నా తుది శ్వాస వరకు మీ సేవలో ఉంటా.. నా శ్రాయశక్తులు కృషి చేస్తా
పేద ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లి డబ్బులు వృధా చేసుకోవద్దు
ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న వసతులను ఉపయోగించుకోవాలి
ఆరోగ్యంగా ఉండాలని న్యూట్రిషన్ కిట్ అందిస్తున్నాం
మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు
సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 23: సిద్దిపేట నియోజకవర్గం లో 11 వేల మందికి, 93 కోట్లు కళ్యాణ లక్ష్మి ద్వారా ఆర్థిక చేయూతనిచ్చాము
– సిద్దిపేట క్యాంప్ కార్యాలయం లో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణి కార్యక్రమం లో పాల్గొన్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు సిద్దిపేట క్యాంప్ కార్యాలయం లో సిద్దిపేట నియోజకవర్గం కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, 59 జీవో చెక్కుల పంపిణి కార్యక్రమం లో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు.శనివారం రోజున కళ్యాణ లక్మి 153, 59 జీవో పట్టాలు 120 మందికి అందజేశారు.. ఈ సందర్బంగా మాట్లాడుతు… సిద్దిపేట నియోజకవర్గం లో ఇప్పటి వరకు 11వేల మందికి కళ్యాణ లక్ష్మి ద్వారా 93కోట్ల ఆర్థిక చేయూత నీచ్చామని చెప్పారు.. పేదింటి అడబిడ్డ పెళ్ళికి ఆసరా గా నిలచామని చెప్పారు. సిద్దిపేట లో కార్పొరేట్ స్థాయి లో ఆసుపత్రి ని ఏర్పాటు చేశామని ప్రభుత్వ ఆసుపత్రి ని అందరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.. ప్రయివేట్ ఆసుపత్రి కి వెళ్లి డబ్బులు వృధా చేసుకోవద్దన్నారు.. సంపూర్ణ ఆశీస్సులు ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. నా శక్తి వంచన లేకుండా శ్రాయా శక్తుల కృషి చేస్తానని నా తుది శ్వాస వరకు నేను మీ సేవలో ఉంటానన్నారు.