రభుత్వాల దగ్గర పొందు పరచ బడింది. దీని గురించి ఒక ప్రాథమికంగా అయినా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని, ఆలస్యం చేయడం వల్ల అనర్థాలు ఉంటాయని చాలామంది నిపుణులు చెప్పారు. దీని విషయంలో అటు పౌరుల,ఇటు దేశ రక్షణకు సంబంధించిన సమాచార రక్షణకు సంబంధించిన విషయాలను కులంకషంగా పరిశీలించి చర్చించి, శ్రీకృష్ణ కమిటీ వారు చాలా స్పష్టమైన సూచనలు చేశారు. కానీ పార్లమెంట్లో ఈ సమాచారం సంబంధించి పెట్టిన బిల్లులపై జరుగుతున్న జాప్యం విషయంలో గానీ, ఈ చట్టంలో కొన్ని కీలక ప్రభుత్వ సంస్థలు ఈ సమాచార దుర్వినియోగం విషయంలో ప్రశ్నించేందుకు అవకాశం లేకుండా మినహాయింపు ఇవ్వడం వల్ల ఆ శ్రీకృష్ణ కమిషన్‌ ‌చైర్మన్‌ ‌శ్రీకృష్ణ గారు ఇలాంటి చర్య ఆరివిల్లియన్‌ అని వర్ణించారు. జార్జ్ ఆర్వెల్‌ ‌తన 1984 పుస్తకంలో ఒక బిగ్‌ ‌బాస్‌ అం‌టే నిరంకుశ రాష్ట్ర అధిపతి ప్రజలను ఏ విధంగా వారి సమాచారాన్ని ఆధారంగా భయంకరమైన, స్వేచ్ఛ రహితమైన కట్టుబాటులో ఉంచగలరని విషయాన్ని కండ్లకు కట్టినట్టు వర్ణించాడు. అంటే ఈ చట్టం ద్వారా ప్రవేశపెట్టే నిబంధనల వెనుక ఉన్నటువంటి పరిస్థితులు ప్రజా హక్కుల హరణకు దారితీస్తాయేమోనని మానవహక్కుల కార్యకర్తలు, పౌర హక్కుల నిపుణులు భయాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇంత సుదీర్ఘమైనటువంటి విషయంపై చర్చ అటు పార్లమెంటులో సభ్యుల మధ్య జరిగినప్పటికీ, ప్రజలకి ఇలాంటి విషయాలపై ఎలాంటి అవగాహన లేదు అనే విషయం మాత్రం స్పష్టం. ఇటు డిజిటల్‌ ‌మీడియాలో గాని అటు పత్రికా రంగంలో గానీ ఎక్కడ కూడా దీన్ని కూలంకషంగా చర్చించిన దాఖలాలు లేవు. అసలు శ్రీకృష్ణ కమిటీ రికమండేషన్స్ ‌సూచనలు ఏంటివి అనేది కూడా చాలామందికి తెలియదు.

కాబట్టి ప్రభుత్వాలు ఈ చట్టాల మిషతో వ్యక్తిగత సమాచార రక్షణను అడ్డుపెట్టుకొని, ప్రజల హక్కులను మరింత కాలరాయకొండ చూడవలసిన అవసరం ఉన్నది. అంతేకాకుండా ఈ మధ్య ప్రవేశపెట్టి విరమించుకున్న చట్టంలో పెద్దపెద్ద కార్పోరేట్‌ ‌సంస్థలు ప్రైవేట్‌ ‌సంస్థలు వారి సేకరించే డాటా ను సమాచారాన్ని మన దేశంలోనే పొందుపరచవలసిన అవసరం ఉందని నిబంధన ఉంది. ఇది ప్రపంచీకరణ వ్యవస్థలో డాటా ఆదారితంగా జరిగేటువంటి వ్యాపారానికి సమాచారాన్ని పంచుకునే విషయంలో కొంత దేశానికి హాని కూడా కలిగించే అవకా•శం ఉంది.అంతేకాకుండా మన దేశంలో ఐటి నిపుణులు అంతా కూడా విదేశీ సర్వర్సిని ఉపయోగించుకొని వారి యొక్క ఉద్యోగ నిర్వహణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఒకవైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విదేశీ పెట్టుబడులు రావాలని విదేశీ సంస్థలు ఇక్కడ వారి సాంకేతికతను తీసుకొచ్చి అభివృద్ధి చేయాలని అంటూనే ఇంకొక వైపు వారు అలాంటి వ్యాపారాల నిమిత్తం సేకరించే సమాచారాన్ని ఇక్కడే పొందుపరచాలని అన్న ని బంధన కొంతవరకు సమంజసమైన మరింత వరకు సాధ్యమా వుతుందో అనేది దాని గురించి సుదీర్ఘమైనటువంటి పారదర్శకమైనటువంటి చర్చ జరగవలసిన అవసరం ఉంది. ఐరోపా రాష్ట్రాలలో ఈ విషయంపై వ్యక్తిగత స్వేచ్ఛకు దేశాల భద్రతకు ఎలాంటి హాని జరగకుండా చట్టాలు చేశారు. అలాంటి చట్టాల్ని మార్గదర్శకంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంటర్నెట్లో ఉన్నటువంటి సమాచారం ద్వారా ఎన్ని ఘోరాలు చేస్తూ ప్రైవేట్‌ ‌సంస్థలు లక్షల కోట్లలో ఆదాయం సంపాదిస్తున్నాయి అనే విషయంపై సోష్న జెబాఫ్‌ అనే ఆమె తన సర్వెలాన్స్ ‌కాపిటలిజం అనే పుస్తకాల్లో చాలా వివరంగా, విపులంగా, లోతుగా విడమర్చి చెప్పారు.

అంతేకాకుండా జరోనే లీనియర్‌ ‌లేని అతను ఈ ప్రైవేట్‌ ‌సంస్థలు వినియోగదారుల సమాచారాన్ని వారికి ఎలాంటి లాభాలు ఇవ్వకుండా దుర్వినియోగం చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని తన హు ఒన్స్ ‌ఫ్యూచర్‌ అనే పుస్తకంలో వివరించారు. ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని వ్యక్తిగత సమాచార విషయంలో ప్రభుత్వాలు గానీ, ప్రైవేట్‌ ‌సంస్థలు గాని దుర్వినియోగం చేయకుండా మానవహక్కుల సంపూర్ణ రక్షణకు ప్రజా సంఘాల, మానవ హక్కుల సంస్థల, మేధావుల, ఈ రంగంలో నిపుణుల, చట్టాంగ నిపుణుల అభిప్రాయాలను సేకరించి చట్టాన్ని రూపకల్పన చేయాలి. ముఖ్యంగా ఈ మధ్య రాజకీయ ప్రయోజనాల కోసం చట్టాల్ని, ప్రభుత్వ సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారు అనేటటువంటి విషయం ఎక్కువగా వినబడుతుంది. ఇలాంటి పోకడలకు తావు ఇవ్వకుండా చట్టం తయారవ్వాలని ..అవుతుందని ఆశిద్దాం.
– డాక్టర్‌ ‌మండవ ప్రసాదరావు
హైదరాబాదు , 9963013078

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page